హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TCS Salary Hike: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతం పెంపు.. ఎంత శాతం అంటే?

TCS Salary Hike: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా జీతం పెంపు.. ఎంత శాతం అంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వింటర్‌ హాలిడేస్‌ సెలబ్రేషన్స్‌ మధ్య టాటా కన్సల్టెన్సీ సర్వీస్(TCS) కంపెనీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ అందించింది. 70 శాతం ఉద్యోగులకు 20 శాతం శాలరీ హైక్‌(Salary Hike)ను ఇస్తున్నట్లు ప్రకటించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఇటీవల కాలంలో ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కరోనా సంక్షోభం అనంతరం కూడా అట్రిషన్‌ రేటు, మూన్‌లైటింగ్‌, ద్రవ్యోల్బణం ప్రభావం వంటి కారణాలతో ఖర్చులు తగ్గించుకునే మార్గాలను అన్వేషించాయి. చాలా కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ను ఆపేశాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ఈ పరిస్థితుల్లో వింటర్‌ హాలిడేస్‌ సెలబ్రేషన్స్‌ మధ్య టాటా కన్సల్టెన్సీ సర్వీస్(TCS) కంపెనీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ అందించింది. 70 శాతం ఉద్యోగులకు 20 శాతం శాలరీ హైక్‌(Salary Hike)ను ఇస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన 30 శాతం ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ఇంక్రిమెంట్ ఉంటుందని తెలిపింది.

రెండో త్రైమాసికంలో పెరిగిన టర్నోవర్‌

ప్రస్తుతం టీసీఎస్‌లో దాదాపు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులకు 2022 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి 100 శాతం వేరియబుల్ పే రూపంలో ఇన్సెంటివ్‌లు అందుకుంటారు. వేరియబుల్ పే ప్రస్తుతం ఉద్యోగి శాలరీలో 10 శాతం నుంచి 20 శాతం వరకు ఉంటుంది.

డిసెంబర్ 26న బిజినెస్ త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన తర్వాత.. శాలరీ హైక్‌ గురించి టీసీఎస్‌ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ప్రకటించారు. రెండో త్రైమాసికంలో టర్నోవర్ రేటు గరిష్ట స్థాయికి చేరిందని, ఆ తర్వాత త్వరగా పడిపోయిందని ఆయన చెప్పారు. గత త్రైమాసికంలో కంపెనీ నెట్‌ ప్రాఫిట్‌ 8 శాతం పెరిగి రూ.10,000 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. కంపెనీ 70 శాతం మంది ఉద్యోగులకు వేరియబుల్స్ అన్నింటినీ చెల్లిస్తామని లక్కాడ్ తెలిపారు. మిగిలిన వారికి పనితీరు ఆధారంగా అందజేస్తామన్నారు.

ఫ్రెష్‌ గ్యాడ్యుయేట్‌ల నియామకానికి చర్యలు

ఇటీవల ఐటీ పరిశ్రమలో అట్రిషన్ రేటు తగ్గడంతో రిక్రూట్‌మెంట్‌లు మందకొడిగా మారాయి. కంపెనీ సగటు అట్రిషన్ రేటు ప్రస్తుతం 19.7 శాతంగా ఉంది. ఇది మునుపటి సంవత్సరంలో 21.5 శాతంగా నమోదైంది. TCS జులై, సెప్టెంబర్ మధ్య 20,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. 2022లో మొత్తం నియామకాల సంఖ్యను 35,000కి పెంచింది. ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లను 40,000 మందిని కంపెనీ నియమించుకోనున్నట్లు గతంలో ప్రకటించింది. లక్కాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. TCS ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్‌లను రిక్రూట్‌ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. కానీ మొత్తంగా IT పరిశ్రమ రిక్రూట్‌మెంట్‌లు చేసుకునే పరిస్థితుల్లో ఉందని చెప్పలేం.

మొదటి త్రైమాసికంలో తగ్గింపు

మొదటి త్రైమాసికంలో TCS, Wipro, Infosys కంపెనీలు తమ సిబ్బందికి వేరియబుల్ శాలరీని తగ్గించాయి. విప్రోలో సీనియర్ అధికారులు పొందే వేరియబుల్ పరిహారంలో జూనియర్ ఉద్యోగులు 70 శాతం మాత్రమే పొందుతారు. ఇన్ఫోసిస్ ఇదే విధానాన్ని అవలంబించింది, మొత్తం ఉద్యోగుల కాంపెన్షేషన్‌ను ప్రీవియస్‌ లెవల్‌ 70 శాతానికి పరిమితం చేసింది.

First published:

Tags: JOBS, Private Jobs, Salary Hike, TCS, Tcs jobs

ఉత్తమ కథలు