Home /News /jobs /

TATA CONSULTANCY SERVICES TCS ION LAUNCHES REMOTE INTERNSHIPS FOR STUDENTS KNOW FULL DETAILS SS

TCS Internship: ఇంట్లో కూర్చొనే ఇంటర్న్‌షిప్... విద్యార్థులకు అద్భుత అవకాశం

TCS Internship: ఇంట్లో కూర్చొనే ఇంటర్న్‌షిప్... విద్యార్థులకు అద్భుత అవకాశం
(ప్రతీకాత్మక చిత్రం)

TCS Internship: ఇంట్లో కూర్చొనే ఇంటర్న్‌షిప్... విద్యార్థులకు అద్భుత అవకాశం (ప్రతీకాత్మక చిత్రం)

TCS Internship | సమ్మర్‌లో ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొనే మీరు ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

    విద్యార్థులకు శుభవార్త. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన టీసీఎస్ ఐయాన్ రిమోట్ ఇంటర్న్‌షిప్స్ ప్రారంభించింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను నేరుగా కార్పొరేట్లు, పరిశ్రమ వర్గాల నిపుణులతో కనెక్ట్ చేసేందుకు టీసీఎస్ ఈ ప్లాట్‌పామ్ రూపొందించింది. విద్యార్థులు తాము ఉన్న ప్రాంతాల నుంచే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కావాల్సిన సహకారం లభిస్తుంది. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ప్రతిష్టాత్మక సంస్థలు సమ్మర్ ఇంటర్న్‌షిప్స్‌ని రద్దు చేశాయి. విద్యార్థుల సిలబస్‌లో ఇంటర్న్షిప్ కూడా కావడంతో వారికి ఉపయోగపడేలా డిజిటల్ ఇంటర్న్‌షిప్స్‌ని ప్రారంభించింది. టీసీఎస్ ఐయాన్.

    సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ కోసం ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభించడం, పరిశ్రమవర్గాలను, విద్యార్థులను ఒకే ప్లాట్‌ఫామ్ పైకి తీసుకురావడం ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్స్ నేర్చుకోవడానికి ఎలాంటి అంతరాయం లేకుండా ఈ ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. కరోనా వైరస్ సంక్షోభంలో కూడా విద్యార్థులు తమ అకడమిక్ క్రెడిట్స్ సాధించేందుకు ఇది ఉపయోపడుతుంది.
    వెంగుస్వామి రామస్వామి, గ్లోబల్ హెడ్, టీసీఎస్ అయాన్


    ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా టీసీఎస్ అయాన్ రిమోట్ ఇంటర్న్‌షిప్స్ ఆన్‌లైన్ ఇంటర్న్‌షిప్ అవకాశాలను పెంచుతుంది. ఏఐసీటీసీ గైడ్‌లైన్స్ ప్రకారమే ఈ ప్లాట్‌ఫామ్ ఏర్పడింది. ప్రస్తుతం 100 పైగా ఇంటర్న్‌షిప్ అవకాశాలున్నాయి. వాటిని విద్యార్థులు ఎంచుకోవచ్చు. పరిశ్రమ నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు ప్రాజెక్ట్స్, వీడియోస్ రూపొందించొచ్చు. వెబినార్స్ అటెండ్ కావొచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ ఇంట్లోంచే ఇంటర్న్‌షిప్ పూర్తి చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 550 జాబ్స్... ఇవాళే లాస్ట్ డేట్



    Railway Jobs: ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 663 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

    DRDO Jobs: డీఆర్‌డీఓలో 167 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Internship, Job notification, JOBS, NOTIFICATION, TCS

    తదుపరి వార్తలు