TSPSC Results: మరో 325 పోస్టుల ఫలితాలను విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ.. వివరాలు ఇవే

TSPSC Results: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) తాజాగా మరో ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను వెల్లడించింది. గురువారం 325 పోస్టుల ఫలితాలను విడుదల చేసింది.

news18-telugu
Updated: October 23, 2020, 12:35 PM IST
TSPSC Results: మరో 325 పోస్టుల ఫలితాలను విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ.. వివరాలు ఇవే
TSPSC Logo
  • Share this:
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) తాజాగా మరో ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలను వెల్లడించింది. గురువారం 325 పోస్టుల ఫలితాలను విడుదల చేసింది. 325 పోస్టుల ఫలితాల్లో మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌రేట్‌(డీఎంఈ) కింద 167 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ల నియమకంతో పాటు.. మరో 158 స్కూల్ అసిస్టెంట్(హిందీ) పోస్టుల‌కు ఫ‌లితాల‌ను వెల్లడించింది. స్కూల్ అసిస్టెంట్ (హిందీ) కి ఎంపికైన విద్యార్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు త్వరలో తేదీలు నిర్ణయించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఆ తేదీల్లో ఆరు ద‌శ‌ల్లో సర్టిఫికేషన్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. గుర్తించిన 158 పోస్టుల్లో 148 పోస్టుల భ‌ర్తీని మాత్ర‌మే ప్రస్తుతం చేప‌ట్టారు. అర్హులైన అభ్య‌ర్థులు లేనికార‌ణంగా మూడు పోస్టులు ఖాళీగా ఉంచారు. కోర్టు కేసుల కార‌ణంగా రెండు పోస్టుల ఫ‌లితాలు పెండింగ్‌లో ఉంచారు. మెడిక‌ల్ రిపోర్టుల అనంత‌రం పీహెచ్ కోటాలోని ఐదు ఖాళీలకు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు టీఎస్‌పీఎస్‌సీ స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కి 2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష విషయంలో షాక్ తగిలింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్‌లో తప్పులున్నాయన్న అభ్యర్థుల వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఆ తప్పులను తొలగించి మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ నుంచి జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి హైకోర్టును ఆదేశించింది. గ్రూప్-1 పరీక్షలో తప్పులున్నాయని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ ప్రశ్నలను తొలగించకుండానే మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తే తమకు నష్టం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పత్రంలో తప్పులు దొర్లడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని కోర్టుకు వివరించారు. అభ్యర్థుల తరపున వాదించిన న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది.

ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో కొన్ని తప్పులు దొర్లాయని దీంతో తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందంటూ అభ్యర్థుల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత విడుదలైన ప్రైమరీ కీ లో తప్పులున్నాయంటూ పలువురు అభ్యర్థులు ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏపీపీఎస్సీ ప్రాథమిక కీ నిపుణుల కమిటీని వేసింది. ప్రాథమిక కీ ని పరిశీలించిన నిపుణుల కమిటీ రివిజినల్ కీ ని విడుదల చేసింది.

అయితే అందులో సైతం తప్పులు ఉన్నాయంటూ పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు. అయితే ఫైనల్ కీని సైతం నిపుణల కమిటీ విడుదల చేసింది. అయితే ఆ కీలో కూడా తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలంటూ వారంతా కోర్టులో పిటీషన్ దాఖాలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. నవంబర్ 2న మెయిన్స్ ను నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కోర్టు తాజా ఆదేశాలను జారీ చేసింది.
Published by: Nikhil Kumar S
First published: October 23, 2020, 12:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading