Home /News /jobs /

TCIL Recruitment 2021: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. TCILలో అప్రంటీస్ ఖాళీలు.. ఇలా అప్లై చేయండి

TCIL Recruitment 2021: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. TCILలో అప్రంటీస్ ఖాళీలు.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెలీ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా (TCIL) నుంచి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    టెలీ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై (Online Application) చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు. మొత్తం 6 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ట్రైనీ ఇంజనీర్ (Trainee Engineer) విభాగంలో ఈ ఖాళీలను (Posts) భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ విధానంలో (Apprentice) పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ (Jobs Application Process) ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తుకు నవంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.

    విద్యార్హతల వివరాలు:
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఐటీ/కంప్యూటర్ సైన్స్ లో ఫుల్ టైం బీఈ/బీటెక్/బీఎస్సీ(Engg) చేసిన వారు 4 ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ప్రతీ నెల స్టైఫండ్ గా రూ. 9 వేలు చెల్లించనున్నారు.
    2.ఎలక్ట్రికల్&ఎలక్ట్రానిక్స్ లో బీఈ/బీటెక్ చేసిన వారి కోసం 2 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 9 వేల పాటు స్టైఫండ్ చెల్లించనున్నారు.
    Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. మొత్తం 67 వేల ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు ఎప్పటినుంచంటే?

    ఇప్పటికే వివిధ సంస్థల్లో అప్రంటీస్ గా పని చేస్తున్న వారు ఈ ఖాళీలకు అప్లై చేయడానికి అనర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంకా అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    AP Job Mela: ఏపీలో నేడు భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 18 వేల వరకు వేతనం

    అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఈ ఉద్యగోాలకు అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Bank Jobs 2021: నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి


    ఎలా అప్లై చేయాలంటే..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేషనల్ అప్రంటీస్ ట్రైనింగ్ స్కీం (NATS) పోర్టల్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం NATS పోర్టల్ లో అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆ అప్లికేషన్ ఫామ్ స్కానింగ్ కాపీని tcilapprentice2021@gmail.com మెయిల్ కు పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CAREER, Central Government Jobs, Job notification, JOBS

    తదుపరి వార్తలు