NEET, JEE పరీక్షలకు లైన్ క్లియర్.. రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం

ఆగస్టు 17న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలన్న వారి పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ కృష్ణ మురారి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది.

news18-telugu
Updated: September 4, 2020, 3:13 PM IST
NEET, JEE పరీక్షలకు లైన్ క్లియర్.. రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం
తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్. 2020-21 విద్యా సంవత్సరానికి గాను నూతన దరఖాస్తు కోసం ఎంహెచ్ఆర్డీ తెలంగాణ రాష్ట్రానికి 2,570 స్కాలర్‌షిప్‌లను కేటాయించింది.
  • Share this:
జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (JEE), నేషనల్ ఎలిజిబిలీటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) పరీక్షలకు లైన్ క్లియరైంది. షెడ్యూల్ ప్రకారమే JEE (Mains), NEET (UGC) పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఆరు రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆగస్టు 17న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలని బీజేపీయేతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఇటీవల రివ్యూ పిటిషన్ వేశారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో పాటు సరైన రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐతే పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ కృష్ణ మురారి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించుకోవచ్చని కేంద్రానికి సూచించింది.

కాగా, సెప్టెంబర్ 1 నుంచి JEE మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 6 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇక సెప్టెంబర్ 13న NEET పరీక్షలను నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంపుతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను 570 నుంచి 660కి, నీట్ కేంద్రాలను 2546 నుంచి 3843కి పెంచారు. షిఫ్ట్‌ల సంఖ్యను కూడా 8 నుంచి 12 పెంచి.. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే వారి సంఖ్యను తగ్గించారు. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యను 1.32 లక్షల నుంచి 85వేలకు తగ్గించారు. కాగా, దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు 8.58 లక్షల మంది విద్యార్థులు, నీట్‌కు 15.97 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 4, 2020, 3:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading