హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TCS Smart Hiring 2022: డిగ్రీ పాస్ అయినవారికి అలర్ట్... టీసీఎస్‌లో ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి

TCS Smart Hiring 2022: డిగ్రీ పాస్ అయినవారికి అలర్ట్... టీసీఎస్‌లో ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి

TCS Smart Hiring 2022: డిగ్రీ పాస్ అయినవారికి అలర్ట్... టీసీఎస్‌లో ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి
(image: TCS)

TCS Smart Hiring 2022: డిగ్రీ పాస్ అయినవారికి అలర్ట్... టీసీఎస్‌లో ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి (image: TCS)

TCS Smart Hiring 2022 | టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) మరోసారి స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్ కోసం డిగ్రీ పాస్ అయినవారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్ వివరాలు తెలుసుకోండి.

డిగ్రీ పాస్ అయ్యారా? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? సాఫ్ట్‌వేర్ కోర్సులు చదివినవారు మాత్రమే కాదు... సాధారణ డిగ్రీ కోర్సులు పూర్తి చేసినవారు కూడా టీసీఎస్‌లో ఉద్యోగాలు పొందొచ్చు. ఇందుకోసం టీసీఎస్ అనేక ప్రోగ్రామ్స్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. టీసీఎస్ భారీగా ఫ్రెషర్స్‌ని నియమించుకుంటోంది. వేర్వేరు ప్రోగ్రామ్స్ ద్వారా గతేడాది భారీగా దరఖాస్తుల్ని టీసీఎస్ స్వీకరించింది. ఇప్పుడు మరోసారి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే టీసీఎస్ బీపీఎస్ ఫ్రెషర్ హైరింగ్ 2022 ప్రోగ్రామ్‌కు అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరోవైపు టీసీఎస్ స్మార్ట్‌ హైరింగ్‌ (TCS Smart Hiring) ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. డిగ్రీ పాస్ అయినవారు, చివరి సెమిస్టర్ చదువుతున్నవారు 2022 జనవరి 16 లోగా అప్లై చేయాలి. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంపికైన వారు టీసీఎస్ ఇగ్నైట్ సైన్స్ టు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లో చేరొచ్చు.

TCS Smart Hiring 2022: టీసీఎస్ స్మార్ట్‌ హైరింగ్‌ వివరాలివే...


దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 16

ఎగ్జామ్- తేదీని త్వరలో ప్రకటించనున్న టీసీఎస్

ఇంటర్వ్యూ- తేదీని త్వరలో ప్రకటించనున్న టీసీఎస్

విద్యార్హతలు- బీసీఎ, బీ.ఎస్సీ మ్యాథ్‌, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్‌, బయోకెమిస్ట్రీ, సీఎస్‌ లాంటి డిగ్రీలు 50 శాతం లేదా 5 CGPA లేదా అంత కంటే ఎక్కువ మార్కులతో పాస్ కావాలి. 2020, 2021లో పాసైనవారు అప్లై చేయొచ్చు. 2022లో పాసయ్యే వారు అంటే డిగ్రీ చివరి సెమిస్టర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు.

పరీక్షా విధానం- మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. సమయం రెండు గంటలు.

TCS Smart Hiring 2022: దరఖాస్తు చేయండి ఇలా


Step 1- టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేయాలనుకునేవారు https://www.tcs.com/careers/tcs-smart-hiring లింక్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్ వివరాలన్నీ చదివి TCS Next Step Portal లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 3- ఆ తర్వాత Register Now పైన క్లిక్ చేయాలి.

Step 4- ఆ తర్వాత Information Technology లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 5- విద్యార్థులు పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 6- ముందే రిజిస్ట్రేషన్ చేసినవాళ్లు లాగిన్ అయ్యాక Apply For Drive పైన క్లిక్ చేయాలి.

Step 7- టెస్ట్ మోడ్ In-Centre or Remote లో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి.

Step 8- వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

Step 9- అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి Track Your Application పైన క్లిక్ చేయాలి.

Step 10- Applied for Drive అని స్టేటస్ కనిపిస్తే దరఖాస్తు ప్రక్రియ విజయవంతం అయిందని అర్థం చేసుకోవాలి.

First published:

Tags: CAREER, Job notification, JOBS, Private Jobs, TCS

ఉత్తమ కథలు