హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Online Education : గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారా.. అయితే మీకోస‌మే ఈ ఉచిత కోర్సులు

Online Education : గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారా.. అయితే మీకోస‌మే ఈ ఉచిత కోర్సులు

టీసీఎస్ ఐఓన్ ఉచిత కోర్సులు

టీసీఎస్ ఐఓన్ ఉచిత కోర్సులు

గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన వారికి కెరీర్‌లో ఉప‌యోగ‌ప‌డేలా ప‌లు కోర్సుల‌ను టీసీఎస్ ఐఓన్ అందిస్తోంది. ఈ కోర్సు ద్వారా ప‌దిహేను రోజుల‌ (Fifteen Days)పాటు కెరీర్ సంబంధిత కోర్సుల‌ను నేర్చుకోవ‌చ్చు. ఈ కోర్సుల‌కు ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TATA Consultancy Services) గ్రాడ్యుయేట్స్‌కి శుభ‌వార్త చెప్పింది. వారి కెరీర్‌కు ఎంతో ఊత‌మిచ్చేలా ఉచిత కోర్సుల‌ను అందించ‌నుంది. ఇందు కోసం ‘TCS iON కెరీర్ ఎడ్జ్’ ను ప్రారంభిస్తోంది. ఈ కోర్సు ద్వారా ప‌దిహేను రోజుల‌ (Fifteen Days)పాటు కెరీర్ సంబంధిత కోర్సుల‌ను నేర్చుకోవ‌చ్చు. ఈ కోర్సు యువ‌త‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని సంస్థ పేర్కొంది. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారికి వారం రోజుల పాటు క‌నీసం 7 నుంచి 10 గంట‌ల కోర్సు అందిస్తున్నారు. ప్ర‌స్తుతం గ్రామీణ‌ విద్యార్థులు ఇబ్బంది ప‌డుతున్న ఇంగ్లీష్‌ (English)పై ప్ర‌త్యేక కోర్సు అందిస్తోంది. ఇది పూర్తిగా ఆన్‌లైన్ (Online) రూపంలో కోర్సు అందిస్తున్నారు.

ఎవ‌రు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు..

- అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు (Post Graduates), ఫ్రెషర్లు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

- ముఖ్యంగా బిహేవిరియ‌ల్ అండ్ క‌మ్యూనికేష‌న్ స్కిల్స్‌, అకౌంటింగ్ ఐటీ అండ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటలిజ‌న్స్‌ (Artificial intelligence) పై కోర్సులో అందించ‌నున్నారు.

- TCS iON కెరీర్ ఎడ్జ్ ప్రోగ్రాంలో యంగ్ ప్రొఫెషనల్ 14 మాడ్యూల్స్ అందిస్తుంది.

SSC Recruitment 2021: ఎస్ఎస్‌సీలో ఇంజ‌నీరింగ్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి


- ప్ర‌తీ మాడ్యూల్‌కు 1 నుంచి 2 రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో వీడియోలు (Videos), ప్రెజెంటేష‌న్‌లు, రీడింగ్ మెటీరియ‌ల్‌ (Reading Material), టీసీఎస్ నిపుణుల ద్వారా రికార్డు చేయ‌బ‌డిన వీడియోలు, వెబ్‌నార్‌లు (Webinar) అందిస్తుంది.

- అంతే కాకుండా విద్యార్థులు త‌మ ప్ర‌శ్న‌లు, సందేహ‌లు నివృత్తి చేసుకొనే అవ‌కాశం ఇస్తున్నారు.

- ఈ కోర్స్‌ను విజ‌య‌వంతంగా మొత్తం పూర్తి చేసిన‌ త‌రువాత ప్ర‌తిభ ఆధారంగా స‌ర్టిఫికెట్‌లను అందిస్తారు.

- అంతేకాకుండా, కోర్సును ఎప్పుడైనా, ఎక్కడైనా మరియు ఏ పరికరంలోనైనా యాక్సెస్ చేయవచ్చు.

NEET 2021 : నీట్ టాప్ 10 కాలేజీలు ఇవే.. వాటి ప్ర‌వేశాల‌కు క‌ట్ ఆఫ్ వివ‌రాలు తెలుసుకోండి


ఏం నేర్చుకోవ‌చ్చు..

- ఈ కోర్సులో అభ్య‌ర్థికి బిహేవియ‌ర‌ల్ స్కిల్స్ ( Behavioural skills), వ‌ర్క్‌ప్లేస్‌లో ఎలా ఉండాలో నేర్పుతారు.

- క‌మ్యూనికేష‌న‌ల్ స్కిల్స్‌ఫై ప్ర‌త్యేక క్లాస్‌ (Special Class)లు ఉంటాయి.

- మంచి రెస్యూమ్ త‌యారు చేసుకోవ‌డానికి సాయం చేస్తారు.

- అకౌంటింగ్ మరియు IT యొక్క ప్రాథమిక అంశాలు నేర్పుతారు.

- ఆర్టిఫిసియ‌ల్ ఇంటలిజ‌న్స్ అంశాల‌ను నేర్పిస్తారు.

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..

Step 1: ఇది కేవ‌లం ఆన్‌లైన్ (online) ద్వారా మాత్ర‌మే అప్లె చేసుకోవాలి.

Step 2 :  కోర్సుకు సంబంధించి అధికారిక వెబ్‌సైట్ https://learning.tcsionhub.in/courses/career-edge-young-professional/ ను సంద‌ర్శించాలి.

Step 3: అక్క‌డ మీకు కావాల్సిన కోర్సును ఎంచుకోవాలి.

Step 4: ప్రతీ కోర్సు స్ట్ర‌క్చ‌ర్‌ను చూసుకొని ఎంచుకోవాలి.

First published:

Tags: CAREER, EDUCATION, Engineering course, Online Education, TCS

ఉత్తమ కథలు