TCS iON Career Edge: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఉచితంగా టీసీఎస్​ అయాన్​ కెరీర్​ ఎడ్జ్ కోర్సు​

TCS iON Career Edge: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఉచితంగా టీసీఎస్​ అయాన్​ కెరీర్​ ఎడ్జ్ కోర్సు​ (ప్రతీకాత్మక చిత్రం)

TCS iON Career Edge | టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన టీసీఎస్ అయాన్ సంస్థ నిరుద్యోగులకు ఉచితంగా కెరీర్ ఎడ్జ్ కోర్స్ (TCS iON Career Edge) అందిస్తోంది. 15 రోజుల కోర్స్ ఇది.

  • Share this:
దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. వారి కెరీర్​కు ఊతమిచ్చేలా టీసీఎస్​ iON కెరీర్ ఎడ్జ్ (TCS iON Career Edge) పేరుతో ఉచిత ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సు ద్వారా15 రోజుల పాటు ఉచితంగా కెరీర్​ సంబంధించిన కోర్సు నేర్చుకోవచ్చు. యువతలో ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కొత్త కోర్సును ప్రారంభించినట్లు టీసీఎస్​ సంస్థ పేర్కొంది. కోర్సులో భాగంగా వారానికి కనీసం 7 నుంచి 10 గంటల పాటు ఆన్​లైన్​లో బోధన ఉంటుంది. ఈ కోర్సు ఎన్‌రోల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?


అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఫ్రెషర్స్ ఈ టీసీఎస్ అయాన్ కెరీర్ ఎడ్జ్ ఆన్​లైన్​ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సులో అకౌంటింగ్, ఐటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో బిహేవియరల్ & కమ్యూనికేషన్ స్కిల్స్, ఫౌండేషన్ స్కిల్స్‌తో సహా 14 మాడ్యూల్స్​పై అవగాహన కల్పిస్తారు. ప్రతి మాడ్యూల్‌ను 1 నుంచి 2 గంటల వ్యవధిలో పూర్తి చేయవచ్చు.

SBI PO Notification 2021: ఎస్‌బీఐలో 2,056 ఉద్యోగాలు... డిగ్రీ చదువుతున్నవారికీ ఛాన్స్

ప్రతి మాడ్యూల్‌లో వీడియోలు, ప్రెజెంటేషన్‌లు, రీడింగ్ మెటీరియల్, టీసీఎస్​ ఎక్స్​పర్ట్స్​ చేత రికార్డ్ చేయించిన వెబినార్లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు విద్యార్థులు తమ ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పిస్తుంది. కోర్సును ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ డివైజ్​లోనైనా యాక్సెస్ చేయవచ్చు. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్​ను అందజేస్తారు. ఇది మీ ఉద్యోగ వేటలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

కోర్సు ప్రయోజనాలు


ఈ కోర్సు ద్వారా మీ కమ్యూనికేషన్​ స్కిల్స్​ను మెరుగుపర్చుకోవచ్చు. దీనికి సంబంధించిన మాడ్యూల్స్​ను టీసీఎస్​ కోర్సులో చేర్చింది. వీటి ద్వారా ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్లను ఎలా తయారు చేయాలో నేర్చుకోవచ్చు. మెరుగైన ఫలితాలను సాధించడానికి ఎలాంటి నైపుణ్యాలు అవసరమో తెలుసుకోవచ్చు. దీంతోపాటు కెరీర్ ఎక్స్​పర్ట్స్​ నుంచి గైడెన్స్​ పొందవచ్చు.

IBPS Clerk Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ జాబ్స్... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే

కోర్సులో భాగంగా టీసీఎస్​ బిజినెస్​ ఎక్స్​పర్ట్స్​తో వెబినార్లు నిర్వహిస్తారు. ఆకర్షనీయమైన రెజ్యూమె ఎలా ప్రిపేర్​ చేయాలి? కవర్ లెటర్ ఎలా రాయాలి? వంటివి నేర్పిస్తారు. బృంద చర్చల్లో స్టేజ్​ ఫియర్​ లేకుండా ఎలా మాట్లాడాలో చెబుతారు. కార్పొరేట్ ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలి? ఎలా సక్సెస్​ కావాలో నేర్పిస్తారు. కార్పొరేట్ కంపెనీలో సిబ్బంది, మేనేజ్​మెంట్​తో ఎలా నడుచుకోవాలి? క్లయింట్స్​తో ఎలా వ్యవహరించాలో నేర్పిస్తారు.

వీటితో పాటు అకౌంటింగ్​పై బేసిక్​ ఫార్ములాలు, ఫండమెంటల్స్​ నేర్చుకోవచ్చు. కొత్త ఐటీ స్కిల్స్​ను అభివృద్ధి చేసుకోవడంపై ట్రైనింగ్​ సెషన్స్​ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై బేసిక్స్​ నేర్పిస్తారు. ఏఐ హిస్టరీ, ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లోతైన అవగాహన కల్పిస్తారు. ఏఐ ఏజెంట్, ఆర్కిటెక్చర్ల గురించి వివరిస్తారు.
Published by:Santhosh Kumar S
First published: