TCS Smart Hiring program: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్... టీసీఎస్​ స్మార్ట్‌ హైరింగ్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం

TCS Smart Hiring program: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్... టీసీఎస్​ స్మార్ట్‌ హైరింగ్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

TCS Smart Hiring program | ఐటీ రంగ దిగ్గజ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఫ్రెషర్స్‌ని నియమించుకోవడానికి స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్ ప్రారంభఇంచింది. ఈ హైరింగ్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు అందించేందుకు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ తదుపరి దశ స్మార్ట్‌ హైరింగ్‌ ప్రోగ్రామ్‌ (TCS Smart Hiring program) ప్రకటించింది. ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లు ఈ కోర్సు అప్లై చేసి ఐటీ కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాన్ని నేర్చుకోవచ్చు. ఈ టీసీఎస్‌ స్మార్ట్ హైరింగ్‌ ప్రోగ్రామ్‌లో టాప్‌ పర్ఫామర్స్‌గా నిలిచిన వారికి టీసీఎస్‌ ఇగ్నైట్‌ ప్రోగ్రామ్‌ (TCS ignite program) ద్వారా ఈసాప్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థలోనే ఉద్యోగం పొందే అవకాశం లభిస్తుంది. టీసీఎస్‌ స్మార్ట్‌ హైరింగ్‌ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్‌ 2. ఈ ప్రోగ్రామ్‌కు దరాఖాస్తు చేసుకునే అభ్యర్థులు తొలుత ఒక టెస్ట్ రాయాల్సి ఉంటుంది. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా

విద్యార్హతలివే...


ఈ టెస్టు నవంబర్‌ 19 నుంచి ప్రారంభమవుతుంది. ఈ పరీక్షలో 80 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 2 గంటల్లో అంటే 120 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. సైన్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ కలిగిన అభ్యర్థులందరూ ఈ కోర్సుకు అప్లై చేయవచ్చు. అయితే వాళ్లంతా ఫుల్‌టైమ్‌ కోర్సు పాసై ఉండాలి. బీసీఎ, బీ.ఎస్సీ మ్యాథ్‌, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్‌, బయోకెమిస్ట్రీ, సీఎస్‌ సబ్జెక్టులు చదివిన గ్రాడ్యుయేట్ల అందరూ ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2020, 2021లో పాసైనవారు సహ 2022లో పాసయ్యే వారు కూడా ఈ ప్రోగ్రామ్‌కు అప్లై చేసుకోవచ్చు.

IT Jobs: ఫ్రెషర్స్‌కు బంపర్ ఆఫర్... ఈ మూడు ఐటీ కంపెనీల్లో 1,05,000 ఉద్యోగాలు

ఎంపిక విధానం


అయితే వీరంతా తమ మొత్తం చదువుల్లో కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి లేదా 5 CGPA లేదా అంత కంటే ఎక్కువ కలిగి ఉండాలి. 2020, 2021లో పాసైన అభ్యర్థులకు ఎటువంటి బ్యాక్‌లాగ్స్‌ ఉండకూడదు. 2022లో పాసయ్యే అభ్యర్థుల విషయంలో ఒక బ్యాక్‌లాగ్‌ వరకు అనుమతించే వెసులుబాటు ఉంటుందని టాటా కన్సలెన్ట్సీ వెబ్‌సైట్‌ పేర్కొంటోంది. ఎంపిక ప్రక్రియలో అనేక అర్హత పరిశీలనలు ఉంటాయి. ఏ దశలోనైనా అభ్యర్థి అనర్హులు అని తేలితే అలాంటి అభ్యర్థులను పక్కన పెట్టే అధికారం తమకు ఉంటుందని టీసీఎస్‌ ప్రకటించింది.

ONGC Recruitment 2021: బీటెక్ పాస్ అయినవారికి ఓఎన్‌జీసీలో 309 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

35,000 ఉద్యోగాలు


మరో వైపు ఈ ఆర్థిక సంవత్సరంలో నియమాకాలు టాటా కన్సల్టెన్సీ సంస్థ వేగవంతం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం గడిచిన ఆరు నెలల కాలంలో 43,000 మంది ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఉద్యోగాలు ఇచ్చింది. మరో వైపు ఐటీ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆట్రిషన్‌ను అధిగమించేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 35 వేల మంది ఉద్యోగులను చేర్చుకునే ఆలోచనలో ఉది ఈ సాఫ్ట్‌వేర్‌ సంస్థ.
Published by:Santhosh Kumar S
First published: