Home /News /jobs /

TCS LAUNCHES BIGGEST EVER RECRUITMENT DRIVE KNOW HOW TO APPLY EVK

TCS Recruitment: టీసీఎస్ అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్.. దరఖాస్తు చేసుకోండి ఇలా

(image: TCS)

(image: TCS)

దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) మహిళా నిపుణుల కోసం ప్రత్యే రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను నిర్వహించనుంది. కెరీర్ గ్యాప్ తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మహిళా నిపుణుల కోసం ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) మహిళా నిపుణుల కోసం ప్రత్యేక రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను నిర్వహించనుంది. కెరీర్ గ్యాప్ తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న మహిళా నిపుణుల కోసం అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ పేరును రీ బిగిన్(Rebegin)గా నిర్ణయించారు. ఈ కార్యక్రమంపై టీసీఎస్ స్పందిస్తూ రీబిగిన్ చాలా మంచి కార్యక్రమమని అనుభజ్ఞులైన‌, సత్తా ఉన్న మహిళలకు సదవకాశం అన్నారు. టీసీఎస్ నిరంతరం ప్రతిభావంతులను ప్రోత్సహిస్తోందని అన్నారు. టీసీఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ డ్రైవ్ కు దరఖాస్తు చేసుకోవాలంటే గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. అంతే కాకుండా రెండు లేదా ఐదు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులను దేశంలో ఎక్కడైన నియమిస్తారు.

    అర్హతలు.. దరఖాస్తు విధానం
    Step 1 :  అభ్యర్థి రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య పని అనుభం ఉండాలి.
    Step 2 : గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి.
    Step 3 : ఆసక్తి గల అభ్యర్థులు టీసీఎస్ అధికారిక పోర్టల్ tcs.com లో TCS కెరీర్ లో దరఖాస్తు చేసుకోవాలి.
    Step 4 : అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి

    Amazon Jobs: అమెజాన్ లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు..


    Step 5 :అనంతరం అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించండి
    Step 6 : రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పైన చెప్పిన స్కిల్స్ ఆధారంగా తమ వివరాలను అందించాలి.
    Step 7 : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఈమెయిల్ ఐడీకి ఇంటర్వ్యూ వివరాలు పంపబడతాయి.
    Step 8 : ఎంపిక విధానం ఒకే రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించనున్నారు.

    అవసరమైన స్కిల్స్
    SQLసర్వర్ DBA,లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, నెట్‌వర్క్ అడ్మిన్, మెయిన్‌ఫ్రేమ్ అడ్మిన్, ఆటోమేషన్ టెస్టింగ్, టెస్టింగ్ కన్సల్టెంట్, ఆంగ్యులర్ JS, ఒరాకిల్ DBA,సిట్రిక్స్ అడ్మినిస్ట్రేటర్, జావా డెవలపర్, డాట్నెట్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, IOS డెవలపర్, విండోస్ అడ్మిన్, పైథాన్ డెవలపర్, PLSQLper,PLSQL, ఈ ప్రొగ్రామింగ్ స్కిల్స్ ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని టీసీఎస్ పేర్కొంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: CAREER, Information Technology, JOBS, Software developer, TCS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు