దేశంలోని ప్రధాన బిజినెస్ స్కూల్స్‌లో(Business School) ఒకటైన సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (SIIB), ప్లేస్‌మెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో(Placement Drive) ఈ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు భారీ ప్యాకేజీతో ఉద్యోగాలను సొంతం చేసుకున్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్ పూణే కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 2020-22 బ్యాచ్ కోసం ప్లేస్‌మెంట్ డ్రైవ్ కొనసాగుతుంది. అయితే ఒక యూఎస్ బేస్డ్ కంపెనీ(US Based Company), ఇక్కడి విద్యార్థికి ఏకంగా రూ.67.11 లక్షల జీతాన్ని ఆఫర్ చేసింది. ఇంటర్నేషనల్ సీటీసీ(మొత్తం ప్యాకేజీ)లో ఇది 82000 అమెరికన్ డాలర్ల వరకు ఉంటుంది. ఇది ఒక రికార్డు స్థాయి ఆఫర్ అని సింబయాసిస్ బీస్కూల్ తెలిపింది.
ఈ బిజినెస్ స్కూల్‌లో ప్రస్తుతం హయ్యెస్ట్ డొమెస్టిక్ సీటీసీ సంవత్సరానికి రూ. 20.17 లక్షలకు చేరుకుంది. యావరేజ్, మీడియన్ సీటీసీ వరుసగా ఏడాదికి రూ.11.32 లక్షలు, రూ. 11.02 లక్షలకు పెరిగింది. అగ్రిబిజినెస్ ఇన్ ఎంబీఏ విభాగంలో అత్యధిక డొమెస్టిక్ శాలరీ ఏడాదికి రూ. 16.80 లక్షలుగా ఉంది. మీడియన్, యావరేజ్ శాలరీ వరుసగా రూ. 9.96 లక్షలు, 10.37 లక్షలుగా ఉంది. హయ్యెస్ట్ ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్ పొందిన వారికి జీతం 82000 అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్స్ మీడియన్, యావరేజ్ శాలరీ వరుసగా ఏడాదికి రూ.17.55 లక్షలు, రూ.29.52 లక్షలుగా ఉంది.
ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఇన్ ఎంబీఏ విభాగంలో అభ్యర్థులు సాధించిన హయ్యెస్ట్, యావరేజ్, మీడియన్ జీతం వరుసగా ఏడాదికి రూ.15.42 లక్షలు, రూ.10.16 లక్షలు, రూ.9.72 లక్షలుగా ఉంది. 2021-23 బ్యాచ్ కోసం ఇప్పటివరకు వచ్చిన అత్యధిక ప్లేస్‌మెంట్ ఆఫర్ ఏడాదికి రూ.39 లక్షలు కాగా, హయ్యెస్ట్ ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ ఏడాదికి రూ.34 లక్షలుగా ఉంది.
ఆ రంగంలో ఎక్కువ ఆఫర్స్..
చాలా కంపెనీలు ESG (ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్), ఇతర అనుబంధ రంగాల్లో ఎక్కువ జాబ్ రోల్స్‌ను ఆఫర్ చేశాయి. అలాగే సస్టైనబిలిటీ & క్లైమేట్ చేంజ్ కన్సల్టింగ్, ఈఎస్‌జీ డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిస్ట్, సేల్స్ అండ్ మేనేజ్‌మెంట్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో కూడా వివిధ జాబ్ రోల్స్ కోసం కంపెనీలు ఆఫర్ చేశాయి. ప్లేస్‌మెంట్ సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు SIIB డైరెక్టర్ డాక్టర్ అస్మితా చిట్నిస్. కొత్త రిక్రూటర్స్ పట్ల ఇన్‌స్టిట్యూట్ కృతజ్ఞత భావంతో ఉందన్నారు. విద్యార్థులకు వరల్డ్ క్లాస్ విద్యను అందించి, వారి కెరీర్ గ్రోత్‌కు బాటలు వేస్తున్నామని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.