హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Success Story: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారిన డెలివరీ బాయ్.. వైజాగ్‌ యువకుడి సక్సెస్‌ స్టోరీ ఇదే

Success Story: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారిన డెలివరీ బాయ్.. వైజాగ్‌ యువకుడి సక్సెస్‌ స్టోరీ ఇదే

షేక్ అబ్దుల్ సత్తార్

షేక్ అబ్దుల్ సత్తార్

కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు గెలుపు తలుపు తడుతుందనే విషయాన్ని విశాఖపట్నంకు చెందిన షేక్ అబ్దుల్ సత్తార్  నిరూపించాడు. జొమాటో(Zomato), స్విగ్గీ(Swiggy)లో డెలివరీ బాయ్‌గా పనిచేసిన అబ్దుల్ ఇప్పుడు బెంగళూరులోని ప్రోబ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రైవేట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించాడు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Visakhapatnam, India

కొందరు పని ప్రారంభించేందుకు కూడా ప్రయత్నించరు. ఇంకొందరు ప్రారంభించిన పనిని మధ్యలోనే వదిలేస్తారు. మరికొందరు విజయం సాధించే వరకు పట్టుదలతో శ్రమిస్తూ ఉంటారు. ఈ మాటలను అందరూ ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. అయితే ఇప్పుడు అనేక ప్రయత్నాల అనంతరం విజయాన్ని అందుకున్న ఓ యువకుడి స్టోరీ తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితుల కారణంగా డెలివరీ బాయ్‌గా పని చేస్తూ, ఖాళీ సమయాల్లో జాబ్‌కి ప్రిపేర్‌ అవుతూ, చివరికి సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడిన అతని ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం.

డెలివరీ బాయ్‌ టూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు గెలుపు తలుపు తడుతుందనే విషయాన్ని విశాఖపట్నంకు చెందిన షేక్ అబ్దుల్ సత్తార్ నిరూపించాడు. జొమాటో(Zomato), స్విగ్గీ(Swiggy)లో డెలివరీ బాయ్‌గా పనిచేసిన అబ్దుల్ ఇప్పుడు బెంగళూరులోని ప్రోబ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రైవేట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. తన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికి, అబ్దుల్‌ సత్తార్‌ జొమాటో, స్విగ్గీ, ఓలా వంటి సంస్థలకు డెలివరీ ఏజెంట్‌గా పని చేశాడు. ఉద్యోగం చేస్తూనే స్నేహితుడి సలహా మేరకు ఓ కోడింగ్ కోర్సులో చేరాడు. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. మిగిలిన సమయాల్లో అతను తన కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోవడానికి ప్రాక్టీస్‌ చేసేవాడు.

తన ప్రయాణం గురించి అబ్దుల్‌ సత్తార్‌ లింక్డ్‌ఇన్‌లో ఓ పోస్టు చేశాడు. అందులో.. ‘నేను వీలైనంత త్వరగా నా కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటున్నాను. మా నాన్న కాంట్రాక్ట్ ఉద్యోగి కాబట్టి మా రోజువారీ అవసరాలకు సరిపడా డబ్బు మాత్రమే ఉండేది. నేను మొదట్లో చాలా సిగ్గుపడేవాడిని, కానీ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను.’ అని పేర్కొన్నాడు.

ఆ జాబ్‌తోనే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరిగాయి.

అబ్దుల్ తన కమ్యూనికేషన్ స్కిల్స్‌ మెరుగవడానికి డెలివరీ ఏజెంట్‌ ఉద్యోగం ఉపయోగపడిందని చెప్పాడు. అతను వెబ్ అప్లికేషన్‌ను కూడా క్రియేట్‌ చేశాడు. కొన్ని చిన్న ప్రాజెక్ట్‌లలో పనిచేశాడు. ఈ అనుభవం తర్వాత అతను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు అప్లై చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే Nxt Wave లో కోడింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నాడు. ప్రోబ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (Probe42)లో ఇంటర్వ్యూలో విజయం సాధించాడు. కంపెనీ అతనికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా అవకాశం ఇచ్చింది. అబ్దుల్ ఇప్పుడు తన కొత్త ఉద్యోగంతో తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవ గలుగుతున్నాడు. అబ్దుల్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో జావాస్క్రిప్ట్, పైథాన్, SQL, Node.js వంటి సాఫ్ట్‌వేర్ లాంగ్వేజెస్‌లో నైపుణ్యం ఉందని పేర్కొన్నాడు.

First published:

Tags: IT jobs, JOBS, Success story, Zomato

ఉత్తమ కథలు