హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TCS Careers : "టీసీఎస్ పిలుస్తోంది".. నిరుద్యోగుల‌కు ఉచిత శిక్ష‌ణ‌.. ఉపాధి అవ‌కాశాలు

TCS Careers : "టీసీఎస్ పిలుస్తోంది".. నిరుద్యోగుల‌కు ఉచిత శిక్ష‌ణ‌.. ఉపాధి అవ‌కాశాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TATA Consultancy Services) గ్రాడ్యుయేట్స్‌కి శుభ‌వార్త చెప్పింది. వారి కెరీర్‌కు ఎంతో ఊత‌మిచ్చేలా ఉచిత కోర్సుల‌ను అందిస్తోంది. ఎన్‌క్యూటీ (NQT) ద్వారా ప‌లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఉపాధి అవ‌కాశాలు చూపుతోంది. అంతే కాకుడా అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్ రీ బిగిన్(Rebegin)ను నిర్వ‌హిస్తోంది. వాటికి ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TATA Consultancy Services) గ్రాడ్యుయేట్స్‌కి శుభ‌వార్త చెప్పింది. వారి కెరీర్‌కు ఎంతో ఊత‌మిచ్చేలా ఉచిత కోర్సుల‌ను అందించ‌నుంది. ఇందు కోసం ‘TCS iON కెరీర్ ఎడ్జ్’ ను ప్రారంభిస్తోంది. ఈ కోర్సు ద్వారా ప‌దిహేను రోజుల‌ (Fifteen Days)పాటు కెరీర్ సంబంధిత కోర్సుల‌ను నేర్చుకోవ‌చ్చు. ఈ కోర్సు యువ‌త‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని సంస్థ పేర్కొంది. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారికి వారం రోజుల పాటు క‌నీసం 7 నుంచి 10 గంట‌ల కోర్సు అందిస్తున్నారు. ప్ర‌స్తుతం గ్రామీణ‌ విద్యార్థులు ఇబ్బంది ప‌డుతున్న ఇంగ్లీష్‌ (English)పై ప్ర‌త్యేక కోర్సు అందిస్తోంది. ఇది పూర్తిగా ఆన్‌లైన్ (Online) రూపంలో కోర్సు అందిస్తున్నారు.

ఎవ‌రు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు..

- అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు (Post Graduates), ఫ్రెషర్లు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

- ముఖ్యంగా బిహేవిరియ‌ల్ అండ్ క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, అకౌంటింగ్ ఐటీ అండ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటలిజ‌న్స్‌ (Artificial intelligence) పై కోర్సులో అందించ‌నున్నారు.

- TCS iON కెరీర్ ఎడ్జ్ ప్రోగ్రాంలో యంగ్ ప్రొఫెషనల్ 14 మాడ్యూల్స్ అందిస్తుంది.

SSC Recruitment 2021: ఎస్ఎస్‌సీలో ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి


- ప్ర‌తీ మాడ్యూల్‌కు 1 నుంచి 2 రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో వీడియోలు (Videos), ప్రెజెంటేష‌న్‌లు, రీడింగ్ మెటీరియ‌ల్‌ (Reading Material), టీసీఎస్ నిపుణుల ద్వారా రికార్డు చేయ‌బ‌డిన వీడియోలు, వెబ్‌నార్‌లు (Webinar) అందిస్తుంది.

- అంతే కాకుండా విద్యార్థులు త‌మ ప్ర‌శ్న‌లు, సందేహ‌లు నివృత్తి చేసుకొనే అవ‌కాశం ఇస్తున్నారు.

- ఈ కోర్స్‌ను విజ‌య‌వంతంగా మొత్తం పూర్తి చేసిన‌ త‌రువాత ప్ర‌తిభ ఆధారంగా స‌ర్టిఫికెట్‌లను అందిస్తారు.

- అంతేకాకుండా, కోర్సును ఎప్పుడైనా, ఎక్కడైనా మరియు ఏ పరికరంలోనైనా యాక్సెస్ చేయవచ్చు.

ఏం నేర్చుకోవ‌చ్చు..

- ఈ కోర్సులో అభ్య‌ర్థికి బిహేవియ‌ర‌ల్ స్కిల్స్ ( Behavioural skills), వ‌ర్క్‌ప్లేస్‌లో ఎలా ఉండాలో నేర్పుతారు.

- క‌మ్యూనికేష‌న‌ల్ స్కిల్స్‌ఫై ప్ర‌త్యేక క్లాస్‌ (Special Class)లు ఉంటాయి.

- మంచి రెస్యూమ్ త‌యారు చేసుకోవ‌డానికి సాయం చేస్తారు.

- అకౌంటింగ్ మరియు IT యొక్క ప్రాథమిక అంశాలు నేర్పుతారు.

- ఆర్టిఫిసియ‌ల్ ఇంటలిజ‌న్స్ అంశాల‌ను నేర్పిస్తారు.

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..

Step 1: ఇది కేవ‌లం ఆన్‌లైన్ (online) ద్వారా మాత్ర‌మే అప్లె చేసుకోవాలి.

Step 2 :  కోర్సుకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్ https://learning.tcsionhub.in/courses/career-edge-young-professional/ ను సంద‌ర్శించాలి.

Step 3: అక్క‌డ మీకు కావాల్సిన కోర్సును ఎంచుకోవాలి.

Step 4: ప్రతీ కోర్సు స్ట్ర‌క్చ‌ర్‌ను చూసుకొని ఎంచుకోవాలి.

మహిళా నిపుణుల కోసం ప్రత్యేక రిక్రూట్ మెంట్ డ్రైవ్


దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) మహిళా నిపుణుల కోసం ప్రత్యేక రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను నిర్వహించనుంది. కెరీర్ గ్యాప్ తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మహిళా నిపుణుల కోసం అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ పేరును రీ బిగిన్(Rebegin)గా నిర్ణయించారు.

అర్హతలు.. దరఖాస్తు విధానం

Step 1 :  అభ్యర్థి రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య పని అనుభం ఉండాలి.

Step 2 : గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి.

Step 3 : ఆసక్తి గల అభ్యర్థులు టీసీఎస్ అధికారిక పోర్టల్ tcs.com లో TCS కెరీర్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Step 4 : అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి

Scholarship : అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోండి.. విద్యార్థుల‌కు బెస్ట్ స్కాల‌ర్‌షిప్ ప్రొగ్రాంలు


Step 5 :అనంతరం అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించండి

Step 6 : రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పైన చెప్పిన స్కిల్స్ ఆధారంగా తమ వివరాలను అందించాలి.

Step 7 : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈమెయిల్ ఐడీకి ఇంటర్వ్యూ వివరాలు పంపబడతాయి.

Step 8 : ఎంపిక విధానం ఒకే రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించనున్నారు.

అవసరమైన స్కిల్స్

SQLసర్వర్ DBA,లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మిన్, మెయిన్‌ఫ్రేమ్ అడ్మిన్, ఆటోమేషన్ టెస్టింగ్, టెస్టింగ్ కన్సల్టెంట్, ఆంగ్యులర్ JS, ఒరాకిల్ DBA,సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్, జావా డెవలపర్, డాట్నెట్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, IOS డెవలపర్, విండోస్ అడ్మిన్, పైథాన్ డెవలపర్, PLSQLper,PLSQL, ఈ ప్రొగ్రామింగ్ స్కిల్స్ ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని టీసీఎస్ పేర్కొంది.

TCS NQT 2021..

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తరచుగా నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (NQT) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెప్టెంబర్ సెషన్ ముగిసింది. ఇప్పుడు డిసెంబర్ 2021, మార్చి 2022 సెషన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కోరుకునేవారు తమకు ఉన్న వేర్వేరు స్కిల్స్‌ని నిరూపించుకోవడానికి ఈ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది. వేర్వేరు టాపిక్స్‌పై వేర్వేరు పరీక్షల్ని నిర్వహిస్తోంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే ఎగ్జామ్ రాయొచ్చు. లేదా సమీపంలో ఉన్న టీసీఎస్ ఐయాన్ ఆథరైజ్డ్ ఎగ్జామ్ సెంటర్‌లో ఈ ఎగ్జామ్ రాయొచ్చు. టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌కు (TCS NQT) సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

టాపిక్స్, ఎగ్జామ్ ఫీజు వివరాలు..

 ఎగ్జామ్ టాపిక్ ఎగ్జామ్ ఫీజు
 కాగ్నిటీవ్ స్కిల్స్ రూ.599
 యాటిట్యూడినల్ అలైన్‌మెంట్ (సైకోమెట్రిక్ టెస్ట్) రూ.399
 ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఇండస్ట్రీ రూ.399
 బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ రూ.399
 ఐటీ ప్రోగ్రామింగ్ రూ.399
 బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ రూ.399
 అకౌంటెంట్ రూ.399
 ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ సర్వీసెస్ రూ.399
 డిజిటల్ మార్కెటింగ్ రూ.399
 కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ రూ.399
 బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటీవ్ రూ.399
 బిగ్ డేటా ఆన్ క్లౌడ్ రూ.799
 మెషీన్ లెర్నింగ్ రూ.799
 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూ.799
 డిజైన్ అండ్ యాడిటీవ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ రూ.799
 ఐటీ కెరీర్స్ రెడీనెస్ ప్యాక్ రూ.999
 బీఎఫ్ఎస్ కెరీర్ రెడీనెస్ ప్యాక్ రూ.999


TCS NQT 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

ఎగ్జామ్ సెషన్స్- డిసెంబర్ 2021, మార్చి 2022

విద్యార్హతలు- డిగ్రీ, పీజీ, డిప్లొమా పాస్ కావాలి. ప్రీ-ఫైనల్, ఫైనల్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు.

కోర్సులు- విద్యార్థులు ఏ కోర్సు చదువుతున్నా నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌కు అప్లై చేయొచ్చు.

అనుభవం- ఫ్రెషర్స్ లేదా రెండేళ్ల లోపు అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు.

FCI Recruitment 2021 : ఎఫ్‌సీఐలో ఐదు, ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో 860 ఉద్యోగాలు.. జీతం రూ. 23,000


TCS NQT 2021: దరఖాస్తు విధానం

Step 1- అభ్యర్థులు ముందుగా https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలోనే టాపిక్స్ వివరాలు ఉంటాయి.

Step 3- మొదట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

Step 4- ఆ తర్వాత మీరు రాయాలనుకునే టాపిక్‌కు సంబంధించిన టెస్ట్ ఎంచుకోవాలి.

Step 5- ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

First published:

Tags: Online Education, Software, TCS

ఉత్తమ కథలు