Home /News /jobs /

TCS OFF CAMPUS HIRING PHASE 2 TATA CONSULTANCY SERVICES INVITES APPLICATIONS FROM ENGINEERING GRADUATES KNOW HOW TO APPLY SS

Jobs in TCS: కరోనా టైమ్‌లో బీటెక్ పాస్ అయ్యారా? టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

Jobs in TCS: కరోనా టైమ్‌లో బీటెక్ పాస్ అయ్యారా? టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in TCS: కరోనా టైమ్‌లో బీటెక్ పాస్ అయ్యారా? టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Jobs in TCS | టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రెండో దశ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ (TCS Off Campus drive) కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. బీటెక్, ఎంటెక్ లాంటి కోర్సులు పాస్ అయినవారు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

    కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన టై‌మ్‌లో అంటే 2020, 2021 లో బీటెక్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఆఫ్ క్యాంపస్ హైరింగ్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తోంది. 2021 సెప్టెంబర్‌లో నిర్వహించిన టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌కు (TCS Off Campus drive) అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో రెండో దశ ఉద్యోగాల భర్తీ కోసం టీసీఎస్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇప్పటికే టీసీఎస్ స్మార్ట్ హైరింగ్, టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న టీసీఎస్... ఇప్పుడు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ద్వారా మరిన్ని పోస్టుల్ని భర్తీ చేయనుంది. 2020, 2021 లో బీటెక్, ఎంటెక్ లాంటి కోర్సులు పాస్ అయిన విద్యార్థులు ఈ డ్రైవ్‌కు దరఖాస్తు చేయొచ్చు.

    Telangana Govt Jobs: తెలంగాణలో ఉద్యోగుల సర్దుబాటు ప్రారంభం... జాబ్ నోటిఫికేషన్ల సంగతేంటీ?

    TCS Off Campus drive: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 15

    విద్యార్హతలు- బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ పాస్ కావాలి. టెన్త్, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో అన్ని సెమిస్టర్లలో అన్ని సబ్జెక్టుల్లో 60 శాతం లేదా 6 CGPA మార్పులు తప్పనిసరి. పెండింగ్ బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. కేవలం ఫుల్ టైమ్ కోర్సులు పూర్తి చేసినవారే దరఖాస్తు చేయాలి. పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ కోర్సులు చేసినవారు అర్హులు కాదు.

    వయస్సు- 18 నుంచి 28 ఏళ్లు

    వర్క్ ఎక్స్‌పీరియెన్స్- రెండేళ్ల వరకు అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు.

    ఎగ్జామ్ ప్యాటర్న్- పార్ట్ ఏ లో కాగ్నిటీవ్ స్కిల్స్‌కు సంబంధించి రెండు గంటల ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ బీలో ప్రోగ్రామింగ్‌కు సంబంధించి మూడు గంటల ఎగ్జామ్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాజిక్, కోడింగ్ సెక్షన్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

    టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌కు రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Bank of Baroda Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 376 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    TCS Off Campus drive: దరఖాస్తు చేయండి ఇలా


    Step 1- టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌కు దరఖాస్తు చేయాలనుకునేవారు https://www.tcs.com/careers/tcs-off-campus-hiring లింక్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో వివరాలన్నీ చదివి TCS Next Step Portal లింక్ పైన క్లిక్ చేయాలి.

    Step 3- ఆ తర్వాత Register Now పైన క్లిక్ చేయాలి.

    Step 4- ఆ తర్వాత IT పైన క్లిక్ చేయాలి.

    Step 5- అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 6- వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

    Step 7- అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి Track Your Application పైన క్లిక్ చేయాలి.

    Step 8- Applied for Drive అని స్టేటస్ కనిపిస్తే దరఖాస్తు ప్రక్రియ విజయవంతం అయిందని అర్థం చేసుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Private Jobs, TCS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు