Home /News /jobs /

TCS MBA HIRING 2022 TATA CONSULTANCY SERVICES ONCE AGAIN BEGINS APPLICATIONS FOR MBA HIRING PROGRAM KNOW HOW TO APPLY SS

TCS Jobs 2022: ఆ కోర్సు పాస్ అయినవారికి మరో ఛాన్స్... టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండిలా

TCS Jobs 2022: ఆ కోర్సు పాస్ అయినవారికి మరో ఛాన్స్... టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండిలా
(image: TCS)

TCS Jobs 2022: ఆ కోర్సు పాస్ అయినవారికి మరో ఛాన్స్... టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండిలా (image: TCS)

TCS Jobs 2022 | టీసీఎస్‌లో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. బీటెక్, ఎంటెక్ పూర్తిచేసినవారు మాత్రమే కాదు... ఇతర కోర్సులు చదివినవారు కూడా టీసీఎస్‌లో ఉద్యోగాలు (Jobs in TCS) పొందొచ్చు. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

    టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) వేర్వేరు ప్రోగ్రామ్స్ ద్వారా ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇప్పటికే టీసీఎస్ బీపీఎస్ ఫ్రెషర్ హైరింగ్ 2022, టీసీఎస్ స్మార్ట్‌ హైరింగ్‌ 2022 ప్రోగ్రామ్స్‌కు అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఇప్పుడు టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ (TCS MBA Hiring) ప్రోగ్రామ్ ద్వారా దరఖాస్తుల్ని కోరుతోంది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ ద్వారా గతేడాది దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంబీఏ పాస్ అయినవారికి, చదువుతున్నవారికి మరో అవకాశం ఇస్తోంది టీసీఎస్. ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్‌కు అప్లై చేయడానికి 2022 జనవరి 16 వరకు అవకాశం ఉంది.

    టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ టెస్ట్స్ 2021 నవంబర్ 21న ప్రారంభమయ్యాయి. బ్యాచ్‌ల వారీగా నిరంతరం పరీక్షలు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఎగ్జామ్ వివరాలు తెలుసుకోవచ్చు. టెస్ట్‌, ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసినవారిని 2022-23 ఆర్థిక సంవత్సరంలో వీరిని నియమించనుంది టీసీఎస్. ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

    SBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐలో 1,226 ఉద్యోగాలు... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే

    TCS MBA Hiring 2022: టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ వివరాలివే


    దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 16

    టెస్ట్ తేదీ- బ్యాచ్‌లవారీగా పరీక్ష నిర్వహిస్తోంది టీసీఎస్. రిజిస్ట్రేషన్ పూర్తైనవారికి పరీక్ష సమాచారాన్ని అందిస్తుంది.

    ఇంటర్వ్యూ తేదీ- త్వరలో ప్రకటించనున్న టీసీఎస్

    విద్యార్హతలు- 2022, 2021 లో ఎంబీఏ పాస్ అయినవారు దరఖాస్తు చేయాలి. 2022 లో ఎంబీఏ పాస్ అయ్యేవారు అంటే చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు.

    టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    టీసీఎస్ ఎంబీఏ హైరింగ్‌కు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    IARI Recruitment 2022: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జాబ్స్... టెన్త్ పాస్ అయితే చాలు

    TCS MBA Hiring 2022: దరఖాస్తు చేయండి ఇలా


    Step 1- టీసీఎస్ ఎంబీఐ హైరింగ్ ప్రోగ్రామ్‌కు అప్లై చేయడానికి https://www.tcs.com/careers/management-hiring-yop-2020-2022 లింక్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో వివరాలన్నీ చదివిన తర్వాత TCS Next Step Portal లింక్ పైన క్లిక్ చేయాలి.

    Step 3- ఆ తర్వాత Register Now పైన క్లిక్ చేయాలి.

    Step 4- ఆ తర్వాత IT పైన క్లిక్ చేయాలి.

    Step 5- అభ్యర్థి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 6- ముందే రిజిస్ట్రేషన్ చేసినవారు నేరుగా లాగిన్ చేసి దరఖాస్తు చేయొచ్చు.

    Step 7- మోడ్ ఆఫ్ టెస్ట్ రిమోట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

    Step 8- వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

    Step 9- అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి Track Your Application పైన క్లిక్ చేయాలి.

    Step 10- Applied for Drive అని స్టేటస్ కనిపిస్తే దరఖాస్తు ప్రక్రియ విజయవంతం అయిందని అర్థం చేసుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Job notification, JOBS, Private Jobs, TCS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు