ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది విద్యార్థులు(Students) ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించినప్పటికీ డబ్బు లేక పై చదువులకు వెళ్లలేకపోతున్నారు. తమకు ఆర్థిక సాయం(Finance Help) చేసి ఉన్నత విద్య విద్య వైపు ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటువంటి కథే.. తమిళనాడుకు(Tamilanadu) చెందిన ఓ విద్యార్థినిది. మధురైలోని పనమూప్పన్ పట్టి గ్రామానికి చెందిన తంగపాచి అనే విద్యార్థిని జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్(NEET)లో రెండు సార్లు ఉత్తీర్ణత సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాల్లో మెరుగైన ర్యాంకు సాధించి కన్యాకుమారిలోని మూకాంబిక మెడికల్ కాలేజీలో(Medical College) సీటు దక్కించుకుంది.
అయితే ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్కు(Scolarship) అర్హత ఉన్నప్పటికీ.. వసతి, భోజన ఖర్చులు భరించే స్థోమత తన కుటుంబానికి లేదని ఆమె వాపోతోంది. ప్రభుత్వం తనకు సహాయం అందించాలని ట్విట్టర్(Twitter) వేదికగా వేడుకుంది.“ప్రభుత్వం నా ట్యూషన్ ఫీజు(Tution fee) మాత్రమే చెల్లిస్తోంది. వసతి, భోజనం వంటి ఇతర ఖర్చులకు నా దగ్గర డబ్బు లేదు. దీంతో దిక్కు తోచని పరిస్థితుల్లో నా కుటుంబంతో కలిసి వ్యవసాయం చేస్తున్నాను. దయచేసి నా మెడిసిన్ పూర్తయ్యే వరకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నాను.” అని తంగపాచి చెప్పారు.
ప్రభుత్వమే సహాయం చేయాలని వేడుకోలు..
తంగపాచి 2021,2022 విద్యా సంవత్సరంలో వరుసగా NEET పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె తండ్రి ఓ రైతు. వ్యవసాయం చేయగా వచ్చే చిన్నపాటి ఆదాయంతోనే తన నలుగురు పిల్లలను చదివిస్తున్నాడు. వారిలో తంగపాచి పెద్ద అమ్మాయి. ఆమె 2020లో విక్రమంగళం కల్లార్ హైస్కూల్ నుండి తన హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉత్తీర్ణత సాధించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వైద్యురాలు కావాలనే లక్ష్యంతో ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగా నీట్ పరీక్షకు ప్రిపేర్ అయింది.
కష్టపడి చదివి 2021, 2022 నీట్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. మెడిసిన్ చదవడానికి ఖర్చులు ఎక్కువగా ఉండటంతో పాటు ఆమె ట్యూషన్ ఫీజు, వసతి, భోజనం ఖర్చులను కుటుంబం భరించలేక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చేరలేకపోయింది. తంగపాచికి కన్యాకుమారిలోని మూకాంబిక మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివే అవకాశం వచ్చింది. అయినప్పటికీ ఆమె చదువుకు అయ్యే ఖర్చులను కుటుంబం భరించలేక వ్యవసాయం చేస్తోంది. ప్రభుత్వమే తన మెడిసిన్ చదువుకు ఆర్థిక సాయం చేయాలని తంగపాచి కోరుతోంది. దాతలు ఎవరైనా స్పందించాలని సోషల్ మీడియా ద్వారా కోరుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, NEET, Tamilanadu