Job Mela: అక్టోబర్ 2న హైదరాబాద్‌లో జాబ్ మేళా... కరోనాతో జాబ్స్ కోల్పోయిన వారికి స్పెషల్... ప్లేస్, టైమింగ్స్ వివరాలు తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

Job Mela in Hyderabad | కరోనా వైరస్ సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయినవారికి అలర్ట్. హైదరాబాద్‌లో సునైనా మేనేజ్మెంట్ కన్సల్టెంట్ జాబ్ మేళా (Job Mela) నిర్వహిస్తోంది. చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీలో అక్టోబర్ 2న జాబ్ మేళా జరగనుంది. టెన్త్, ఇంటర్, డిగ్రీ లాంటి కోర్సులు పాస అయినవారు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు.

 • Share this:
  M.Balakrishna, News18, Hyderabad

  ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి చిన్నాభిన్నం చేసింది. ఎన్నో పరిశ్రమలో ఉద్యోగుల జీతభత్యాలతో పాటుగా ఉద్యోగాలు (Jobs) కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. మరి కొన్ని కంపెనీలు సరైన ప్రాజెక్ట్ లేకుండా దివాళా తీసే స్థాయికి చేరుకున్నాయి. మొదటి వేవ్‌లో వర్క్ ఫ్రొమ్ హోమ్ (Work From Home) ఇచ్చిన కంపెనీలు... వారికీ వచ్చే సాలరీల అనుగుణంగా వారి జీతాలలో కోతలు విధించారు. మొదటి వేవ్ తగ్గుముఖం పట్టిందో లేదో రెండవ వేవ్ తీవ్ర ప్రభావం చూపించింది. సెకండ్ వేవ్‌లో కరోనా డెల్టా ప్లస్ ఉగ్రరూపం దాల్చి మరింత వేగంగా వ్యాప్తి చెందడంతో కరోనా వ్యాధి బారిన పడిన వారి సంఖ్యా రోజు రోజుకు అధికమవుతూ వచ్చింది.

  సెకండ్ వేవ్ తర్వాత చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగులందరికీ జీవితాలు ఇవ్వలేమంటూ చేతులు ఎత్తేసింది. అధిక పే స్కెల్ ఉన్న వారిని తొలగిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో వేలమంది ఉద్యోగులు రోడ్డుపాలయ్యారు. తాము చేస్తున్నా కొలువు పోయి నడిరోడ్డున పడ్డారు. అలాంటి వారికీ ఓ జాబ్ కన్సెల్టెన్సీ శుభ వార్త చెపుతోంది. కొన్ని వందల కంపెనీలతో జాబ్ మేళా ఏర్పాటు చేస్తోంది.

  Indian Navy Recruitment 2021: ఇంటర్ పాస్ అయినవారికి అలర్ట్... ఇండియన్ నేవీలో బీటెక్ చేయండిలా

  hyderabad job mela, hyderabad job mela 2021, it jobs in hyderabad, job mela hyderabad, job mela in hyderabad 2021, jobs in hyderabad, Sunaina management consultancy, జాబ్ మేళా, సునైనా మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు, హైదరాబాద్‌లో జాబ్ మేళా, హైదరాబాద్‌లో జాబ్స్

  కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికీ  సునైనా మేనేజ్మెంట్ కన్సల్టెంట్ (SMC) వారు సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మొదటి, రెండవ వేవ్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారికీ ఈ జాబ్ మేళ ఎంతగానో ఉపయోగపడనుంది. దాదాపుగా వందకు పైగా కంపెనీలతో ఈ జాబ్ మేళాను ఎస్ఎంయు నిర్వహిస్తోంది. ఉద్యోగాలు కోల్పోయిన వారే కాకుండా కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు.

  కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారి కోసమే ఈ జాబ్ మేళ నిర్వహిస్తున్నాం.ఉద్యోగాలు కోల్పోయిన వారికీ.... కొత్తగా కొలువు కోరుకొనే వారికీ ఇదొక సువర్ణ అవకాశం. ఎలాంటి ఎంట్రీ ఫీ లేకుండా ఉచితంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నాం. 50కి పైగా ఎమ్మెన్సీ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయి. గతంలోనూ ఇలాంటి జాబ్ మేళ నిర్వహించాము. అప్పట్లో అనూహ్య స్పందన వచ్చింది. ఈ సారి కూడా చాలామంది ఆన్లైన్ ద్వారా ఇప్పటికే జాబ్ మేళాకు తమ స్లాట్ ను నమోదు చేసుకున్నారు.
  సునైనా, డైరెక్టర్ SMC


  APPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... 54 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్

  ఐదు వందలమందికి పైగా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఎలాంటి లాభ పేక్ష లేకుండా... ఎంట్రీ ఫీ అనే పదానికి తావులేకుండా ఉద్యోగ అవకాశాలు ఇవ్వనున్నారు. స్కిల్ల్డ్ ఉద్యోగాలు డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీటెక్, బీఫార్మా వారికీ, సెమి స్కిల్ల్డ్ డిప్లొమా, ఐటిఐ, ఇంటర్, ఇక అన్ స్కిల్ల్డ్ ఎస్ఎస్సి పాస్/ఫెయిల్ అర్హులు.

  జాబ్ మేళాకు వచ్చే వారు కచ్చితంగా మూడు కాపీల రెస్యూమ్ తీసుకురావాలి. 18-35 సంవత్సరాల లోపు వారికే ఇలాంటి అవకాశం దక్కుతుంది. ఇక ఇంటర్వ్యూలో పాల్గొనదలచిన నిరుద్యోగులు http://rebrand.ly/jobmela2021 కు లాగ్ ఇన్ అయ్యి నమోదు చేసుకోవచ్చు. లేదా 91 9642611345, 91 9491100672 కాంటాక్ట్ కావాలి. ఈ జాబ్ మేళా అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. హైదరాబాద్ చిక్కడపల్లి, అశోక్‌నగర్‌లోనే సెంట్రల్ లైబ్రరీలో జాబ్ మేళా జరుగుతుంది.
  Published by:Santhosh Kumar S
  First published: