Home /News /jobs /

TATA INNOVATION FELLOWSHIP REGISTRATIONS OPEN HERE S HOW TO APPLY GH VB

Application Invited: వారికి గుడ్ న్యూస్.. ప్రతినెలా రూ. 25 వేల స్టైఫండ్..​​ దాని కోసం ఇలా చేయండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Application Invited: సైన్స్ అండ్ టెక్నాలజీ(Science And Technology) మంత్రిత్వశాఖ పరిధిలోని బయోటెక్నాలజీ (Bio Technlology) విభాగం టాటా ఇన్నోవేషన్ ఫెలోషిప్(Tata Innovation Fellowship) కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం(Agriculture), పర్యావరణం ఇతర అనుబంధ రంగాల్లో ప్రధాన సమస్యలకు వినూత్న పరిష్కారాలను కనుగొనేందుకుగాను ఈ ఫెలోషిప్​ను ఆఫర్​ చేస్తోంది.

ఇంకా చదవండి ...
సైన్స్ అండ్ టెక్నాలజీ(Science And Technology) మంత్రిత్వశాఖ పరిధిలోని బయోటెక్నాలజీ (Bio Technology) విభాగం టాటా ఇన్నోవేషన్ ఫెలోషిప్(Tata Innovation Fellowship) కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం(Agriculture), పర్యావరణం ఇతర అనుబంధ రంగాల్లో ప్రధాన సమస్యలకు వినూత్న పరిష్కారాలను కనుగొనేందుకుగాను ఈ ఫెలోషిప్​ను ఆఫర్​ చేస్తోంది. బయోలాజికల్ సైన్సెస్/బయోటెక్నాలజీ (Bio Technology) లో అత్యుత్తమ ట్రాక్ రికార్డ్ ఉన్న శాస్త్రవేత్తలను గుర్తించి, వారికి రివార్డ్​ అందజేస్తామని పేర్కొంది.

UPSC Civils Exam: సివిల్స్ రాయాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి


ఫెలోషిప్ జీతం..
ఈ ఫెలోషిప్ ప్రోగ్రాంకు అర్హత సాధించిన వారికి నెలకు రూ.25 వేల నగదుతో పాటు అదనంగా ఇనిస్టిట్యూట్ నుంచి సాధారణ వేతనం లభిస్తుంది. అంతేకాకుండా అభ్యర్థులకు వార్షిక నిధి కింద రూ. 6 లక్షలను కూడా అందజేస్తుంది.
ఫెలోషిప్ కు సంబంధించిన వివరాలు..
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు డీబీటీ అధికారిక వెబ్ సైట్ లో అప్లికేషన్ నింపి సబ్మిట్ చేయాలి. నవంబరు 30 లోపు దరఖాస్తులను పంపాలి. "దరఖాస్తుదారులు తమ పూర్తి అధికారం(competent authority) ద్వారా నింపిన అప్లికేషన్(ఓ హార్డ్ కాపీ)ను డా.డియో ప్రకాష్ చతుర్వేది, సైంటిస్ట్-C, రూమ్ నెంబరు 814, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఫ్లోర్, బ్లాక్-2, CGO కాంప్లెక్స్, లోధి రోడ్, న్యూఢిల్లీ -110003 అనే చిరునామాకు నవంబరు 30లోపు పంపాలి.

Huzurabad By Elections: అతడి వైపే మొగ్గుచూపుతున్న బెట్టింగ్ రాజాలు.. 20 వేల మెజారిటీ పక్కా అంటూ..


గడువు పూర్తయిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోమని టాటా ఇన్నోవేషన్​ నోటిఫికేషన్​లో పేర్కొంది. అంతేకాకుండా నిర్దేశించిన ప్రోఫార్మాలోని అప్లికేషన్ సాఫ్ట్ కాపీని తప్పనిసరిగా ఆన్ లైన్ లో DBT ePromis పోర్టల్ (url: http://www.dbtepromis.gov.in లేదా http://www.dbtepromis.nic.in) ద్వారా నవంబరు 30వ తేదీ లోపు లేదా అంతకుముందు సమర్పించాలని స్పష్టం చేసింది.
ఈ ఏడాది గుజరాత్ మహిళకు ఫెలోషిప్..
ఈ సంవత్సరం(2020-21) టాటా ఇన్నోవేషన్ ఫెలోషిప్ ను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్(IITGN)లో ఎలక్టిక్ ఇంజినీరింగ్ కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ ఉత్తమ లహరి ఎంపికయ్యారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ నుంచి అవార్డు అందుకున్నారు.

Uses Of Ladyfinger: బెండకాయ వంటలకే కాదు.. ఔషద పరంగా కూడా ఎంతో ఉపయోగకరం.. ఏ వ్యాధులకు ఉపయోగిస్తారంటే..


టాటా ఇన్నోవేషన్ ఫెలోషిప్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, దేశంలోని ఎంపిక చేసిన ఐదుగురు శాస్త్రవేత్తలకు బయోలాజికల్ సైన్సెస్/బయోటెక్నాలజీ రంగంలో వారి అత్యుత్తమ కృషికి గుర్తింపుకు గాను బహుమతిగా అందజేస్తుంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణ, పశువుల ఉత్పత్తి తయారీ ప్రక్రియ మొదలైన వాటిలో వినూత్న పరిష్కారాలను కనుగొన్నవారికి ఈ పెలోషిప్ ఇస్తారు.
Published by:Veera Babu
First published:

Tags: Application, Scholarship

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు