Home /News /jobs /

TCS INTERNSHIP PROGRAM 2022 TATA CONSULTANCY SERVICES INVITES APPLICATIONS FOR INTERNSHIPS KNOW HOW TO APPLY SS

TCS Internship Program: బీటెక్ విద్యార్థులకు టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు

TCS Internship Program: బీటెక్ విద్యార్థులకు టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు
(ప్రతీకాత్మక చిత్రం)

TCS Internship Program: బీటెక్ విద్యార్థులకు టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు (ప్రతీకాత్మక చిత్రం)

TCS Internship Program | బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ చదువుతున్నవారికి శుభవార్త. దిగ్గజ ఐటీ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇంటర్న్‌షిప్ అవకాశాలను ఇస్తోంది.

దిగ్గజ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. బీటెక్, బీఈ, ఇతర కోర్సులు చదువుతున్నవారు టీసీఎస్‌లో ఇంటర్‌షిప్ అవకాశాలు లభిస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్‌లో రీసెర్చ్ చేయాలనుకునేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. టీసీఎస్ ఇంటర్న్‌షిప్ 2022 ప్రోగ్రామ్ (TCS Internship 2022 Program) కోసం దరఖాస్తు చేయొచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పైన ఆసక్తి ఉన్నవారు, మెరుగైన అకాడమిక్ రికార్డ్ ఉన్నవారు తమతో చేరాలని, సీనియర్ పరిశోధకుల పర్యవేక్షణలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని టీసీఎస్ కోరుతోంది.

టీసీఎస్‌ను AIESEC గ్లోబల్ ఎక్స్‌ఛేంజ్ పార్టర్‌గా గుర్తించింది. అందులో భాగంగా టీసీఎస్ ప్రతీ ఏటా 200 మంది ఇంటర్న్స్‌కి అవకాశం ఇస్తోంది. బీటెక్, బీఈ చివరి సంవత్సరం చదువుతున్నవారు, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ చదువుతున్నవారు కంప్యూటర్ సైన్స్‌లో రీసెర్చ్ చేయాలనుకుంటే టీసీఎస్‌లో ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు.

IBPS Clerk 2022: డిగ్రీ పాసైనవారికి ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 జాబ్స్... అప్లై చేయండి ఇలా

ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి సైకాలజీ, సోషియాలజీ, ఎకనమిక్స్, మ్యాథమెటిక్స్, గేమ్ డిజైన్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ లాంటి సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఎంపికైనవారు 6 వారాల నుంచి 8 వారాల షార్ట్ ఇంటర్న్‌షిప్, 16 వారాల నుంచి 18 వారాల లాంగ్ ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. కొన్ని సందర్భాలలో ఇంటర్న్‌షిప్ వ్యవధిని మార్చుకోవచ్చు.

ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైనవారు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో, సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారాలు సూచించడం, ప్రోటోటైప్ రూపొందించడం, పరిశోధనా పత్రాలను ప్రచురించడం, రీసెర్చ్ ఎగ్జిక్యూషన్, సర్వేలు నిర్వహించి అవకాశాలు, సవాళ్లను గుర్తించడం లాంటి వాటిలో నిమగ్నమై ఉంటారు. ఆసక్తి గల అభ్యర్థులు టీసీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేయాలి. ఏవైనా సందేహాలు ఉంటే careers.research@tcs.com మెయిల్ ఐడీలో సంప్రదించాలి.

Govt Jobs with 10th: టెన్త్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు పదవ తరగతి చాలు

టీసీఎస్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కి అప్లై చేయండిలా


Step 1- టీసీఎస్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2022 కి అప్లై చేయాలనుకోవారు ఇక్కడ క్లిక్ చేయాలి.

Step 2- పేరు, విద్యార్హతలు, కళాశాల పేరు ఎంటర్ చేయాలి.

Step 3- గతంలో పాసైన కోర్సుల వివరాలు వెల్లడించాలి.

Step 4- ఏ అంశంలో పరిశోధన చేయాలనుకుంటున్నారో వెల్లడించాలి.

Step 5- ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఇంటర్న్‌షిప్ చేస్తారో వివరించాలి.

Step 6- ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి అప్లై చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Career and Courses, Internship, JOBS, TCS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు