హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Mandi: ఐఐటీ మండిలో రోబోటిక్స్ పై సమ్మర్ క్యాంప్.. కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ..!

IIT Mandi: ఐఐటీ మండిలో రోబోటిక్స్ పై సమ్మర్ క్యాంప్.. కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ..!

 ఐఐటీ మండిలో రోబోటిక్స్ పై సమ్మర్ క్యాంప్.. కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ .. భారీగా పాల్గొన్న స్టూడెంట్స్ !

ఐఐటీ మండిలో రోబోటిక్స్ పై సమ్మర్ క్యాంప్.. కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ .. భారీగా పాల్గొన్న స్టూడెంట్స్ !

ఐఐటీ మండీకి చెందిన సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (CCE), హిమాచల్ ప్రదేశ్ కౌశల్ వికాస్ నిగమ్ సహకారంతో నిర్వహించిన మొదటి స్కూల్ క్యాంప్ ‘ప్రయాస్ 1.0’ ఇటీవలే ముగిసింది. జులై 1, 2022 నుంచి ప్రారంభమై, జులై22తో ముగిసిన ఈ క్యాంప్‌లో రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? బేసిక్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఇంకా చదవండి ...

ఐఐటీ మండీకి చెందిన సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (CCE), హిమాచల్ ప్రదేశ్ కౌశల్ వికాస్ నిగమ్ సహకారంతో నిర్వహించిన మొదటి స్కూల్ క్యాంప్ ‘ప్రయాస్ 1.0’ ఇటీవలే ముగిసింది. జులై 1, 2022 నుంచి ప్రారంభమై, జులై 22తో ముగిసిన ఈ క్యాంప్‌లో రోబోటిక్స్(Robotics) అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌ బేసిక్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రయాస్ 1.0 పూర్తిగా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) వ్యాప్తంగా 1200 మంది విద్యార్థులను ఎంపిక చేయగా, ఫైనల్‌గా 100 మంది విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి అర్హత సాధించారు.

మూడు వారాల పాటు జరిగిన ఈ క్యాంపులో రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. రోబోలను రూపొందించడంలో వివిధ కాంపోనెంట్స్ సమీకరించడం ఎంతో కీలకం. ఇందుకోసం అనుసరించే ప్రోగ్రామింగ్ పద్ధతులు, సెన్సార్లు, యాక్యుయేటర్స్, కమ్యూనికేషన్ పరికరాలు, పవర్ పరికరాలను ఎలా ఉపయోగిస్తారో విద్యార్థులకు థిరిటికల్ కాన్సెప్ట్, ప్రయోగాత్మక సెషన్ల ద్వారా అవగాహన కల్పించారు. అంతేకాకుండా క్యాంపస్‌లోని మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్స్, టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఐఐటీ మండి క్యాంపస్‌లో విద్యార్థుల కోసం అదనంగా రెగ్యులర్ యోగా(Yoga), ఏరోబిక్స్ తరగతులు, భగవద్గీత సెషన్లు, మోటివేషనల్ డాక్యుమెంటరీస్ వంటి వాటిని కూడా ప్రదర్శించారు. క్యాంప్ ముగింపు వచ్చేసరికి విద్యార్థులు ప్రాసెసింగ్ సెన్సార్ డేటా, పైథాన్ లాంగ్వేజ్‌ సహాయంతో ఒక లైన్ ఫాలోయింగ్ రోబోట్, అడ్డంకులను అధిగించే రోబోట్‌తోపాటు బ్లూటూత్(Bluetooth)-నియంత్రిత కారును రూపొందించారు.

ఈ ఈవెంట్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాన్ని అప్లికేషన్ వరల్డ్‌ను విద్యార్థులకు పరిచయం చేశారు. సాంకేతికతతో మరింత మెరుగులు దిద్దేందుకు టేక్ హోమ్ రోబోటిక్స్ కిట్స్‌ను విద్యార్థులకు అందజేశారు. ప్రయాస్ 1.0 క్యాంప్ ప్రోగ్రామ్ మెగా ముగింపు వేడుకతో ముగిసింది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఇదీ చదవండి: Glowing Skin: ఈ నాలుగు రకాల జ్యూస్‌లతో చర్మ సమస్యలకు చెక్.. ఇలా తయారు చేసుకోండి !ఐఐటీ మండి డైరెక్టర్, ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహెరా మాట్లాడుతూ.. “భవిష్యత్తులో హిమాచల్ నుంచి కనీసం 50 శాతం మంది విద్యార్థులు ఐఐటీ మండిలో చదువుకోవాలని నేను కోరుకుంటున్నా. పాఠశాల విద్యార్థులు ప్రాథమిక దశలోనే నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా ప్రోత్సహిచడం కోసం ఈ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేశాం. ఐఐటీ మండి ఫ్యాకల్టీ, ల్యాబ్ సౌకర్యాలతో ఎక్స్‌పీరియన్స్ పొందడానికి స్కూల్స్, ఐటీఐ టీచర్లను ఆహ్వానించడానికి మేం ప్లాన్ చేస్తున్నాం.’’ అని బెహెరా తెలిపారు.

ఐఐటీ మండిలోని సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ హెడ్ డాక్టర్ తుషార్ జైన్ మాట్లాడుతూ.. “సాంకేతిక నైపుణ్యం అభివృద్ధికి ‘ప్రయాస్ 1.0’ హిమాచల్ ప్రదేశ్‌లో కొత్త శకాన్ని ప్రేరేపించింది. ఇక్కడి యువతకు ఇది చాలా ప్రత్యేకమైన అవకాశం. దీర్ఘకాలంలో ఐఐటీ మండిలో భాగం కావడానికి వారిని మరింత ప్రేరేపిస్తుంది. ఈ ప్రయాస్ 1.0 విద్యార్థులకు సామాజిక, సాంకేతిక, మానవీయ విలువల నైపుణ్యాలపై మరింత అవగాహన కల్పించింది.’’ అని జైన్ పేర్కొన్నారు.

Published by:Mahesh
First published:

Tags: Himachal Pradesh, IIT Madras, JOBS, Robotics

ఉత్తమ కథలు