Home /News /jobs /

Courses: విద్యార్థుల్లో ఆ కోర్సుల పట్ల పెరుగుతున్న ఆసక్తి.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు

Courses: విద్యార్థుల్లో ఆ కోర్సుల పట్ల పెరుగుతున్న ఆసక్తి.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు

విద్యార్థుల్లో ఆ కోర్సుల పట్ల పెరుగుతున్న ఆసక్తి.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు

విద్యార్థుల్లో ఆ కోర్సుల పట్ల పెరుగుతున్న ఆసక్తి.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు

ఐటీ కోర్సులతో (IT Course) పాటు మేనేజ్​మెంట్​ కోర్సుల్లో (Management Courses) చేరే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజాగా అప్లికేషన్ ట్రెండ్స్ నిర్వహించిన సర్వేలో ఇదే విషయం బయటపడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నేటి తరం యువత ఉద్యోగావకాశాలు ఉన్న కోర్సుల (Courses) వైపే మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా ఐటీ (Information Technology) కోర్సులతో పాటు మేనేజ్​మెంట్​ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజాగా అప్లికేషన్ ట్రెండ్స్ నిర్వహించిన సర్వేలో (Survey) ఇదే విషయం బయటపడింది. 2021లో దేశవ్యాప్తంగా మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించే వారి సంఖ్య గతేడాది కంటే 0.4 శాతం పెరిగిందని వార్షిక నివేదికలో పేర్కొంది. కరోనా (Corona) మహమ్మారి కారణంగా ఎక్కువ మంది విద్యార్థులు మేనేజ్​మెంట్ విద్య వైపు ఆసక్తి చూపిసనట్లు సర్వే వెల్లడించింది. ఈ ధోరణి ప్రపంచవ్యాప్తంగా కనిపించగా.. భారత్​లో ఇది కాస్త ఎక్కువగానే ఉందని సర్వే అభిప్రాయపడింది. కోవిడ్ సమయంలో అభ్యర్థులు ప్రత్యామ్నాయ కెరీర్ ఆప్షన్ల వైపు చూస్తున్నారని, అందుకే బిజినెస్​ స్కూళ్లు ఎక్కువ మందికి అడ్మిషన్​ కల్పించాయని సర్వే వెల్లడించింది.

అమెరికాలో బైడెన్​ ప్రభుత్వం అవలంభిస్తున్న స్నేహపూర్వక వీసా విధానాలు, రెండేళ్ల వర్క్ వీసా సౌకర్యం కల్పించడం వంటివి అడ్మిషన్ల పెరుగుదలకు ప్రధాన కారణాలని సర్వే తేల్చి చెప్పింది. అయితే, పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది మేనేజ్​మెంట్​ విద్యలో చేరేందుకు ఆసక్తి కనబర్చడం ఆసక్తికరం. రెండేళ్ల ఫుల్​ టైమ్​ ఎంబీఏ ప్రోగ్రామ్​ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఐదుగురిలో ముగ్గురు (60 శాతం) మహిళలే ఉండటం గమనార్హం. అయితే, ఆన్‌లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో మాత్రం మహిళలు కాస్త వెనుకబడి ఉన్నారు. కేవలం 42 శాతం మంది మాత్రమే ఆన్​లైన్​ ఎంబీఏ ప్రోగ్రామ్​లో చేరారు. ఏదేమైనా గతంతో పోలిస్తే ఇది ఎక్కువనే చెప్పవచ్చు.
Microsoft: నిరుద్యోగులకు మైక్రోసాఫ్ట్​ గుడ్​న్యూస్​.. సైబర్​ సెక్యూరిటీలో ఉచిత ఆన్​లైన్​ ట్రైనింగ్.. వివరాలివే

పురుషుల కంటే మహిళలే ఎక్కువ..
ఇతర దేశాల్లో మేనేజ్​మెంట్​ ప్రోగ్రామ్​కు దరఖాస్తులు 3.8 శాతం క్షీణించగా.. భారత్​లో మాత్రం 4.1 శాతం వృద్ధి నమోదవ్వడం విశేషం. అంటే, యూరప్, యుఎస్, యుకె దేశాలతో పోలిస్తే భారత్​లోనే ఎక్కువ మంది మేనేజ్​మెంట్​ కోర్సుల్లో చేరినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. రెండేళ్ల ఫుల్​ టైమ్​ ఎంబీఏ ప్రోగ్రామ్​ వాటా 2019లో 28 శాతం నుంచి 2021లో 57 శాతానికి రెట్టింపు అయ్యింది.
Education Loan: చదువుకోవడానికి లోన్ కావాలా? ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువ

ఏడాది వ్యవధి గల ఫుల్​టైమ్​ ఎంబీఏలో 52 శాతం, రెండేళ్ల ఫుల్​ టైమ్​ ఎంబీఏలో 56 శాతం పెరుగుదల నమోదైంది. అంటే మిగతా అన్ని ప్రోగ్రామ్​లతో పోలిస్తే సగటున 41 శాతం వృద్ది నమోదైంది. దీనితో పాటు పార్ట్-టైమ్ ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఆన్‌లైన్ ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లుకు కూడా ఆదరణ గణనీయంగా పెరిగింది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Career and Courses, College student, New course, Student

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు