TCS Openings : ఫ్రెషర్స్​కు టీసీఎస్ గుడ్​న్యూస్​.. 77 వేల మంది నియామకానికి సన్నాహాలు​

TCS Jobs (image: TCS)

భారత అతిపెద్ద ఐటీ సర్వీసెస్​ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (టీసీఎస్​) ఫ్రెషర్స్​కు గుడ్​న్యూస్​ చెప్పింది. టెక్ టాలెంట్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా 2022 ఆర్థిక సంవత్సరంలో 77,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోనున్నామని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు.

  • Share this:
భారత అతిపెద్ద ఐటీ సర్వీసెస్​ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​ (TATA Consultancy Services​) ఫ్రెషర్స్​కు గుడ్​న్యూస్​ చెప్పింది. టెక్ టాలెంట్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా 2022 ఆర్థిక సంవత్సరంలో 77,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోనున్నామని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. ‘‘క్యాంపస్ నియామకాల్లో భాగంగా మేము ఇప్పటికే 43,000 మంది ఫ్రెషర్స్​ను రిక్రూట్​మెంట్ (Recruitment) ​ను ప్రారంభించాం. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే మరో 34,000 మందిని నియమించుకోనున్నాం. ఇలా మొత్తం 77,000 మంది ఫ్రెషర్స్​కు రికార్డు స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నాం. రాబోయే కాలంలో డిమాండ్​ మేరకు మరిన్ని నియామకాలు చేపట్టనున్నాం” అని పేర్కొన్నారు.

ఫ్రెషర్స్​ కోసం టీసీఎస్​ ఇప్పటికే ఒక డిజిటల్​ సర్టిఫికేషన్​ ప్రోగ్రామ్​ (Certificate Program) ను నిర్వహిస్తోంది. బీటెక్​ ఏడో సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులకు ఎక్స్‌ప్లోర్ ప్రోగ్రామ్ ద్వారా టెక్నాలజీ (Technology), సాఫ్ట్ స్కిల్స్ (Soft Skills) ​పై ట్రైనింగ్​ ఇస్తోంది. క్లౌడ్ కంప్యూటింగ్​ లేదా సైబర్​ సెక్యూరిటీపై వారికి అవగాహన కల్పిస్తోంది.

AMDER Recruitment 2021 : ఏఎమ్‌డీఈఆర్‌లో 124 ఉద్యోగాలు.. జీతం రూ.35,400


ప్రతి వారం 1,500 మంది విద్యార్థులకు టీసీఎస్​ (TCS) డిజిటల్ సర్టిఫికేషన్ (Digital Certification) ప్రోగ్రామ్‌ ద్వారా శిక్షణ ఇస్తోంది. ఈ కోర్సు పూర్తయిన తర్వాత, అభ్యర్థుల సామర్థ్యం ఆధారంగా అనేక ప్రోత్సాహకాలను కూడా అందజేస్తుంది. గతేడాది టీసీఎస్​ ఏడాదికి రెండుసార్లు జీతాల పెంపును ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఫ్రెషర్స్ ప్రారంభ వేతనం (Starting Salary) దాదాపు రూ .3.5 LPA వద్ద ఉంది. దీన్ని భారీగా పెంచే అవకాశాలున్నాయిని టెక్​ నిపుణులు చెబుతున్నారు.

ఫ్రెషర్స్​కు డిజిటల్​ సర్టిఫికేషన్​ ప్రోగ్రామ్​..

టీసీఎస్​ రెండో త్రైమాసికంలో 19,690 మంది ఉద్యోగుల (Employees) ను నియమించుకుంది. దీంతో సెప్టెంబర్​ 30 నాటికి టీసీఎస్​ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,28,748 కి చేరుకుంది. ఈ మొత్తం సంఖ్యలో 36.2 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. టీసీఎస్​ అట్రిషన్​ రేటు సెప్టెంబర్​ త్రైమాసికంలో 11.9 శాతానికి పెరిగింది. ఇది గత త్రైమాసికంలో 8.6 శాతంగా ఉంది. మరోవైపు, కంపెనీలో ఇప్పటివరకు 70 శాతం మంది ఉద్యోగులు పూర్తిగా వ్యాక్సిన్ (Vaccine)​ వేసుకున్నారని టీసీఎస్​ తెలిపింది.
ఉద్యోగులెవరూ ఈ ప్రాణాంతక వైరస్​ బారిన పడకుండా పలు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. వర్క్​ ఫ్రమ్​ హోమ్ (Work From Home)​ విధానంలో ప్రస్తుతం 98 శాతం మంది పనిచేస్తున్నారని, క్రమంగా వారందరినీ ఆఫీసులకు రప్పించాలని భావిస్తున్నట్లు పేర్కొంది.
First published: