హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TCS Recruitment 2021 : ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్‌.. TCS జాబ్స్ ద‌ర‌ఖాస్తుకు గడువు పొడిగింపు

TCS Recruitment 2021 : ఫ్రెష‌ర్స్‌కు గుడ్ న్యూస్‌.. TCS జాబ్స్ ద‌ర‌ఖాస్తుకు గడువు పొడిగింపు

(image: TCS Logo)

(image: TCS Logo)

TCS Recruitment : ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ‌నం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) నవంబర్ 30 వరకు 'స్మార్ట్ హైరింగ్' కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించింది. ఈ ప‌రీక్ష‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి గ్రాడ్యుయేష‌న్ ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు అవ‌కాశం క‌ల్పించింది.

ఇంకా చదవండి ...

  ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ‌నం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) నవంబర్ 30 వరకు 'స్మార్ట్ హైరింగ్' కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించింది. BCA, BSc (గణితం, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, IT), BVoc పూర్తి చేసిన అభ్యర్థులు 2020, 2021 సంవత్సరాల్లో CS/IT ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (Recruitment Drive) కోసం దరఖాస్తు చేసుకొనే అవ‌కాశం ఉంది. ఈ రిజిస్ట్రేషన్ ప్ర‌క్రియ పూర్తి చేసేందుకు ముందుగా నవంబర్ 15గా ఉన్న చివరి తేదీగా ఉండేది. ఆ తేదీని నవంబర్ 30, 2021 వరకు పొడిగించారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద‌ర‌ఖాస్తు చేసుకొన్న‌ అభ్యర్థులకు రాత పరీక్ష (Written Test) నిర్వ‌హించి అనంత‌రం ఇంటర్వ్యూ (Interview) ద్వారా ఎంపిక చేస్తారు. ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల‌కు ఫ‌లితాలు వారికి మెయిల్ ఆధారంగా తెలియ జేస్తుంది.

  ద‌ర‌ఖాస్తుకు అర్హత‌లు..

  - ఈ ప‌రీక్ష‌ల‌కు గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన‌వారు అర్హులు

  - 2022లో డిగ్రీ పూర్తి చేసేవారు అభ్య‌ర్థులు కూడా అర్హులే.

  - ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి తప్పనిసరిగా 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

  NIIST: ఎన్ఐఐఎస్‌టీలో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు.. జీతంరూ.31,000


  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్ర‌య పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

  Step 2 :  ముందుగా టీసీఎస్ అధికారిక వెబ్‌సైట్ లింక్‌ https://www.tcs.com/careers/tcs-off-campus-hiring ను సంద‌ర్శించాలి.

  Step 3 :  అనంత‌రం Registration Open బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి.

  Step 4 :  అనంత‌రం పూర్తి వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.

  Step 5 :  ముఖ్యంగా మెయిల్‌, మొబైల్ నంబ‌ర్లు స‌రిగా న‌మోదు చేయాలి.

  Step 6 :  ప‌రీక్ష తేదీ, ప‌రీక్ష వివ‌రాలు పూర్తిగా మెయిల్‌కు వ‌స్తాయి.

  Step 7 : ద‌ర‌ఖాస్తు పూర్తియ‌న త‌రువాత స‌బ్‌మిట్ చేయాలి.

  Step8 : అప్లికేష‌న్ స్టేట‌స్ చూసుకోవడానికి Track Your Application ఆప్ష‌న్ ఉంటుంది.

  Step 9 :  ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 30, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  ముఖ్య‌మైన స‌మాచారం..

  టీసీఎస్‌ పోర్ట‌ల్ లింక్ ద్వారా అభ్యర్థులు ఐటీ (Information Technology) లేదా బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ (Business Process Service) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్య‌ర్థులు ఒక కేటగిరీ కింద మాత్రమే నమోదు చేసుకుని నమోదు చేసుకోవచ్చు.

  IIT Madras : ఐఐటీ మ‌ద్రాస్‌లో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్


  ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు TCS వెబ్‌సైట్‌లో ముగింపు తేదీ లేదా అంతకు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

  టీసీఎస్ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్ ఫేజ్-2

  టీసీఎస్ కంపెనీ 2020 లేదా 2021 పాస్ అవుట్ అయిన BE / BTech / ME / MTech / MCA / MSc డిగ్రీ హోల్డర్ల కోసం ఆఫ్-క్యాంపస్ డ్రైవ్ ఫేజ్ 2 కోసం దరఖాస్తులను కూడా స్వీకరిస్తోంది. ఈ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్ర‌య పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి న‌వంబ‌ర్ 15 చివ‌రి తేదీ. ఈ అభ్య‌ర్థుల‌ను కూడా ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Information Technology, IT jobs, JOBS, Private Jobs, TCS

  ఉత్తమ కథలు