హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Success Story: ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి.. ఆమె సాధించిన ఘనతకు అంతా షాక్.. విషయం ఏంటంటే..

Success Story: ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి.. ఆమె సాధించిన ఘనతకు అంతా షాక్.. విషయం ఏంటంటే..

Success Story: ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి.. ఆమె సాధించిన ఘనతకు అంతా షాక్.. విషయం ఏంటంటే..

Success Story: ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి.. ఆమె సాధించిన ఘనతకు అంతా షాక్.. విషయం ఏంటంటే..

Success Story: ప్రేమకు వయస్సుతో పని లేదు.. ఏ వయస్సులో ఉన్నవారైనా ప్రేమించొచ్చు, ప్రేమలో పడొచ్చు.. అనేది సినిమాలోని డైలాగ్స్. ఇలా ప్రేమ, పెళ్లి గురించి డైలాగ్స్ సినిమాల్లో చాలా వినిపిస్తుంటాయి. అయితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఎంతో మంది మోటివేషన్ క్లాస్ లు ఇస్తుంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ప్రేమకు(Love) వయస్సుతో(Age) పని లేదు.. ఏ వయస్సులో ఉన్నవారైనా ప్రేమించొచ్చు, ప్రేమలో పడొచ్చు.. అనేది సినిమాలోని డైలాగ్స్(Dialogues). ఇలా ప్రేమ, పెళ్లి గురించి డైలాగ్స్ సినిమాల్లో చాలా వినిపిస్తుంటాయి. అయితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఎంతో మంది మోటివేషన్ క్లాస్ లు(Motivation Class) ఇస్తుంటారు. వాటిని పాటించే వాళ్లు పాటిస్తారు.. మనకు ఎందుకులే.. మన వళ్ల కాదులే అన విదిలేసేవారు కూడా చాలా మంది ఉంటారు. అయితే కష్టపడే తత్వం, దృఢ సంకల్పం ఉంటే.. ఏదైనా సాధించవచ్చు.. దానికి కూడా వయస్సుతో పని లేదు అని నిరూపించింది ఓ మహిళ. మనుషులను ప్రేమించడమే కాదు.. ప్రేమతో ఏపని చేసినా.. ఏ వయస్సులో ఉన్నా.. ఆ పని విజయవంతం అవుతుందని చాటి చెప్పింది ఆ మహిళ.  ఆమె ఏం చేసింది.. ఆమె సాధించిన విజయం ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

Telangana Jobs: అభ్యర్థుల ఆందోళనతో.. తెలంగాణలో మరో రిక్రూట్ మెంట్ రద్దు..

వయసు, పరిస్థితులు ఎలా ఉన్నా.. దృఢ సంకల్పం ఉంటే అన్నింటినీ సక్సెస్‌గా మార్చే శక్తి మీలో ఉంటుందని అంటారు. కొన్నిసార్లు చెడు పరిస్థితి కూడా ఒక వ్యక్తిని వారి మొండితనానికి లొంగిపోయేలా చేస్తుంది. ఆ వ్యక్తి తల్లి అయితే, ఆమె సంకల్పం రెట్టింపు అవుతుంది. ముగ్గురు పిల్లలను చూసుకుని 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ఆ తల్లి. అంతే కాదు.. పాస్ అంటే.. ఏదో బోర్డర్ లో అనుకుంటే పొరపాటే.. ఏకంగా.. 93.4 శాతం ఉత్తీర్ణత సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ఏదైనా చేయాలనే దృఢ సంకల్పం ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన లక్ష్యాన్ని చేరుకోగలరు. కశ్మీర్‌కు చెందిన ఈ మహిళ కూడా అలాంటిదే చేసింది.

ఆమె పెళ్లయిన దాదాపు పదేళ్ల తర్వాత చదువు ప్రారంభించింది. 10వ తరగతిలో 93.4 శాతం మార్కులు సాధించింది. ఈ తల్లి పేరు సబ్రినా ఖలిక్. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన ఈ మహిళ ముగ్గురు పిల్లల తల్లి. ఇంట్లో చాలా బాధ్యతలు ఉన్నాయి. కానీ సబ్రీనా ఖాలిక్‌కు చదువు అంటే ఎంతో ప్రేమ. కాని అమ్మగారి ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవడంతో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి కూడా.. పిల్లలు, భర్తే లోకంగా సాగింది. ఇలా.. భర్త దగ్గర కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా మొండిగా 10వ తరగతి చదివి.. పాసైంది. ఇంటిపనులు చేసుకుంటూ.. చదువును కొనసాగించి 10వ తరగతిలో అడ్మిషన్‌ తీసుకుంది.

Telangana Gurukul Posts: గురుకుల పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు.. 10 వేల పోస్టులకు ముందడుగు..!

ఇటీవల పదో తరగతి పరీక్ష రాసింది. ఆ ఫలితాలు రాగానే అందరూ షాక్ అయ్యారు. ఈ మహిళ 10వ తరగతి పరీక్షలో 93.4% మార్కులు సాధించడమే అందుకు కారణం. సబ్రీనా ఖాలిక్ 2012లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చదువుకు స్వస్తి చెప్పింది. 10 ఏళ్లు పూర్తయ్యాక మళ్లీ చదువు ప్రారంభించింది. ఇప్పుడు ఆమె తన 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా 500 మార్కులకు 467 మార్కులు సాధించింది. ఈమె ఈ ఘనత సాధించడంతో పలువురికి ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె సక్సెస్ స్టోరీ తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ శభాష్.. కంగ్రాట్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Jammu and Kashmir, JOBS, Success story, Trending news

ఉత్తమ కథలు