Home /News /jobs /

TCS ION BEGINS REGISTRATION PROCESS FOR NATIONAL QUALIFIER TEST KNOW HOW TO APPLY SS

TCS National Qualifier Test: కార్పొరేట్ కంపెనీలో జాబ్ మీ కలా? మీ ఇంటి నుంచే ఈ ఎగ్జామ్ రాయండి

TCS National Qualifier Test: కార్పొరేట్ కంపెనీలో జాబ్ మీ కలా? మీ ఇంటి నుంచే ఈ ఎగ్జామ్ రాయండి
(ప్రతీకాత్మక చిత్రం)

TCS National Qualifier Test: కార్పొరేట్ కంపెనీలో జాబ్ మీ కలా? మీ ఇంటి నుంచే ఈ ఎగ్జామ్ రాయండి (ప్రతీకాత్మక చిత్రం)

TCS National Qualifier Test | టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

    కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-TCS నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్-NQT కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో మీ ఇంటి నుంచే రాయొచ్చు. లేదా టీసీఎస్ ఐయాన్ ఆథరైజ్డ్ ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లి రాయొచ్చు. టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌లో వచ్చిన స్కోర్ ద్వారా టీసీఎస్ ఐయాన్ జాబ్ లిస్టింగ్ పోర్టల్‌లో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 ఆగస్ట్, 2021 నవంబర్ ఎగ్జామ్స్‌కు దరఖాస్తు చేయొచ్చు. డిగ్రీ, పీజీ, డిప్లొమా పాస్ అయినవారు, ప్రీ-ఫైనల్, ఫైనల్ చదువుతున్నవారు ఈ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఏ కోర్సు చదువుతున్నవారైనా అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ లేదా రెండేళ్ల లోపు అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి.

    కాగ్నిటీవ్ స్కిల్స్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్- రూ.599
    యాటిట్యూడినల్ అలైన్‌మెంట్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్- రూ.399
    సబ్జెక్ట్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్- రూ.399 నుంచి రూ.799
    ఇండస్ట్రీ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్)- రూ.399
    ఇండస్ట్రీ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ)- రూ.399
    బీఎఫ్ఎస్ కెరీర్ రెడీనెస్- రూ.999
    ఐటీ కెరీర్స్ రెడీనెస్- రూ.999

    Constable Jobs: టెన్త్ పాస్ అయినవారికి 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Indian Army Jobs: టెన్త్ పాస్ అయిన అమ్మాయిలకు ఆర్మీలో జాబ్స్... త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు

    విద్యార్థులు తమ అభిరుచులు, కెరీర్ గోల్స్, చదువుతున్న కోర్సులకు అనుగుణంగా ఈ పరీక్షల్ని ఎంచుకోవచ్చు. ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారికి స్కోరింగ్ ఉంటుంది. ఇందులో సాధించిన స్కోర్‌కు రెండేళ్ల వేలిడిటీ ఉంటుంది. ప్రతీ మూడు నెలలకు ఓసారి ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. స్కోర్ పెంచుకోవడం కోసం మళ్లీ ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఇందులో సాధించిన స్కోర్ ద్వారా కార్పొరేట్ సంస్థల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఇప్పటికే టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ పాస్ అయినవారిలో 55,000 పైగా అభ్యర్థులు టీసీఎస్, టీవీఎస్ మోటార్, ట్రెడెన్స్ లాంటి కంపెనీల్లో ఫ్రెషర్స్‌గా ఉద్యోగాలు సాధించడం విశేషం.

    Post Office Jobs: టెన్త్, ఇంటర్ పాసైనవారికి పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు... రూ.81,000 వరకు జీతం

    SBI Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి ఎస్‌బీఐలో 6100 జాబ్స్... అప్లై చేయండి ఇలా

    కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి, చదువు పూర్తి చేసుకొని వెంటనే ఓ మంచి కార్పొరేట్ కంపెనీలో అడుగుపెట్టాలనుకునేవారికి ఈ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్-BFSI, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-IT లాంటి రంగాల్లో ఫ్రెషర్స్‌కి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ నిర్వహిస్తోంది. టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ వివరాలను https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, TCS, Upcoming jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు