Supreme Court Jobs: డిగ్రీ అర్హతతో సుప్రీం కోర్టులో జాబ్స్... అక్టోబర్ 24 లాస్ట్ డేట్

Supreme Court of India Jobs | సుప్రీం కోర్టు అధికారిక వెబ్‌సైట్ sci.gov.in ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. సెప్టెంబర్ 28న నోటిఫికేషన్ విడుదలైంది.

news18-telugu
Updated: October 19, 2019, 3:16 PM IST
Supreme Court Jobs: డిగ్రీ అర్హతతో సుప్రీం కోర్టులో జాబ్స్... అక్టోబర్ 24 లాస్ట్ డేట్
Supreme Court Jobs: డిగ్రీ అర్హతతో సుప్రీం కోర్టులో జాబ్స్... అక్టోబర్ 24 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం, image: PTI)
news18-telugu
Updated: October 19, 2019, 3:16 PM IST
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్-SPA, పర్సనల్ అసిస్టెంట్-PA పోస్టుల భర్తీకి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ పోస్టుల భర్తీకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 58 ఖాళీలున్నాయి. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్-SPA పోస్టుకు అప్లై చేసేవాళ్లకు కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు అనుభవం అవసరం లేదు. సుప్రీం కోర్టు అధికారిక వెబ్‌సైట్ sci.gov.in ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. సెప్టెంబర్ 28న నోటిఫికేషన్ విడుదలైంది. అదే రోజు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 24 చివరి తేదీ. పలు పోస్టుల భర్తీకి సుప్రీం కోర్టు జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Supreme Court of India Jobs: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 58

సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (SPA)- 35
పర్సనల్ అసిస్టెంట్ (PA)- 23
దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 28


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 24
Loading...
పరీక్ష తేదీ- వెల్లడించాల్సి ఉంది.
విద్యార్హత- ఏదైనా డిగ్రీ. నిమిషానికి 40 పదాల టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఇంగ్లీష్‌లో నిమిషానికి 110 పదాల షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఉండాలి.
వయస్సు- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్-SPA పోస్టుకు 32 ఏళ్లు, పర్సనల్ అసిస్టెంట్-PA 27 ఏళ్లు.

Supreme Court of India Jobs: దరఖాస్తు చేయండి ఇలా...


ముందుగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ sci.gov.in ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో రిక్రూట్‌మెంట్ లింక్ క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ల వివరాలుంటాయి.
పర్సనల్ అసిస్టెంట్ లేదా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ లింక్స్ ఉంటాయి. మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ లింక్ క్లిక్ చేయాలి.
మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో డీటెయిల్డ్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి.
మీకు తగిన అర్హతలు ఉన్నటైతే అప్లై బటన్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.
మీ వివరాలన్నీ ఎంటర్ చేసి, స్కాన్ చేసిన డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
దరఖాస్తు ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే

Post Office Jobs: తెలంగాణలో 970, ఏపీలో 2707 జాబ్స్... 10వ తరగతి పాసైతే చాలు

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 270 జాబ్స్... వివరాలివే

 
First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...