TCS BPS FRESHER HIRING 2022 TATA CONSULTANCY SERVICES INVITES APPLICATIONS FROM GRADUATES FOR VACANCIES IN BUSINESS PROCESS SERVICES KNOW HOW TO APPLY SS
TCS Jobs 2022: డిగ్రీ అర్హతతో టీసీఎస్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
TCS Jobs 2022: డిగ్రీ అర్హతతో టీసీఎస్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
(TCS logo)
TCS BPS Fresher Hiring 2022 | డిగ్రీ చివరి సెమిస్టర్ చదువుతున్నవారికి అలర్ట్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో (TCS) బీపీఎస్ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో (TCS) ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఇటీవల కాలంలో టీసీఎస్ భారీగా ఫ్రెషర్స్‌ని నియమించుకుంటోంది. అందులో భాగంగా టీసీఎస్ బీపీఎస్ ఫ్రెషర్ హైరింగ్ 2022 (TCS BPS Fresher Hiring 2022) ప్రోగ్రామ్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. బిజినెస్ ప్రాసెస్ సర్వీస్ (BPS) విభాగంలో భారీగా ఖాళీలను భర్తీ చేయబోతోంది. ఇందుకోసం ఫ్రెషర్స్ నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ విభాగాల్లో 2022 లో డిగ్రీ పాస్ అయ్యేవారు అంటే ఈ ఏడాది డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాసేవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు.
టీసీఎస్ బీపీఎస్ ఫ్రెషర్ హైరింగ్ 2022 ప్రోగ్రామ్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2022 జనవరి 7 చివరి తేదీ. 2022 జనవరి 26న ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది. అసాధారణ ప్రతిభ కనబర్చినవారిని టీసీఎస్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కాగ్నిటీవ్ బిజినెస్ ఆపరేషన్స్ (CBO), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ (BFSI), లైఫ్ సైన్సెస్‌లో వేర్వేరు హోదాల్లో నియిస్తారు.
విద్యార్హతలు- 2022 లో బీకామ్, బీఏ, బీబీఐ, బీబీఏ, బీఎంఎస్, బీబీఎం, బీసీఏ, బీసీఎస్ పాస్ కావాలి. ఈ కోర్సుల్లో చివరి సెమిస్టర్ చదువుతున్నవారు దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం- సెలెక్షన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
పరీక్షా విధానం- న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష 60 నిమిషాలపాటు ఉంటుంది. పరీక్ష క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది.
Step 5- విద్యార్థులు పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 6- వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Step 7- అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి Track Your Application పైన క్లిక్ చేయాలి.
Step 8- Applied for Drive అని స్టేటస్ కనిపిస్తే దరఖాస్తు ప్రక్రియ విజయవంతం అయిందని అర్థం చేసుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.