TALENT GAP IN AVGC INDUSTRY SHORTAGE OF EXPERTS IN THE FIELD OF VISUAL EFFECTS WHAT IS THE SOLUTION TO THIS KNOW HERE GH VB
Talent Gap In AVGC Industry: విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో నిపుణుల కొరత.. దీనికి సొల్యూషన్ ఏంటంటే..
ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక వృద్ధి రేటుతో వృద్ధి చెందుతోన్న ఇండస్ట్రీల్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (AVGC) పరిశ్రమ ముందుంది. అయితే ఈ రంగంలో అవకాశాలు మెండుగా ఉన్నా నిపుణులకు మాత్రం కొరత ఉంది.
ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక వృద్ధి రేటుతో వృద్ధి చెందుతోన్న ఇండస్ట్రీల్లో యానిమేషన్(Animation), విజువల్ ఎఫెక్ట్స్(Visual Effects), గేమింగ్ అండ్ కామిక్స్ (AVGC) పరిశ్రమ ముందుంది. అయితే ఈ రంగంలో అవకాశాలు మెండుగా ఉన్నా నిపుణులకు మాత్రం కొరత ఉంది. ఇటీవల 2022 బడ్జెట్లో ఆర్థిక మంత్రి(Finance Minister) నిర్మలా సితారామన్ కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు. దేశంలో యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ రంగాన్ని సరైన గాడిలో పెడితే ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ను సాధించొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై యానిమేషన్ అండ్ గేమింగ్ సెక్టార్(Gaming Sector) నిపుణుడు సిబి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇలా వివరించారు. కేపీఎంజీ 2021 నివేదిక ప్రకారం.. మనదేశంలో 2019లో 250 మిలియన్ల గేమర్లు ఉంటే 2021 నాటికి ఆ సంఖ్య 400 మిలియన్లకు పెరిగింది. అంటే గేమింగ్ రంగాన్ని యువతకు ఎంతగానో ఇష్టపడుతున్నారని అర్థమవుతుంది. అయితే ఇదే ఇష్టాన్ని నైపుణ్యంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. యానిమేషన్, గేమింగ్ రంగాల్లో షార్ట్ టర్మ్ కోర్సులు అందించడం ద్వారా ఈ రంగంలో ఉన్న నిపుణుల కొరతను కొంతవరకైనా తీర్చవచ్చు.
యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ రంగాల్లో షార్ట్ టర్మ్ కోర్సులను ఏర్పాటు చేయడం ద్వారా యువతకు మరింత ఉపాధిని కల్పించొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో కూడిన కోర్సులను ఏర్పాటుచేయాలి. ప్రస్తుతం దేశంలో యానిమేషన్ రంగానికి సంబంధించి పలు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే చిన్నచిన్న ప్రోగ్రామ్స్ ద్వారా తక్కువ టైంలో ఎక్కువ స్కిల్స్‌ను నేర్పించడం ద్వారా యానిమేషన్ రంగంలో యువత మరింత వేగంగా దూసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.
యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ రంగాల్లో ఎన్నో కేటగిరీలున్నాయి. ఒక్కో విభాగానికి ఒక్కోరకమైన నైపుణ్యాలు అవసరం. ఇందులో గేమింగ్ డిజైన్, నెరేటివ్ డిజైన్, టెక్నికల్ ఆర్టిస్ట్, గేమ్ డెవలపర్, ప్రోగ్రామర్, గేమ్ టెస్టర్, సౌండ్ డిజైనర్, యానిమేటర్, మోషన్ గ్రాఫిక్స్ ఆర్టిస్ట్, ఇలస్ట్రేటర్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్.. ఇలా ఎన్నో రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి కోర్సులు అందుబాటులో ఉంటే ఈ రంగంలో ఉన్న నిపుణుల కొరతను తీర్చవచ్చు.
భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జనరేషన్ జెడ్(Gen-Z) వాళ్లు సినిమా, గేమింగ్ రంగాలను అమితంగా ఇష్టపడుతున్నారు. వాళ్లు ఇష్టంగా ఆడే గేమ్స్‌ను ఎలా తయారుచేయాలో వారికి నేర్పగలిగితే.. ఉపాధి అవకాశాలను, నిపుణుల కొరతను ఏకకాలంలో తీర్చవచ్చు. సినిమాల విషయానికొస్తే.. మనదేశంలో ఇప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. బాహుబలి, మగధీర, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు తెరకెక్కించడానికి ఎన్నోరకాల గ్రాఫిక్స్ అవసరమవుతాయి. సినిమాల్లో గ్రాఫిక్స్ వాడకం ఎంత వేగంగా పెరుగుతున్నా.. ఆయా రంగాల్లో నిపుణులను మాత్రం మనం సృష్టించలేకపోతున్నాం. అత్యధిక నాణ్యత గల విజువల్ ఎఫెక్ట్స్‌తో మన భారతీయ కథలను చెప్పగలిగితే.. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. చైనా వంటి దేశాలను అధిగమించడానికి, ఐటీ రివల్యూషన్ లాగా మరొక రివల్యూషన్ రావడానికి.. యానిమేషన్ రంగంలో మంచి స్కోప్ ఉంది. దీన్ని సరిగ్గా వినియోగించుకోవడమే మనం చేయాల్సింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.