హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Super 30: సూపర్ 30 ప్రోగ్రామ్ ఎంపికకు ఎంట్రెన్స్ ఎగ్జామ్... ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Super 30: సూపర్ 30 ప్రోగ్రామ్ ఎంపికకు ఎంట్రెన్స్ ఎగ్జామ్... ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Super 30 | సూపర్ 30 కోచింగ్ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే విద్యార్థులు వచ్చే ఏడాది నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ (Entrance Test) పాస్ కావాల్సి ఉంటుంది.

సూపర్ 30... పేద విద్యార్థులు ఐఐటీల్లో చేరడానికి అవసరమైన శిక్షణను ఇచ్చే ఈ పాట్నా విద్యా సంస్థ గురించి తెలియని వారుండరు. గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ ఈ సూపర్ 30 కోచింగ్ ప్రోగ్రామ్​ను (Super 30 coaching programme ) ప్రారంభించారు. ఏటా 30 మంది స్థానిక పేద విద్యార్థులను ఎంపిక చేసుకొని వారి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత శిక్షణ (Free Coaching) ఇస్తున్నారు. ఆయన ఇచ్చే శిక్షణతో ఇప్పటికే ఎంతో మంది పేద విద్యార్థులు ఐఐటీల్లో సీటు దక్కించుకున్నారు. ఐఐటీల్లో చదవాలనే కల నెరవేర్చుకున్నారు. అయితే, సూపర్​ 30కి ఎంపిక చేయడానికి ఇకపై ఎంట్రన్స్​ టెస్ట్​ పెట్టనున్నారు. సూపర్​ 30లో మీరు ఒకరు కావాలంటే సంస్థ నిర్వహించే టెస్ట్​ క్లియర్​ చేయాల్సి ఉంటుంది.

Job Mela: మొత్తం 1,085 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌లో జాబ్ మేళా... రూ.60,000 వరకు వేతనం

ఈ పరీక్షను వచ్చే ఏడాది మార్చి నెలలో నిర్వహించనున్నారు. అందులో ప్రతిభ కనబర్చిన టాప్​ 30 విద్యార్థులను ఎంపిక చేసి ఉచిత శిక్షణనిస్తారు. ఈ ప్రోగ్రామ్​పై సూపర్​ 30 వ్యవస్థాపకులు ఆనంద్​ కుమార్​ మీడియాతో మాట్లాడుతూ.. "బుందేల్‌ఖండ్​లోని అనేక మంది పేద విద్యార్థులు చదువుకోవాలనుకుంటున్నారు. ఐఐటీ, ఎన్​ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంజినీరింగ్​ చదవాలనుకునే వారి కలకు పేదరికం అడ్డు కాకూడదు. అందుకే ప్రతి ఏటా లాగే ఈ సారి కూడా సూపర్ 30 కోసం ఎంట్రన్స్​ టెస్ట్​ నిర్వహించేందుకు సిద్దమవుతున్నాం. ఈ పరీక్ష మార్చిలోపు నిర్వహిస్తాం” అని చెప్పారు.

Don Bosco Scholarships: విద్యార్థులకు రూ.10 లక్షల వరకు స్కాలర్‌షిప్స్ ప్రకటించిన డాన్​ బాస్కో యూనివర్సిటీ

ఐఐటీ ఎంట్రన్స్​ టెస్ట్​కు ఉచిత శిక్షణ


సూపర్​ 30 అధికారిక వెబ్‌సైట్​లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని 30 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను శోధించి వారికి జేఈఈలో ఉచిత శిక్షణ ఇస్తామని వెబ్​సైట్​లో పేర్కొన్నారు. సూపర్ 30 అనేది పాట్నాలోని రామానుజన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కోచింగ్ ప్రోగ్రామ్ కింద నిర్వహిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్​లోని హమీర్‌పూర్ జిల్లాకు చెందిన ఆనంద్​ కుమార్ దీన్ని నెలకొల్పారు. విద్యారంగానికి ఆయన చేసిన కృషికి గాను.. గురుకుల కాంగ్రీ యూనివర్సిటీ ఇటీవల స్వామి భ్రమానంద్ అవార్డుతో సత్కరించింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రూప్ కిషోర్ శాస్త్రి నుంచి ఆనంద్ ఈ అవార్డు అందుకున్నారు.

స్వామి భ్రమానంద్ అవార్డు విద్య, గోసేవలో విశేష కృషి చేసిన వ్యక్తులకు అందజేస్తారు. స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పార్లమెంటేరియన్ స్వామి బ్రహ్మానంద విద్యా రంగానికి అందించిన సేవలకు గుర్తుగా ఆయన పేరుపై ఏటా ఈ అవార్డు అందజేస్తున్నారు.

First published:

Tags: Jee, JEE Main 2021

ఉత్తమ కథలు