హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TCS Recruitment: ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు గుడ్‌న్యూస్.. టీసీఎస్‌లో ఉద్యోగాలు.. అర్హత, ఇతర వివరాలు..

TCS Recruitment: ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు గుడ్‌న్యూస్.. టీసీఎస్‌లో ఉద్యోగాలు.. అర్హత, ఇతర వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2022-23 ఫైనాన్షియల్ ఇయర్‌కు సంబంధించి ఎంబీఏ ఫ్రెషర్లు, గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఇంకా చదవండి ...

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2022-23 ఫైనాన్షియల్ ఇయర్‌కు(Financial Year) సంబంధించి ఎంబీఏ ఫ్రెషర్లు(MBA Freshers) గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు(Application) చేసుకోవచ్చు. మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు తమ వర్క్‌ఫోర్స్‌లో చేరడం కోసం టీసీఎస్ మేనేజ్‌మెంట్(TCS Management) హైరింగ్(Hiring) ద్వారా ప్రత్యేక చొరవ తీసుకుందని ఐటీ కన్సల్టెన్సీ(IT Consultancy) ప్రొవైడర్(Provider) తన పేజీలో పేర్కొంది. అద్భుతమైన కెరీర్‌కు బలమైన పునాదిని నిర్మించుకునేందుకు మార్గం ఆసన్నమైందని తెలిపింది. 2020, 2021, 2022 నాటికి ఇయర్ ఆఫ్ పాసింగ్ (YOP)అయిన పాన్ ఇండియా అభ్యర్థులు స్పెషలైజేషన్‌ చేయడం కోసమే ఈ రిక్రూట్‌మెంట్ చేపడుతున్నామని టీసీఎస్ వ్యాఖ్యానించింది.

టీసీఎస్ MBA రిక్రూట్‌మెంట్ -2022: అర్హత ప్రమాణాలు

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్

మార్కెటింగ్ లేదా ఫైనాన్స్ లేదా ఆపరేషన్స్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా జనరల్ మేనేజ్‌మెంట్ లేదా బిజినెస్ అనలిటిక్స్ లేదా ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో అభ్యర్థులు రెండు సంవత్సరాల పుల్ టైమ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)/మాస్టర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (MMS)/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (PGDBA)/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (PGDM) చేసి ఉండాలి.

Health Department Jobs: నిరుద్యోగుల‌కు మంత్రి గుడ్ న్యూస్‌.. 1,326 పోస్టుల‌తో ఆ శాఖ‌లో నోటిఫికేష‌న్‌

అభ్యర్థులు MBA చదివే ముందు బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech) బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. ఎంపిక ప్రక్రియకు హాజరయ్యే సమయంలో విద్యార్థులకు ఎలాంటి బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. మొత్తం అకడమిక్ గ్యాప్ రెండు సంవత్సరాలకు మించి ఉండరాదు. ఎడ్యుకేషన్ గ్యాప్స్ ఏవైనా ఉంటే వాటిని విద్యార్థులు తప్పనిసరిగా వెల్లడించాలి. డాక్యుమెంట్ ప్రూఫ్ ద్వారా చెల్లుబాటు అయ్యే కారణాలను తెలియజేయాలి.

వయో పరిమితి

ఎంబీఏ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 2020, 2021, 2022 బ్యాచ్‌ల విద్యార్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హులు.

Study Tips: ఎక్కువ సేపు చ‌దువ‌లేక‌పోతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

దరఖాస్తు విధానం

స్టెప్-1: nextstep.tcs.com ద్వారా టీసీఎస్ Next Step Portal లోకి లాగిన్ అవ్వాలి.

స్టెప్-2: టీసీఎస్ ఎంబీఏ నియామకం కోసం రిజిస్టర్ అయి, దరఖాస్తు చేసుకోండి.

స్టెప్-3: మీరు రిజిస్ట్రర్డ్ యూజర్ అయితే, లాగిన్ అయి దరఖాస్తు ఫారమ్‌ను పూరించి సమర్పించండి. ఆ తర్వాత, ‘అప్లై ఫర్ డ్రైవ్’పై క్లిక్ చేయండి.

స్టెప్-4: మీరు కొత్త యూజర్ అయితే, రిజిస్టర్ నౌపై క్లిక్ చేసి, 'IT' కేటగిరీని ఎంచుకోండి. ఆ తరువాత మీ వివరాలను నమోదు చేయండి. చివరగా మీ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి ‘అప్లై ఫర్ డ్రైవ్‌’ పై క్లిక్ చేయండి.

స్టెప్-5: మీ టెస్ట్ మోడ్‌ను రిమోట్‌గా ఎంచుకుని, అప్లై‌ మీద క్లిక్ చేయండి.

స్టెప్-6: మీ స్టేటస్‌ను కన్ఫార్మ్ చేయడానికి ‘ట్రాక్ యువర్ అప్లికేషన్’ చెక్ చేయండి. దీంతో మీ స్టేటస్ ‘అప్లైడ్ ఫర్ డ్రైవ్’గా చూపుతుంది.

First published:

Tags: Career and Courses, Embrace, Hybrid model, IT jobs, JOBS, Recruitment, TCS

ఉత్తమ కథలు