TCS INVITING APPLICATIONS FOR OFF CAMPUS HIRING FOLLOW THESE STEPS TO APPLY NS
TCS off-campus hiring: 2020, 2021లో పాసైన వారికి శుభవార్త.. TCSలో నియామకాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెలలో Off - Campus Drive ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఫ్రెషర్స్ కు శుభవార్త చెప్పింది. త్వరలోనే భారీగా నియామకాలను (Jobs Recruitment) చేపట్టనున్నట్లు ప్రకటించింది. రానున్న అక్టోబర్ మాసంలో Off-Campus హైరింగ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్ లో (TCS Official Website) సెప్టెంబర్ 24లోగా రిజిస్ట్రేషన్ (Registration) చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ లో ఎగ్జామ్ (Exam) నిర్వహించనున్నారు. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ ( B.E / B.Tech / M.E / M.Tech / MCA / M.Sc) చేసిన అభ్యర్థులు ఈ నియామకాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా 2020, 2021లో పాసై ఉండాలి.
Help Desk: అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే ilp.support@tcs.com మెయిల్ ను లేదా Toll-Free Helpline No: 18002093111 ను సంప్రదించవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.