Home /News /jobs /

SUPREME COURT RECRUITMENT 2022 APPLY FOR 210 JUNIOR COURT ASSISTANT POSTS UMG GH

Recruitment: సుప్రీంకోర్టులో ఉద్యోగ అవకాశాలు.. ఇంగ్లిష్ టైపిస్ట్‌లకు గుడ్ న్యూస్.. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సుప్రీంకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.

సుప్రీంకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.

భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల (గ్రూప్ ‘బి’ నాన్ గెజిటెడ్) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ main.sci.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

భారత సర్వోన్నత న్యాయస్థానం Supreme Court, జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టుల (గ్రూప్ ‘బి’ నాన్ గెజిటెడ్) భర్తీకి Notification విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ main.sci.gov.in ద్వారా Apply చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2022 జూలై 10గా నిర్ణయించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సుప్రీంకోర్టు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన మొత్తం 210 ఖాళీలను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్- 6 ప్రకారం నెలకు రూ.35, 400 జీతం ఇవ్వనున్నారు.

అర్హత ప్రమాణాలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 35 w.p.m మినిమం స్పీడ్‌తో కంప్యూటర్‌లో ఇంగ్లిష్ టైప్ చేయాలి. అభ్యర్థికి తప్పనిసరిగా కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం ఉండాలి.
అభ్యర్థి వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ. 500, ఎస్సీ/ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ పీహెచ్ అభ్యర్థులైతే రూ.250 ఫీజుగా చెల్లించాలి.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు సుప్రీంకోర్టు వెబ్‌సైట్ sci.gov.in ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే (జూన్ 18న) ప్రారంభం కాగా, జూలై 10వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి కూడా చివరి తేదీ జూలై 10.

ఎంపిక ప్రక్రియ
ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష, ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, టైపింగ్ (ఇంగ్లీష్) టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ (ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

అలాగే జూన్ నెలలో దరఖాస్తు చేసుకోవడానికి అందుబాటులో ఉన్న ఉద్యోగాల జాబితాను పరిశీలిద్దాం.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM)
పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (IITM).. రీసెర్చ్ అసోసియేట్స్, ఫెలోస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 27లోపు tropmet.res.in అధికారిక వెబ్‌సైట్‌ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు 1 సంవత్సరం పాటు రీసెర్చ్ అసోసియేట్స్ పోస్ట్‌బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. పనితీరు ఆధారంగా మరో 2 సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది.

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్-2022
ఇండియన్ ఆర్మీకి చెందిన సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్... వాషర్‌మెన్, ట్రేడ్స్‌మెన్‌మేట్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన 45 రోజులలోపు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఈ రెండు పోస్టులకు సంబంధించి మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Government jobs, JOBS, Supreme Court

తదుపరి వార్తలు