హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Group-1 Exam: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్ పై డౌట్స్ ఉన్నాయా? అయితే.. ఈ నంబర్ కు కాల్ చేయండి

TSPSC Group-1 Exam: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ఎగ్జామ్ పై డౌట్స్ ఉన్నాయా? అయితే.. ఈ నంబర్ కు కాల్ చేయండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

టీఎస్పీఎస్సీ గ్రూప్-1 (TSPSC Group 1) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త. ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం కల్పించింది టీ-సాట్ నెట్ వర్క్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్ 1 ఉద్యోగాలకు (Jobs) సంబంధించి మొత్తం 3,82,202 దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను అక్టోబర్ 16న నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే పరీక్షకు దాదాపు నెలన్నర మాత్రమే సమయం మిగిలి ఉందన్నమాట. మెయిన్ ఎగ్జామ్ (Exam) వచ్చే ఏడాది అంటే 2023 జనవరి/ఫిబ్రవరి నెలల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం నిర్వహిస్తున్న తొలి గ్రూప్-1 ఎగ్జామ్ కావడంతో ఈ పరీక్షకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. చాలా మంది అభ్యర్థుల్లో సిలబస్, ప్రిపరేషన్, మోడల్ పేపర్లకు సంబంధించి అనేక సందేహాలున్నాయి. అయితే.. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది టీ-సాట్ నెట్వర్క్.

  టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్షలో సక్సెస్ కావడం ఎలా? అనే అంశంపై స్పెషల్ లైవ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. రేపు అంటే సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈ లైవ్ నిర్వహించనున్నారు. ఈ లైవ్ లో సబ్జెక్ట్ నిపుణులు శివకుమార్, సురేష్ కుమార్ పాల్గొననున్నారు. వారు ఎకానమీ సబ్జెక్టులో అభ్యర్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారు. అభ్యర్థులు 040-23540326, 23540726, టోల్ ఫ్రీ నంబర్: 18004254039 కు కాల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని టీసాట్ అధికారులు తెలిపారు. అభ్యర్థులు టీసాట్ కు సంబంధించిన ఫేస్ బుక్, యూ ట్యూబ్ తదితర సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ లైవ్ ను చూడొచ్చు.

  TS Constable Exam Key: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. క్వాలిఫై కోసం ఎన్ని మార్కులు రావాలంటే?

  ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో (Telangana Government School) చదువుతున్న విద్యార్థులకు ఎన్.ఎం.ఎం.ఎస్ (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్) పోటీ పరీక్షపై టి-సాట్ నెట్వర్క్ (T-SAT) ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్నిఅందిస్తోందని సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29వ తేదీ సోమవారం రోజు టి-సాట్ (T-SAT)  విద్య ఛానల్ లో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఎన్.ఎం.ఎం.ఎస్ పోటీ పరీక్షపై ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమం ప్రసారం అవుతుందన్నారు.

  ఎన్.సి.ఈ.ఆర్.టి అందించే ఈ ఉపకార వేతనాలు తెలంగాణలోని ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని సీఈవో గుర్తుచేశారు. 2022 విద్యా సంవత్సరానికి నవంబర్ లో జరిగే పరీక్షకు అర్హత కలిగిన విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ సిద్ధం చేసేందుకు టి-సాట్ నెట్వర్క్ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: JOBS, Telangana government jobs, TSPSC

  ఉత్తమ కథలు