Home /News /jobs /

TCS INFOSYS OTHER IT COMPANIES CONTINUE WITH WORK FROM HOME UMG GH

Work From Home: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమే..? టాప్ కంపెనీల ప్లాన్స్ ఇవే..!

వర్క్ ఫ్రమ్ హోంపై టాప్ కంపెనీ ప్లాన్స్ ఇవే

వర్క్ ఫ్రమ్ హోంపై టాప్ కంపెనీ ప్లాన్స్ ఇవే

ఐటీ కంపెనీలు (IT Companies) వర్క్ ఫ్రమ్‌ హోమ్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాయి. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) తమ హైబ్రిడ్ మోడల్ (Hybrid Working) వర్కింగ్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
కరోనా (Corona) విజృంభణ తరువాత దేశాలన్నీ లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) చేసుకునే సౌలభ్యం కల్పించాయి. అయితే లాక్‌డౌన్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తేసి చాలా రోజులు గడుస్తున్నా కొన్ని ఐటీ కంపెనీలు (IT Companies) వర్క్ ఫ్రమ్‌ హోమ్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాయి. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) తమ హైబ్రిడ్ మోడల్ (Hybrid Working) వర్కింగ్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్-19 (Covid-19) కేసులు మళ్లీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఇతర ఐటీ కంపెనీలు సైతం మళ్లీ వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్నే అనుసరిస్తున్నాయి. కొద్ది వారాల క్రితం కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తప్పనిసరిగా ఆఫీసులకు రావాలని ఆదేశించాయి. కానీ పెరుగుతున్న కోవిడ్-19 కేసులతో మళ్లీ ఇంటి నుంచే పనిచేసే ఫెసిలిటీ కల్పిస్తున్నాయి.

భారత్‌లో గత 24 గంటల్లోనే 16,135 కొత్త కోవిడ్-19 కేసులు, 24 మరణాలు నమోదయ్యాయి. శనివారం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల లోపు కూడా దాదాపు ఇదే సంఖ్యలో దేశంలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే యూఎస్-ఆధారిత ఐటీ కంపెనీ సినాప్సిస్ (Synopsys) నోయిడా యూనిట్ సిబ్బందిలోని ఒకరు కోవిడ్-19 బారిన పడ్డారు. దాంతో గత నెల నుంచి ఆఫీసులకు రమ్మని ఉద్యోగులను కోరుతున్న ఈ కంపెనీ మళ్లీ వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని పునఃప్రారంభించింది. ఇటీవల పేటీఎం (Paytm) కూడా తన ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వీలు కల్పించింది. ఇక ఇండియన్ మేజర్ ఐటీ కంపెనీలలో అతిపెద్ద కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ హైబ్రిడ్ మోడల్‌ను ఎక్కువ కాలం (Long-term) కొనసాగిస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లలో 5 శాతం మాత్రమే ఇప్పుడు ఆఫీస్‌లకు వెళ్తుతుండగా.. వీరందరూ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కావడం గమనార్హం.

ఇదీ చదవండి: వాట్సాప్ సూపర్ అప్‌డేట్.. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ టైమ్ లిమిట్‌ పెంపు.. ఎన్ని రోజులంటే..?


కొన్ని నెలల క్రితం టీసీఎస్ తాము అకేషనల్ ఆపరేటింగ్ జోన్లు (OOZs), హాట్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తామని.. 25×25 విధానాన్ని అవలంబిస్తామని ప్రకటించింది. 25×25 పాలసీ ప్రకారం, కంపెనీ ఉద్యోగులలో 25 శాతానికి మించి ఎక్కువమంది ఆఫీస్ నుంచి పని చేయాల్సిన అవసరం లేదు. వీరు తమ సమయాన్ని 25 శాతానికి మించి ఆఫీసులో గడపాల్సిన అవసరం లేదు. టీసీఎస్ ప్రపంచవ్యాప్తంగా అకేషనల్ ఆపరేటింగ్ జోన్లు (OOZ), హాట్ డెస్క్‌లలో చురుకైన వర్క్ సీట్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ వర్క్ సీట్‌ల ద్వారా ఉద్యోగులు టీసీఎస్ ఆఫీస్ నుంచి పని చేయడం, తోటి టీమ్ మెంబర్స్‌తో కమ్యూనికేట్ చేయడం కుదురుతుంది. హైబ్రిడ్ మోడల్‌ వర్కింగ్ గురించి ఒక వివరణ లేఖలో టీసీఎస్ తన ఉద్యోగులకు ఎనేబుల్, ఎంబ్రేస్, ఎంపవర్ అనే 3Es గురించి కూడా వివరించింది.



ఇన్ఫోసిస్ కూడా హైబ్రిడ్ మోడల్ వర్క్ కోసం తన దీర్ఘకాలిక ప్రణాళికను ప్రకటించింది. ఈ మేరకు క్లయింట్లు, నియంత్రణ వాతావరణం, అనేక ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఇదొక దశలవారీ విధానమని, ప్రతి త్రైమాసికంలో దీన్ని రివ్యూ చేస్తామని తెలిపింది. ప్రస్తుతం 95 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్‌ హోమ్ చేస్తుండగా... 5 శాతం మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు మాత్రమే ఆఫీసులకు వస్తున్నారని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ తెలిపారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies) కంపెనీ కూడా హైబ్రిడ్ మోడల్‌ను కంటిన్యూ చేస్తోంది.
Published by:Mahesh
First published:

Tags: IT Employees, JOBS, Software, Work From Home

తదుపరి వార్తలు