Home /News /jobs /

TCS INVITING APPLICATIONS FOR HIRING MBA FRESHERSE EVK

TCS Recruitment 2021 : ఎంబీఏ చేసిన వారికి బెస్ట్ కెరీర్ ఆప్ష‌న్‌.. టీసీఎస్‌లో ఉద్యోగాలు

(image: TCS Logo)

(image: TCS Logo)

TCS Recruitment 2021 : ఎంబీఏ ఫ్రెషర్స్‌కు తీపి కబురు చెప్పింది ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS). ‘ఎంబీఏ హైరింగ్ (MBA Hiring)’ ప్రోగ్రామ్ కింద ఎంబీఏ ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  ఎంబీఏ ఫ్రెషర్స్‌ (MBA Freshers)కు తీపి కబురు చెప్పింది ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (Tata Consultancy Services). ‘ఎంబీఏ హైరింగ్ (MBA Hiring)’ ప్రోగ్రామ్ కింద ఎంబీఏ ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థలో ఉద్యోగులుగా చేరాలనుకుంటున్న అన్ని రకాల మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ల (Management Graduates) కోసం 'ఎంబీఏ హైరింగ్' ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చామని వెల్లడించింది. అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 9, 2021 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు తేదీ ముగిసిన అనంతరం పరీక్ష తేదీని వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది.

  "మెరుగైన కెరీర్‌కి బలమైన పునాదిని నిర్మించేందుకు 2020, 2021, 2022 సంవత్సరాల్లో పాసైన భారతీయ అభ్యర్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. అనుమతించిన స్పెషలైజేషన్‌ (Specialization)ల కోసం మాత్రమే ఈ అవకాశాలు తెరిచి ఉంటాయి" అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

  Assitant Proffesor: అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్‌డీ త‌ప్ప‌నిస‌రి స‌రైంది కాదు : ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌


  అప్లై చేయండిలా (Application Process):

  1. టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్‌ https://nextstep.tcs.com/campus/ లో లాగిన్ అవ్వండి.

  2. టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకొని దరఖాస్తు చేయండి.

  3. మీరు ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే లాగిన్ అవ్వండి. తరువాత దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయండి. ఆపై 'అప్లై ఫర్ డ్రైవ్ (apply for drive)' పై క్లిక్ చేయండి

  4. మీరు కొత్త యూజర్ అయితే రిజిస్టర్ చేసుకుని.. 'IT' ఆప్షన్ పై క్లిక్ చేసి మీ వివరాలను సబ్మిట్ చేయండి. మీ దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసి 'అప్లై ఫర్ డ్రైవ్ (apply for drive)' పై క్లిక్ చేయండి.

  5. పరీక్ష విధానం (mode of test) ఆప్షన్ లో రిమోట్‌ (Remote) అని సెలెక్ట్ చేసి ‘అప్లై’ పై క్లిక్ చేయండి.

  6. చివరగా మీ అప్లై స్టేటస్ చెక్ చేసుకోవడానికి.. ‘ట్రాక్ యువర్ అప్లికేషన్ (Track Your Application)’ చెక్ చేయండి. 'అప్లైడ్ ఫర్ డ్రైవ్' అని కనిపిస్తే.. మీరు విజయవంతంగా దరఖాస్తు చేసినట్లు గమనించాలి.

  పరీక్ష అర్హత (Eligibility)

  1. దరఖాస్తుదారులకు కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 28 ఏళ్లు ఉండాలి.

  2. ఎంబీఏ / ఎంఎంఎస్ / పీజీడీబీఏ/ పీజీడీఎం/ -మార్కెటింగ్ / ఫైనాన్స్ / ఆపరేషన్స్ / సప్లై చైన్ మేనేజ్‌మెంట్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / జనరల్ మేనేజ్‌మెంట్ / బిజినెస్ అనలిటిక్స్ / ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ల రెండు సంవత్సరాల కోర్సులను పూర్తిచేసి ఉండాలి.

  3. 10, 12 తరగతులతో సహా డిప్లొమా (వర్తిస్తే)లో 60 % మార్కులు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్ (Graduation), పోస్ట్ గ్రాడ్యుయేషన్లలో 60% మార్కులు ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ (Post Graduation) పరీక్షలో చివరి సంవత్సరం/సెమిస్టర్ విజయవంతంగా పూర్తి చేయాలి.

  4. ఎంబీఏ / ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కి ముందు బీ.టెక్ / బీ.ఈ బ్యాగ్రౌండ్ ఉండటం తప్పనిసరి.

  5. 2020, 2021, 2022 ఉత్తీర్ణులైన బ్యాచ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

  Appsc Recruitment 2021 : ఏపీపీఎస్‌సీలో ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. జీతం రూ.75,000


  6. జాబ్ రోల్/ ప్రొఫైల్‌ ఆధారంగా వర్క్ ఎక్స్పీరియన్స్ పరిగణిస్తారు.

  7. టీసీఎస్ ఎంపిక ప్రక్రియకు హాజరయ్యే సమయంలో విద్యార్థులకు ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండకూడదు.

  8. విద్యార్థులు తమ అత్యున్నత అర్హతలో ఎలాంటి ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ విద్యను కలిగి ఉండకూడదు. విద్యార్థుల అకడమిక్ గ్యాప్ 2 సంవత్సరాలకు మించకూడదు. విద్యార్ధులు తమ అకడమిక్ గ్యాప్స్ (Academic Gap) గురించి తప్పకుండా తెలియజేయాలి. గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ విద్యార్థులు ఓ వ్యాలీడ్ డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా అందించాలి.

  9. విద్యార్థులు రెగ్యులర్ కాలేజ్ లేదా స్కూల్ కి అటెండ్ అయి ఉండాలి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్) నుండి వారి సెకండరీ లేదా సీనియర్ సెకండరీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

  పరీక్ష వివరాలు (Exam Details):

  ఈ పరీక్షలో 47 ప్రశ్నలు ఉంటాయి. 90 నిమిషాల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వెర్బల్ ఆప్టిట్యూడ్ లో 7 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో 20 ప్రశ్నలు, బిజినెస్ ఆప్టిట్యూడ్ లో 20 ప్రశ్నలు ఉంటాయి.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Engineering, JOBS, TCS

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు