భారతదేశ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఎంబీఏ(MBA) విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ‘ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్’(MBA Hirign Programme) ద్వారా వారిని రిక్రూట్ చేసుకోనుంది. ఇప్పటికే బీపీఎస్ ఫ్రెషర్ హైరింగ్ ప్రోగ్రామ్ ద్వారా వేలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను టీసీఎస్ నియమించుకుంది. ఇప్పుడు ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్(Hiring Programme) ద్వారా పెద్ద ఎత్తున మేనేజ్మెంట్(Management) విద్యార్థులను నియమించుకోనుంది. ఇందులో భాగంగా అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ‘‘2022–23 ఆర్థిక సంవత్సరంలో మా వర్క్‌ఫోర్స్‌లో చేరగల మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ల కోసం ‘ఎంబీఏ హైరింగ్’ను(MBA Hiring) ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించాం. 2020,2021 & 2022లో ఉత్తీర్ణులైన ఎంబీఏ విద్యార్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.’’ అని కంపెనీ ట్వీట్ చేసింది. కాగా, అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 16లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరింది. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికి త్వరలోనే బ్యాచ్‌ల వారీగా పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను ప్రకటించనుంది.
విద్యార్హతలు
2020, 2021, 2022లో ఎంబీఏ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. 2022లో ఎంబీఏ పాస్ అయ్యే వారు అంటే ప్రస్తుతం చివరి ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ముందుగా టీసీఎస్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
హోమ్ పేజీలో వివరాలన్నీ చదివిన తర్వాత ‘టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్’ లింక్‌పైన క్లిక్ చేయండి.
ఆ తర్వాత ‘రిజిస్టర్ నౌ’ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఐటీ బటన్‌పై క్లిక్ చేయండి.
మీ పూర్తి వివరాలు, మార్క్ షీట్లు, డిగ్రీ సర్టిఫికెట్లు, రెజ్యూమ్‌ను అప్లోడ్ చేయండి.
వివరాలన్నీ సరిచేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చేయడానికి 'ట్రాక్ మై అప్లికేషన్'పై క్లిక్ చేయండి. అక్కడ అప్లైడ్ ఫర్ డ్రైవ్ అని స్టేటస్ కనిపిస్తే దరఖాస్తు ప్రక్రియ విజయవంతం అయిందని అర్థం చేసుకోవాలి.
కాగా, విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు టీసీఎస్ అయాన్ ద్వారా పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలు పంపిస్తారు. జీమెయిల్, రెడిఫ్ మెయిల్, యాహూ మెయిల్, హాట్ మెయిల్ మొదలైన అనధికారిక ఈ–మెయిల్ ఐడిల నుంచి టీసీఎస్ జాబ్ ఆఫర్లు/ నియామక పత్రాలను పంపించదు. అంతేకాదు, ఉద్యోగ ఆఫర్ల కోసం అభ్యర్థుల నుంచి ఎలాంటి డబ్బును డిపాజిట్ చేయమని అడగదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కంపెనీ కోరింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, IT jobs, Private Jobs