హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

10th class students: టెన్త్ క్లాస్ ఫెయిలైన విద్యార్థులు బంపరాఫర్.. ఫ్రీ టూర్ ప్యాకేజీ

10th class students: టెన్త్ క్లాస్ ఫెయిలైన విద్యార్థులు బంపరాఫర్.. ఫ్రీ టూర్ ప్యాకేజీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎస్​ఎస్ఎల్​సీ (10వ తరగతి) ఫెయిలైన విద్యార్థులకు కుటుంబాలతో సహా కొడైకెనాల్​లో ఉచిత వసతి కల్పిస్తానని ప్రకటించారు. విద్యార్థులు ఇక్కడి వచ్చి రిలాక్స్ కావాలని వెల్లడించారు.

పదో తరగతి ఫెయిలైతే విద్యార్థుల మనసు ఎంతో నొచ్చుకుంటుంది. కొందరు మానసిక వేదనకు గురవుతారు. మిగిలిన విద్యార్థులతో పోల్చుకొని ఆవేదన చెందుతారు. అలాంటి సమయంలో ఫెయిలైన విద్యార్థుల మనసు కుదుట పడాలంటే టూర్ వేయడమే సరైన మార్గం. ఇలాంటి వారి కోసమే కొడైకెనాల్​కు చెందిన ఓ వ్యక్తి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎస్​ఎస్ఎల్​సీ (10వ తరగతి) ఫెయిలైన విద్యార్థులకు కుటుంబాలతో సహా కొడైకెనాల్​లో ఉచిత వసతి కల్పిస్తానని ప్రకటించారు. విద్యార్థులు ఇక్కడి వచ్చి రిలాక్స్ కావాలని వెల్లడించారు. ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులు మానసికంగా కుదుటపడేలా ఈ ఆఫర్​ను ప్రకటించిన వ్యక్తి పేరు కే.సుధీశ్ ​. తమిళనాడులోని ప్రముఖ హిల్​స్టేషన్ కొడైకెనాల్​లో ఆయన ఉన్నారు. పదో తరగతి ఎగ్జామ్స్ ఫెయిలై బాధతో ఉన్న విద్యార్థులు కొడైకెనాల్ వస్తే రెండు రోజుల పాటు తనకు చెందిన ఇళ్లలో ఉచితంగా భోజనంతో పాటు వసతి ఏర్పాటు చేస్తానని సుదీశ్​ ప్రకటించారు.

కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థులు రెండు రోజుల పాటు ఉండవచ్చని చెప్పారు. విద్యార్థులకు మానసిక ధైర్యం ఇచ్చేలా చేసేందుకే తాను ఈ కార్యక్రమం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సుధీశ్.. సోషల్ మీడియాలో ప్రకటించగానే.. ఆయన ఫోన్ నాన్​స్టాప్​గా మోగుతూనే ఉందట. రాష్ట్రంలోని చాలా చోట్ల నుంచి విద్యార్థులు, విద్యావేత్తలు, కుటుంబాలు తనకు కాల్​ చేస్తున్నారని, ఈ ఉచిత వసతి గురించి వివరాలు తెలుసుకుంటున్నారని సుధీశ్ అన్నారు. “10వ తరగతి ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి తమ విజయాలను చాలా మంది సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. అయితే దీనికి మరో వైపును చాలా మంది చూడరు. ఫెయిలైన విద్యార్థులు కూడా ఉంటారు. ఇలా జరిగిందని వారు ఎంతో బాధపడుతుంటారు. ఇలాంటి కష్టసమయంలో వారికి నా వంతు సాయం చేయాలనుకున్నాను” అని సుధీశ్ చెప్పారు.

కేరళలోని కోజికోడ్​కు చెందిన సుధీశ్​.. కుటుంబంతో సహా 2006 నుంచి కొడైకెనాల్​లో స్థిరపడ్డాడు. హోటల్ మేనేజ్​మెంట్​ పూర్తి చేసుకున్న సుధీశ్ ఓ రిసార్ట్​లో విధులు నిర్వర్తిస్తున్నాడు. “ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అన్ని విషయాల నుంచి దూరంగా ఉండొచ్చు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇక సరైన స్థలం. మా కాలంలో ఫెయిలైనా ధైర్యంగా ముందుకు వెళ్లేవాళ్లం. అయితే ఈ కాలంలో విద్యార్థులపై చాలా ఒత్తిడి ఉంటోంది. పాస్​ కావడం అనేది కుటుంబం పరువు అన్న రీతిలో పరిస్థితులు మారిపోయాయి. అందుకే ఒత్తిడికి దూరమైతే పిల్లలు మళ్లీ అన్ని విషయాల్లో మెరుగవుతారు” అని సుధీశ్ చెప్పారు.

అలాగే కుటుంబంతో వస్తేనే విద్యార్థులకు ఉచిత వసతి ఇస్తామని సుధీశ్ ప్రకటించారు. స్నేహితులతో వస్తే అవకాశం ఉండదని చెప్పారు. అలాగే జూలై నెలాఖరు వరకు ఈ ఆఫర్ ఉంటుందని తెలిపారు. స్టూడెంట్స్ వచ్చే ముందు 10వ తరగతి ఫెయిలైనట్టు సర్టిఫికేట్ తప్పకుండా తీసుకురావాలని సుధీశ్ చెప్పారు. ఐతే ఈ ఆఫర్‌ను పబ్లిసిటీ స్టంట్‌గా కొందరు కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే కరోనా నేపథ్యంలో 2020, 2021లో పరీక్షలే జరగలేదు. దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేశారు. అసలు ఫెయిలైన విద్యార్థులే లేరు.ఒకవేళ ఉన్నా ఒకరో ఇద్దరో ఉంటారు. అందుకే ఈ ఆఫర్‌ని పెట్టి.. పబ్లిసిటీ పొందుతున్నాడని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Ssc, Tamilnadu, Tourism, Tourist place

ఉత్తమ కథలు