Home /News /jobs /

T SAT NETWORK PROVIDES FREE COACHING TO TSPSC GROUP 1 ASPIRANTS HERE FULL DETAILS NS

TSPSC Group 1 | T-SAT: తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులకు శుభవార్త.. టీ-సాట్ ఆధ్వర్యంలో బెస్ట్ ఫ్యాకల్టీతో ఫ్రీ కోచింగ్.. వివరాలివే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ గ్రూప్ 1 (TSPSC Group 1) అభ్యర్థులకు టి-సాట్ నెట్వర్క్ (T-SAT Network) శుభవార్త చెప్పింది. అనుభవం కలిగిన ఫ్యాకల్టీచే కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్ట్రీ, పాలిటీ, కల్చర్, ఎకనామీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల్లో సుమారు 1000 ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో 503 గ్రూప్ 1 (TSPSC Group 1) ఖాళీల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల నోటిఫికేషన్ (Telangana Jobs Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ఖాళీలలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైన చరిత్ర లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విడుదలైన తొలి నోటిఫికేషన్ కావడంతో లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్ 1 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు. అయితే.. సమయం తక్కువగా ఉండడంతో చాలా మంది కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా ఇంటి నుంచే ప్రిపేర్ అవుతుననారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టి-సాట్ నెట్వర్క్ అలాంటి అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. గ్రూప్-1 అభ్యర్థుల కోసం ప్రత్యేక పాఠ్యాంశ ప్రసారాలు అందించనున్నట్లు ప్రకటించింది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల కోసం ప్రత్యక్ష ప్రసారాలు, మాక్ టెస్టులు, క్విజ్ ఎపిసోడ్స్ అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది టీ-సాట్.

    - గ్రూప్-1 పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రసారాల వివరాలను టి-సాట్ సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి ఇటీవల ఓ ప్రకటన ద్వారా విడుదల చేశారు.
    - ఏప్రిల్ 25వ తేదీ నుండి లైవ్ ప్రసారాలను అందిస్తుండగా, 10వ తేదీ నుంచి గంట పాటు రికార్డింగ్ పాఠ్యాంశాలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నిపుణ ఛానల్ లో సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు, విద్య ఛానల్ లో ఉదయం ఏడు నుండి ఎనిమిది గంటల వరకు పున:ప్రసారాలుంటాయన్నారు.
    - ప్రభుత్వం తొలిసారిగా భర్తీ చేస్తున్న 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని అనుభవం కలిగిన ఫ్యాకల్టీచే కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్ట్రీ, పాలిటీ, కల్చర్, ఎకనామీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల్లో సుమారు 1000 ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నట్లు శైలేష్ రెడ్డి తెలిపారు.
    Telangana Police Jobs: పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్.. లాస్ట్ మినిట్ లో ఈ మిస్టేక్స్ చేయొద్దు

    టెట్ ప్రసారాలు మరో గంట అదనం:
    ప్రభుత్వం జూన్ 12వ తేదీన నిర్వహించబోయే ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం పోటీ పడే అభ్యర్థులకు మరో గంట ప్రసారాలను అదనంగా అందిస్తున్నామని సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు.
    - ఏప్రిల్ ఐదవ తేదీ నుండి అరగంట నిడివిగల రెండు పాఠ్యాంశ భాగాలను ప్రసారం చేస్తుండగా మరో అరగంట అదనంగా అందించడంతో పాటు ఉర్డూ పాఠ్యాంశాలను అరగంట అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఫలితంగా టెట్ అభ్యర్థులకు జూన్ ఐదవ తేదీ వరకు 150 ఏపిసోడ్స్ రోజు రెండు గంటల చొప్పున అందనున్నాయన్నారు.
    ONGC Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిప్లొమా అర్హతతో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్స్.. దరఖాస్తుకు మరో 3 రోజులే ఛాన్స్

    క్విజ్ మరియు మాక్ టెస్టులు:
    పోటీ పరీక్షలకు అభ్యర్థులను అన్ని విధాలుగా సిద్ధం చేసేందుకు టి-సాట్ ప్రత్యేకంగా క్విజ్ ఎపిసోడ్స్ ప్రసారం చేస్తూ అన్ లైన్ మాక్ టెస్ట్ నిర్వహించి ప్రతిభకు పదును పెట్టే కార్యక్రమాన్ని చేపట్టిందని శైలేష్ రెడ్డి తెలిపారు. పాఠ్యాంశాల్లోని ప్రశ్నలను ఆకర్షణీయ పద్దతుల్లో గ్రాఫిక్స్, యానిమేషన్స్ జతచేస్తూ చేస్తున్న ప్రసారాలను అభ్యర్థులు వినియోగించుకొని విజయాలు సాధించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs, TSPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు