SV University: పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలకు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల కార్యాలయం ఎగ్జామ్ షెడ్యూల్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను వెలువరించింది

news18-telugu
Updated: September 20, 2020, 7:36 AM IST
SV University: పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో వివిధ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ కొనసాగుతుండటంతో పలు యూనివర్సిటీలు పరీక్షల తేదీలను ఖరారు చేస్తున్నాయి. తాజాగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలకు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల కార్యాలయం ఎగ్జామ్ షెడ్యూల్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను వెలువరించింది. పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 6వ తేదీ వరకు జరుగుతాయని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి దామ్లా నాయక్ తెలిపారు. సబెక్ట్‌ల వారీగా పరీక్షల తేదీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు చెప్పారు.

పీజీ పరీక్షల కోసం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే కర్నూలులో రెండు, అనంతపురం, నెల్లూరు, కడపలో ఒక్కటి చొప్పున.. మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలను అంతర్ జిల్లాల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు తాము ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం పరీక్షకేంద్రాలకు హాజరయ్యే అవకాశం కల్పించినట్టు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ కరోనా నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులు ఆదేశించినట్టు చెప్పారు.
Published by: Sumanth Kanukula
First published: September 20, 2020, 7:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading