హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TCS Hiring 2022: ఆ కోర్సు చేసిన వారికి టీసీఎస్ గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌ల ప్రాసెస్ ప్రారంభం

TCS Hiring 2022: ఆ కోర్సు చేసిన వారికి టీసీఎస్ గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌ల ప్రాసెస్ ప్రారంభం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

TCS Hiring 2022 | మీరు ఎమ్మెస్సీ, ఎంఏ పాస్ అయ్యారా? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? ఈ కోర్సులు చేసిన వారికి కూడా టీసీఎస్ లో ఉద్యోగ అవాశాలు ఉన్నాయి.  ఇందుకోసం టీసీఎస్ అనేక ప్రోగ్రామ్స్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

ఇంకా చదవండి ...

మీరు ఎమ్మెస్సీ, ఎంఏ పాస్ అయ్యారా? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? ఈ కోర్సులు చేసిన వారికి కూడా టీసీఎస్ లో ఉద్యోగ అవాశాలు ఉన్నాయి.  ఇందుకోసం టీసీఎస్ అనేక ప్రోగ్రామ్స్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. టీసీఎస్ భారీగా ఫ్రెషర్స్‌ని నియమించుకుంటోంది. వేర్వేరు ప్రోగ్రామ్స్  ద్వారా గతేడాది భారీగా దరఖాస్తుల్ని టీసీఎస్ స్వీకరించింది. ఇప్పుడు మరోసారి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో  టీసీఎస్ అట్లాస్ హైరింగ్‌ (About TCS Atlas Hiring) ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. డిగ్రీ పాస్ అయినవారు, చివరి సెమిస్టర్ చదువుతున్నవారు ఏప్రిల్ 20, 2022 లోగా అప్లై చేయాలి.

jobs in AP: ఏపీవీవీపీ క‌ర్నూలు జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

దరఖాస్తుకు చివరి తేదీ- ఏప్రిల్ 20, 2022

ఎగ్జామ్- తేదీని త్వరలో ప్రకటించనున్న టీసీఎస్

ఇంటర్వ్యూ- తేదీని త్వరలో ప్రకటించనున్న టీసీఎస్

విద్యార్హతలు- M.Sc (గణితం/స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్) & MA (ఎకనామిక్స్) ఉత్తీర్ణత సంవత్సరం నుండి (పాసైన సంవత్సరాలు) – 2020, 2021 & 2022

Step 1- టీసీఎస్ అట్లాస్ హైరింగ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేయాలనుకునేవారు https://www.tcs.com/careers/tcs-atlas-hiring లింక్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో హైరింగ్ ప్రోగ్రామ్ వివరాలన్నీ చదివి APPLY HERE WITH CT/DT ID లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 3- ఆ తర్వాత ఎలిజిబిలిటీ వివ‌రాలు వ‌స్తాయి.

Jobs in AP: నెల్లూరులో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. ఎటువంటి ప‌రీక్ష లేకుండా ఎంపిక‌

Step 4- కొత్త‌గా రిజిస్ట‌ర్ చేసుకొంటే https://nextstep.tcs.com/campus/#/ లింక్ పైన క్లిక్ చేయాలి. పాత వారికి ఐడీతో లాగిన్ అవ్వాలి.

Step 5- కొత్త‌గా రిజిస్ట‌ర్ చేసుకొనే వారు విద్యార్థులు పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 6- ముందే రిజిస్ట్రేషన్ చేసినవాళ్లు లాగిన్ అయ్యాక Apply For Drive పైన క్లిక్ చేయాలి.

TS Jobs Coaching: నిరుద్యోగుల‌కు అలర్ట్.. ఉచిత శిక్ష‌ణ‌.. రూ.1,500 విలువైన స్ట‌డీ మెటీరియ‌ల్

Step 7- టెస్ట్ మోడ్ In-Centre or Remote లో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి.

Step 8- వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

Step 9- అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి Track Your Application పైన క్లిక్ చేయాలి.

Step 10- Applied for Drive అని స్టేటస్ కనిపిస్తే దరఖాస్తు ప్రక్రియ విజయవంతం అయిందని అర్థం చేసుకోవాలి.

First published:

Tags: IT jobs, JOBS, Private Jobs, TCS

ఉత్తమ కథలు