హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TCS Free Course : టీచ‌ర్స్‌కు టీసీఎస్ గుడ్ న్యూస్‌.. ఉచిత కోర్సు ప్రారంభం

TCS Free Course : టీచ‌ర్స్‌కు టీసీఎస్ గుడ్ న్యూస్‌.. ఉచిత కోర్సు ప్రారంభం

టీసీఎస్ ఐఓఎన్ కోర్సులు

టీసీఎస్ ఐఓఎన్ కోర్సులు

అక్టోబ‌ర్ 5 అంత‌ర్జాతీయ ఉపాధ్యాయ దినోత్స‌వం ఈ సంద‌ర్బంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services)కు చెందిన TCS iON ఉపాధ్యాయులు, విద్యావేత్త‌ల కోసం కొత్త కోర్సును ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఈ కోర్సును ఉచితంగా అదించ‌నుంది.

అక్టోబ‌ర్ 5 అంత‌ర్జాతీయ ఉపాధ్యాయ దినోత్స‌వం ఈ సంద‌ర్బంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services)కు చెందిన TCS iON ఉపాధ్యాయులు, విద్యావేత్త‌ల కోసం కొత్త కోర్సును ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఈ కోర్సును ఉచితంగా అదించ‌నుంది. ఇది సెల్ఫ్ పేస్డ్ కోర్సు. ఈ కోర్సు ద్వారా నూత‌న విద్యావిధానం 2020 (National Education Policy 2020)కి అనుగుణంగా ప్ర‌భావ‌వంతంగా ప్ర‌శ్నాప‌త్రాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో నేర్చుకోవ‌చ్చు. ఇది ఉపాధ్యాయుల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సంస్థ తెలిపింది. 'TCS iON కెరీర్ ఎడ్జ్-ది ఆర్ట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ కన్స్ట్రక్షన్స (TCS iON Career Edge – The Art of Question Paper Construction) పేరుతో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు. ఉపాధ్యాయుల‌కు కొత్త విష‌యాలు తెలుసుకొని నాణ్య‌మైన ప్ర‌శ్నా ప‌త్రాలు, అసైంన్‌మెంట్‌లు త‌యారు చేసేందుకు ఈ కోర్సు ఉప‌యోగ‌ప‌డుతుంది సంస్థ పేర్కొంది. సీబీఎస్‌సీ, ఐసీఎస్‌సీ విద్యావిధానంలో ప్ర‌భుత్వం ప్ర‌కటించిన కొత్త ఫార్మాట్ ప్ర‌కారం ఈ కోర్సు అందిస్తారు.

ఈ కోర్సును దివంగత ప్రొఫెసర్ హెచ్ఎస్ శ్రీవాస్తవతో పాటు ప్రముఖ నిపుణుల పెఈద్ద బృందంతో ఆయన కోర్సును నడిపించారు. శిక్షణ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అంతే కాకుండా కోర్సులో ఉపాధ్యాయాలు శారీర‌క ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకావాల్సి ఉంటుంది.

SBI PO Recruitment 2021 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఎస్‌బీఐలో 2056 పీఓ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌


ఈ సంద‌ర్భంగా TCS iON గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి మాట్లాడుతూ క‌రోనా కార‌ణంగా విద్యావిధానం పూర్తిగా అగ‌మ్య గోచ‌రంగా మారింద‌న్నారు. విద్యావేత్త‌లు పాఠ్యాంశ బోధ‌న‌లో గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు. వారికి కొత్త విధానంపై ప‌ట్టు అవ‌గాహ‌న అవ‌స‌రం అన్నారు. ఈ కొత్త బోధ‌నా ప‌ద్ధ‌తుల‌కు అనుగుణంగా వారిని మ‌ల్చుకోవ‌డానికి ఈ కోర్సు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

TCS iON అందించే కోర్సులో పాఠశాలలు, ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు వారి రోజువారీ పనిని సులభతరం చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన సాంకేతిక కొత్త విధాన‌ల‌ను నేర్పుతామ‌న్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సహాయపడుతున్న భారతదేశ ఉపాధ్యాయులకు ఈ ఉచిత కోర్సును అందించడం పట్ల మేము సంతోషిస్తున్నామ‌ని సంస్థ పేర్కొంది.

IOCL Recruitment 2021 : ఐఓసీఎల్‌లో 535 ఉద్యోగాలు.. జీతం రూ.1.05ల‌క్ష‌లు.. ద‌ర‌ఖాస్తుకుక వారం రోజులే అవ‌కాశం


TCS iON విద్యా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, సంస్థలు మరియు వ్యక్తిగత అభ్యాసకులకు ఈ కోర్సును ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇంతలో, TCS-iON అండర్ గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు కోర్ ఎంప్లాయిబిలిటీ స్కిల్స్‌తో శిక్షవ్వడానికి 15 రోజుల ఉచిత డిజిటల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను (Digital Certification Course) కూడా అందిస్తోంది. ‘కెరీర్ ఎడ్జ్-యంగ్ ప్రొఫెషనల్’ అనే ప్రోగ్రామ్ ఉచితం మరియు అందరికీ అందుబాటులో ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

Step 1 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ tcsion.com లోకి వెళ్లాలి.

Step 2 :  అందులో SIGN IN లోకి వివ‌రాలతో న‌మోదు చేసుకోవాలి.

Step 3 :  అన‌త‌రం TCS iON డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ యొక్క 14 మాడ్యూల్స్ క‌న‌బ‌డ‌తాయి.

Step 4 :  నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ బిల్డింగ్, వర్క్ ప్లేస్ కోసం సాఫ్ట్ స్కిల్స్ డెవలప్‌మెంట్, బలమైన రెజ్యూమె మరియు కవర్ లెటర్ వంటి అంశాల‌ను ఎంచుకోవ‌చ్చు.

Step 5 :  కార్పొరేట్ ఇంటర్వ్యూలను నిర్వ‌హించ‌డం వంటి అంశాల‌ను నేర్చుకోవ‌చ్చు.

First published:

Tags: EDUCATION, New course, Online Education, Private teachers, Students, TCS

ఉత్తమ కథలు