TCS ION STARTS APPLICATION PROCESS FOR NATIONAL QUALIFIER TEST DECEMBER 2021 AND MARCH 2022 SESSIONS KNOW HOW TO APPLY SS
TCS NQT 2021: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్... నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ దరఖాస్తుల్ని ప్రారంభించిన టీసీఎస్
TCS NQT 2021: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్... నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ దరఖాస్తుల్ని ప్రారంభించిన టీసీఎస్
(image: TCS ion)
TCS NQT 2021 | టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (TCS NQT) డిసెంబర్ 2021, మార్చి 2022 సెషన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏఏ టాపిక్స్‌పై ఎగ్జామ్ రాయొచ్చో, ఈ ఎగ్జామ్‌తో లాభమేంటో తెలుసుకోండి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తరచుగా నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (NQT) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెప్టెంబర్ సెషన్ ముగిసింది. ఇప్పుడు డిసెంబర్ 2021, మార్చి 2022 సెషన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కోరుకునేవారు తమకు ఉన్న వేర్వేరు స్కిల్స్‌ని నిరూపించుకోవడానికి ఈ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది. వేర్వేరు టాపిక్స్‌పై వేర్వేరు పరీక్షల్ని నిర్వహిస్తోంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS). దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయొచ్చు. లేదా సమీపంలో ఉన్న టీసీఎస్ ఐయాన్ ఆథరైజ్డ్ ఎగ్జామ్ సెంటర్లో ఈ ఎగ్జామ్ రాయొచ్చు. టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌కు (TCS NQT) సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
TCS NQT 2021: టాపిక్స్, ఎగ్జామ్ ఫీజు వివరాలు ఇవే...
ఎగ్జామ్ సెషన్స్- డిసెంబర్ 2021, మార్చి 2022 విద్యార్హతలు- డిగ్రీ, పీజీ, డిప్లొమా పాస్ కావాలి. ప్రీ-ఫైనల్, ఫైనల్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. కోర్సులు- విద్యార్థులు ఏ కోర్సు చదువుతున్నా నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌కు అప్లై చేయొచ్చు. అనుభవం- ఫ్రెషర్స్ లేదా రెండేళ్ల లోపు అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు.
Step 1- అభ్యర్థులు ముందుగా https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. Step 2- హోమ్ పేజీలోనే టాపిక్స్ వివరాలు ఉంటాయి. Step 3- మొదట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. Step 4- ఆ తర్వాత మీరు రాయాలనుకునే టాపిక్కు సంబంధించిన టెస్ట్ ఎంచుకోవాలి. Step 5- ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలనుకునే విద్యార్థులు తమ ఆసక్తి, అభిరుచులకు తగ్గట్టుగా ఈ టాపిక్స్ ఎంచుకోవచ్చు. ఈ ఎగ్జామ్‌లో లభించే స్కోర్‌కు రెండేళ్ల వేలిడిటీ ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉన్నవారు తమ స్కోర్‌ను పెంచుకోవడానికి మళ్లీ ఈ ఎగ్జామ్స్ రాయొచ్చు. మంచి స్కోర్ ఉన్నవారు కార్పొరేట్ సంస్థల్లో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఇప్పటికే 63 వేలకు పైగా అభ్యర్థులు టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌లో సాధించిన స్కోర్ ద్వారా టీసీఎస్, పబ్లికిస్ సపైంట్, క్సెనాన్స్టాక్, ఎంఫసిస్, ఐటీసీ ఇన్ఫోటెక్, ట్రెడెన్స్, టీవీఎస్ మోటార్స్, అయోపెక్స్ టెక్నాలజీస్, యూఎస్టీ గ్లోబల్, కామ్‌స్కోప్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.