TCS TECH HIRING FOR WOMEN PROFESSIONALS APPLICATION PROCESS ENDS ON 2022 APRIL 23 SS
TCS Jobs for Women: మహిళలకు టీసీఎస్‌లో ఉద్యోగాలు... వేర్వేరు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
TCS Jobs for Women: మహిళలకు టీసీఎస్‌లో ఉద్యోగాలు... వేర్వేరు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
(ప్రతీకాత్మక చిత్రం)
TCS Tech Hiring For Women Professionals | దిగ్గజ ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో (TCS) ఉద్యోగాలు కోరుకునే మహిళలకు గుడ్ న్యూస్. టీసీఎస్ టెక్ హైరింగ్ ఫర్ వుమెన్ ప్రొఫెషనల్స్ ప్రోగ్రామ్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కెరీర్ బ్రేక్ తీసుకున్న మహిళలకు మరో అవకాశం ఇస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రెండేళ్లకు పైగా అనుభవం ఉన్నవారిని నియమించుకుంటోంది. టీసీఎస్ టెక్ హైరింగ్ ఫర్ వుమెన్ ప్రొఫెషనల్స్ (TCS Tech Hiring For Women Professionals) పేరుతో రిక్రూట్మెంట్ ప్రాసెస్ నిర్వహిస్తోంది. కొత్తగా కెరీర్ ప్రారంభించాలనుకునేవారు లేదా పలు కారణాల వల్ల కెరీర్ బ్రేక్ తీసుకున్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. టీసీఎస్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ (BFSI), టీసీఎస్ కమ్యూనికేషన్స్, మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌లో ఉద్యోగ అవకాశాలు ఇస్తోంది. మొత్తం 42 రకాల పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి 2022 ఏప్రిల్ 23 చివరి తేదీ.
TCS Jobs for Women: టీసీఎస్ భర్తీ చేస్తున్న 42 రకాల పోస్టులు ఇవే...
1. .Net Developer
2. .Net Full Stack
3. .NET/PL SQL
4. Angular 10+
5. AWS Developer
6. Back End Developer
7. Big Data Developer
8. DevOps Architect
9. Google Cloud Platform
10. Java Developer
11. Java Full Stack Developer
12. Java Microservices
13. Java Scala
14. Java Spring Boot
15. Mobile/ Smart Device Tester
16. MySQL DB Administrator
17. Network Architect
18. Node JS Developer
19. PL/SQL
20. Python, PL/SQL
21. QA Automation
22. React JS
23. Salesforce Developer
24. Scrum Master
25. Senior Talend Developer
26. ServiceNow Developer
27. Siebel Developer
28. Tech Lead
29. Technical Delivery Manager
30. UI Developer
31. UI Lead
32. UX Designer
33. .NET + Angular
34. Automation Test Engineer
35. Automation Testing
36. Automation Testing with Selenium
37. Core Java Developer
38. Full Stack Developer
39. Java Developer
40. Java Full Stack Developer
41. VB .NET - Bengaluru/Chennai/Kochi
42. Visual Basic - CHN/IDR/KOL/HYD
సంబంధిత విభాగంలో విద్యార్హతలతో పాటు రెండేళ్లకు పైగా అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తైన తర్వాత టీసీఎస్ నుంచి అభ్యర్థులకు సమాచారం అందుతుంది. ఇక ఇప్పటికే టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ 2022, ఎంబీఏ హైరింగ్ 2022, ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ 2022, అట్లాస్ హైరింగ్ 2022 ప్రోగ్రామ్స్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.