హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TCS Recruitment 2022: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. భారీ రిక్రూమెంట్ యోచ‌న‌లో టీసీఎస్‌.. వివ‌రాలు

TCS Recruitment 2022: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. భారీ రిక్రూమెంట్ యోచ‌న‌లో టీసీఎస్‌.. వివ‌రాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TCS- Tata Consultancy Services | భారతదేశపు అతిపెద్ద టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 40,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది.

భారతదేశపు అతిపెద్ద టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS- Tata Consultancy Services) కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 40,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ టెక్ దిగ్గజం 2021లో IT డొమైన్‌లో 40,165 మందిని నియమించుకొన్నట్లు తెలిపింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో నికర ప్రాతిపదికన 35,209 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పేర్కొంది. ఇది ఒక త్రైమాసికంలో చేపట్టిన నియామకాల కంటే చాలా ఎక్కువని వివరించింది.

TCS Hiring 2022: ఆ కోర్సు చేసిన వారికి టీసీఎస్ గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌ల ప్రాసెస్ ప్రారంభం

40,000 నియామకాలు..

ఆర్థిక సంవత్సరం 2022 లో కంపెనీ 40,000ల నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకొంది. అయితే ఆ సమయంలో లక్ష మంది ఫ్రెషర్లను(Freshers) క్యాంపస్‌ల నుంచి చేర్చుకుంది. ఆర్థిక సంవత్సరం 2023కి కూడా 40,000ల మందిని కొత్తగా రిక్రూట్‌ చేసుకోవాలనే లక్ష్యంతో టీసీఎస్‌ ఉన్నట్లు సమాచారం.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ..‘ మేము 2022 కోసం ప్రస్తుత లక్ష్యానికి అనుగుణంగా కంపెనీ ఆదాయాన్ని గణనీయంగా పెంచాము. TCS లో ఉద్యోగుల సంఖ్య 5,92,125 గా ఉంది.’ అని చెప్పారు.

ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2020, 2021లో సంవత్సరాలలో MSc, MA పూర్తి చేసిన గ్రాడ్యుయేట్‌ల కోసం, 2022లో చదువుతున్న వారి కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ చేపడుతోంది. TCS అట్లాస్ హైరింగ్ కేటగిరీ కింద ఈ నియామకాలు చేపడుతోంది. ఎంపికైన అభ్యర్థులు ఒక పరీక్ష, ఇంటర్వ్యూను క్లియర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కు tcs.comలో అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 20వ తేదీన రిజిస్ట్రేషన్‌ గడువు ముగుస్తుంది.

AP Job Mela | ఏపీ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. మూడు చోట్ల జాబ్ మేళా.. అప్లికేష‌న్ వివ‌రాలు

అదే విధంగా TCS డిజిటల్ హైరింగ్ డ్రైవ్ కింద టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ BE, B Tech, ME, MTech, MCA, MSc వంటి వివిధ స్ట్రీమ్‌ల నుంచి ఫ్రెషర్‌లను నియమించుకొనే ప్రయత్నాల్లో ఉంది.

కేవలం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాత్రమే కాదు ఇన్ఫోసిస్‌ సహా టాప్ టెక్ దిగ్గజాలు కూడా ఈ ఏడాది నియామకాలు చేపట్టాలని యోచిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ మేజర్ ఇన్ఫోసిస్ గురువారం తన నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. అనంతరం విలేకరుల సమావేశంలో కొన్ని కీలక అంశాలను, లక్ష్యాలను వివరించింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్‌ల నుంచి 85,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకొన్నట్లు విలేకరులకు తెలియజేసింది.

ఈ సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో ఫ్రెషర్లకు అవకాశాలు కల్పించే యోచనలో ఉన్నట్లు తెలిపింది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్(Infosys), విప్రో(Wipro), హెచ్‌సీఎల్(HCL), కాగ్నిజెంట్(Cognizant), క్యాప్‌జెమిని(Capzemini) వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు ఈ సంవత్సరం వేలాది మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నాయి. ఈ సంవత్సరం కొత్తగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో చేరే ఫ్రెషర్ల సంఖ్య 3 లక్షలను చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

First published:

Tags: IT jobs, Tata Group, TCS

ఉత్తమ కథలు