Free Cellphone to Students: ఆ స్కూల్లో చేరితే సెల్ ఫోన్ ఫ్రీ

School Offering Mobiles to Students | తమిళనాడు మదురైలోని తియాగరాజర్ పాఠశాల తమ స్కూల్​లో చేరే 6వ తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా ఫోన్లు ఇస్తామని తెలిపింది.

news18-telugu
Updated: August 30, 2020, 4:01 PM IST
Free Cellphone to Students: ఆ స్కూల్లో చేరితే సెల్ ఫోన్ ఫ్రీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Free Mobile to students | విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందంటే చాలు. కొన్ని స్కూళ్లు, కాలేజీలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. బాగా చదివే విద్యార్థులకు ఫీజు రాయితీలు, మెరిట్ స్టూడెంట్స్‌కు స్కాలర్ షిప్‌లు, అడ్మిషన్ లేకుండా చేర్చుకుంటామంటూ వరాలు ఇస్తుంటాయి. ఇప్పుడు కరోనా కారణంగా అందరూ ఆన్ లైన్ క్లాసుల వైపు నడుస్తున్నారు. దీంతో ఇప్పుడు ఓ స్కూల్ యాజమాన్యం ఓ ఆఫర్ ప్రకటించింది. తమ స్కూల్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు మొబైల్ ఫోన్ ఇస్తామని ప్రకటించింది. అయితే, అదేదో కార్పొరేట్ స్కూల్ అనుకుంటే పొరపాటు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రైవేటు స్కూలు. ఆ స్కూల్లో పనిచేసే టీచర్లు అందరూ కలసి కొంత డబ్బులు ఖర్చుపెట్టి ఈ సెల్ ఫోన్లు కొనిచ్చేందుకు ముందుకొచ్చారు. వారు విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయడానికి ఈ పనిచేయడం లేదు. విద్యార్థులు సెల్ ఫోన్లు లేక పాఠశాలకు రాకుండా ఇంటి వద్దే ఉండిపోయే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఇలా సెల్ ఫోన్లు ఇస్తున్నారు.

తమిళనాడు మదురైలోని తియాగరాజర్ పాఠశాల తమ స్కూల్​లో చేరే 6వ తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా ఫోన్లు ఇస్తామని తెలిపింది. ఆన్​లైన్ తరగతులకు హాజరయ్యేందుకు వీటిని అందించనున్నట్లు పేర్కొంది యాజమాన్యం. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభించిన యాజమాన్యాలు.. విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లకూ అంగీకారం తెలిపింది. ఫలితంగా కొత్త విద్యార్థుల కోసం మొబైల్ ఫోన్ల ఆఫర్​ పెట్టింది తియాగరాజర్​​ స్కూల్​.. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపల్ రామనాథన్ చెప్పారు. అలాగే తమిళ భాషను ప్రోత్సహించేందుకు కూడా ఇది దోహదపడుతుందన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 30, 2020, 4:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading