టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వ్యూహాత్మక విభాగం అయిన టీసీఎస్ ఐఓఎన్(TCS iON).. స్కూల్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం(అక్టోబరు 5) సందర్భంగా టీసీఎస్ ఐఓఎన్ కెరీర్ ఎడ్జ్- 'ది ఆర్ట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ కన్‌స్ట్రక్షన్' (The Art of Question Paper Construction) పేరుతో ఉచిత ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ప్రకటించిన కొత్త అసెస్మెంట్ ఫార్మాట్‌కు అనుగుణంగా విద్యావేత్తల కమ్యూనిటీని, విద్యార్థుల లెర్నింగ్ స్కిల్స్‌ను వాస్తవికంగా పరీక్షించే ఉన్నత నాణ్యమైన ప్రశ్నపత్రాలు, అసెస్మెంట్లు రూపొందించడానికి ఈ చొరవ తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(NEP)-2020 అసెస్మెంట్ రిఫార్మ్స్ కు అనుగుణంగా ఆర్ట్, సైన్స్‌లో ప్రభావవంతమైన ప్రశ్నలు, ప్రశ్న పత్రాలను రూపొందించేందుకు ఈ కోర్సు ఉపాధ్యాయులకు సహాయపడుతుంది.
ఈ కోర్సులో 14 మాడ్యూల్స్ ఉంటాయి. ఇవి ఇన్ సర్వీస్, ప్రీ సర్వీస్ టీచర్లకు ఉపయోగపడతాయి. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి ముందస్తు అవసరాలు(prerequisites) లేవు. ఈ కోర్సు మీరూ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.
CBSE : ఇక డిజిటల్ చెల్లింపు విధానం.. ఐపీఎస్‌ను ప్రవేశపెట్టిన సీబీఎస్‌సీ
విద్యారంగంలో అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన ప్రముఖ నిపుణుల బృందంతో టీసీఎస్ ఐఓఎన్ (TCS iON) ఈ కోర్సుకు రూపకల్పన చేసింది. బ్యాలెన్స్‌డ్ ప్రశ్న పత్రాలను రూపొందించే నైపుణ్యం పొందాలనుకునే పాఠశాల ఉపాధ్యాయులకు ఇది మంచి పునాదిని అందిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ కోర్సులో ఉపాధ్యాయులకు ఏయే అంశాలు కవర్ చేస్తారు..
- విద్యాపరిణామ క్రమంలో బేసిక్స్ (Basics of educational evaluation)
- విద్యా లక్ష్యాలను నిర్దేశించుకోవడం
- లెర్నింగ్ లక్ష్యాలను అంచనా వేయడం
- ఆబ్జెక్టివ్ ఆధారిత ప్రశ్నలు నేర్చుకోవడం
- లాంగ్ ఆన్సర్ ప్రశ్నలు
- షార్ట్ ఆన్సర్(SA), వెరీ షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు(VSA) లాంటి విషయాలను కవర్ చేస్తారు.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో 2024 నుంచి సీబీఎస్సీ విధానం.. ప్రత్యేకతలు ఏంటీ?
గత 16 నెలలుగా దేశవ్యాప్తంగా విద్యావేత్తలు అత్యంత గందరగోళంలో ఉన్నారని చెప్పారు టీసీఎస్ ఐఓఎన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి. దీంతో నూతన బోధన పద్దతులకు అలవాటు పడటం, విద్యార్థులకు నేర్పించడం లాంటివి టీచర్లకు అవసరమన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలకు వారి రోజువారీ పనిని సులభతరం చేయడానికి తగిన టూల్స్, టెక్నిక్స్ పై టీసీఎస్ ఐఓఎన్ నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు.
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం (World Teachers Day) సందర్భంగా మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సహాయపడే ఉపాధ్యాయులకు ఈ ఉచిత కోర్సును అందించడం పట్ల సంతోషంగా ఉన్నామని హర్షం వ్యక్తం చేశారు. విద్యారంగంలో ప్రముఖ నిపుణలు బృందంతో పాటు దివంగత ప్రొఫెసర్ హెచ్ఎస్ శ్రీవాత్సవ ఈ కోర్సును ముందుండి నడిపించారని చెప్పారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, EDUCATION, Online Education, TCS, Teaching