TCS iON: విద్యార్థులకు గుడ్ న్యూస్... టీసీఎస్ నుంచి ఆంట్రప్రెన్యూర్‌షిప్ కోర్సు

TCS iON Youth Employability and Entrepreneurship | టీసీఎస్ అయాన్ యూత్ ఎంప్లాయబిలిటీ అండ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్-YEEP ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఈ కోర్సు వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 17, 2020, 2:39 PM IST
TCS iON: విద్యార్థులకు గుడ్ న్యూస్... టీసీఎస్ నుంచి ఆంట్రప్రెన్యూర్‌షిప్ కోర్సు
TCS iON: విద్యార్థులకు గుడ్ న్యూస్... టీసీఎస్ నుంచి ఆంట్రప్రెన్యూర్‌షిప్ కోర్సు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంట్రప్రెన్యూర్ కావాలనుకుంటున్నారా? మీ ఉద్యోగ అవకాశాలు పెంచుకోవాలనుకుంటున్నారా? మీలాంటివారి కోసమే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన టీసీఎస్ అయాన్ యూత్ ఎంప్లాయబిలిటీ అండ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్-YEEP ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అహ్మదాబాద్‌కు చెందిన ఆంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-EDII తో కలిసి ఈ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. విద్యార్థులు, డిప్లొమా, ఐటీఐ, ఇతర వొకేషనల్ కోర్సులు పూర్తి చేసిన వారు యూత్ ఎంప్లాయబిలిటీ అండ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌‌లో జాయిన్ కావొచ్చు. ఫీజుతో పాటు ఇతర వివరాలను https://learning.tcsionhub.in/courses/yeep/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి భారత యువతలో ఆంట్రప్రెన్యూరల్ స్కిల్స్ పెంపొందించడం ఇప్పుడు అవసరం. స్వయం సమృద్ధి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడంతో పాటు వారి సక్సెస్ స్టోరీలను రాయడానికి కావాల్సిన అంశాలన్నింటినీ ఈ ప్రోగ్రామ్ ద్వారా అందించగలమన్న ఆశాభావంతో ఉన్నాం.

వెంగుస్వామి రామస్వామి, గ్లోబల్ హెడ్, టీసీఎస్ అయాన్


విద్యార్థులు, నిరుద్యోగులు, యువతీయువకులు తమ జీవితం, కెరీర్, ఆంట్రప్రెన్యూరల్ లాంటివాటికి కావాల్సిన అంశాలను నేర్చుకోవడానికి యూత్ ఎంప్లాయబిలిటీ అండ్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని టీసీఎస్ అయాన్ వెల్లడించింది. స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి హైక్వాలిటీ డిజిటల్ లెర్నింగ్, గ్రూప్ ఎక్సర్సైజ్, టూల్స్ లాంటివి లభిస్తాయి. అంతేకాదు... పరిశ్రమలో గల ఉపాధి, ఉద్యోగావకాశాలను తెలుసుకోవడంతో పాటు అప్లై చేయడానికి, నిపుణుల నుంచి సలహాలు స్వీకరించడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ఆంట్రప్రెన్యూరల్ మైండ్‌సెట్‌తో ఉన్న వారికి నిపుణుల నుంచి గైడెన్స్ లభిస్తుంది.
Published by: Santhosh Kumar S
First published: July 17, 2020, 2:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading