హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Success Story: వైకల్యం ఓడింది.. చూపు లేకున్నా రూ.47 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్.. ఇదే కదా అసలైన విజయం..

Success Story: వైకల్యం ఓడింది.. చూపు లేకున్నా రూ.47 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్.. ఇదే కదా అసలైన విజయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Success Story: ఈ రోజుల్లో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా ఏదో ఒక చిన్న కారణంతో నిరుత్సాహ పడిపోతూ తమ కలలను మధ్యలోనే వదిలేస్తున్నారు ప్రజలు. అయితే తాజాగా వారందరికీ ఒక అంధుడు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా ఏదో ఒక చిన్న కారణంతో నిరుత్సాహ పడిపోతూ తమ కలలను మధ్యలోనే వదిలేస్తున్నారు ప్రజలు. అయితే తాజాగా వారందరికీ ఒక అంధుడు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇతను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer) కావాలని చిన్నతనం నుంచే కలలుకన్నారు. కానీ గ్లకోమా సమస్యతో ఎనిమిదేళ్ల ప్రాయంలోనే చూపు పూర్తిగా కోల్పోయారు. అయితేనేం తన కలలే కళ్లై అతన్ని సరైన మార్గంలో ముందుకు నడిపించాయి. అలా ఆ అంధుడు (Visually Impaired) ఈ రోజున మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థలో రూ.47 లక్షల యాన్యువల్ ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌ని దక్కించుకోగలిగారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో అంత పెద్ద ప్యాకేజీతో జాబ్ ఆఫర్ రావడంతో తల్లిదండ్రులు బాగా సంతోష పడుతున్నారు.వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)కు చెందిన 25 ఏళ్ల యశ్‌ సోనాకియా చిన్నతనం నుంచే దృష్టి లోపంతో బాధపడుతున్నారు. ఎనిమిదేళ్ల వయసులో కంటి చూపు కోల్పోయారు. అయినా కూడా ఏమాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఇంటర్ పూర్తిచేశారు.
2021లో ఇండోర్‌లోని శ్రీ గోవింద్రం సెక్సరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (SGSITS) నుంచి బీ.టెక్ డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్‌ నుంచి రూ.47 లక్షల వార్షిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్ రావడంతో ఆ ఆఫర్‌ను అంగీకరించారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌కు చెందిన బెంగళూరు కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరడానికి సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుత కంపెనీ రూల్స్ ప్రకారం సోనాకియా వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ చేసుకోవచ్చు.


ఇంత పెద్ద ఘనత సాధించిన యశ్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఇప్పటివరకు తన ప్రయాణాన్ని వివరిస్తూ.. “ప్రారంభంలో ఇది చాలా కష్టమైన రైడ్, కానీ నెమ్మదిగా, స్థిరంగా ప్రతిదీ సాధారణమైంది. నా కాలేజీ, నా స్నేహితులు నాకు చాలా సహాయం చేసారు. ఇంటర్నెట్ నాకు చాలా సహాయపడింది. నేను చాలా సవాళ్లను ఎదుర్కొన్నాను కానీ ఇతర వ్యక్తుల నుంచి కూడా మద్దతు పొందాను. దృష్టి లోపం ఉన్నవారు నిస్సహాయంగా ఫీలవుతుంటారు. కొన్ని రంగాల్లో కొనసాగలేమని ఊరికే కూర్చుంటారు. అలా కాకుండా వారు రాణించగల రంగంలో 100 శాతం కృషి చేయాలి" అన్నారు.
మైక్రోసాఫ్ట్ ద్వారా యశ్‌ ఎలా ఎంపికయ్యారు?
స్క్రీన్-రీడర్ సాఫ్ట్‌వేర్ సహాయంతో యశ్‌ తన చదువు పూర్తి చేశారు. తర్వాత ఉద్యోగం కోసం వెతకడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో కోడింగ్ నేర్చుకుని మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగానికి అప్లై చేశారు. మైక్రోసాఫ్ట్‌ నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్ష క్లియర్ చేసి ఇంటర్వ్యూలో కూడా అదరగొట్టారు. దాంతో అతనికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాబ్‌ను కంపెనీ ఆఫర్ చేసింది.
ఇది కూడా చదవండి : ఇంగ్లీష్ ఇడియమ్స్ అంటే ఏంటి..? వీటిని ఎప్పుడు వాడాలి..? ఉదాహరణలు చూడండి..
కొడుకును చూసి గర్వంగా ఫీల్ అవుతున్నా: యశ్‌ తండ్రి
యశ్‌ తండ్రి ఇండోర్‌లోని ఒక సాధారణ క్యాంటీన్ యజమాని. మైక్రోసాఫ్ట్‌లో మంచి జాబ్ రావడంతో ఆ తండ్రి సంతోషంతో ఉప్పొంగిపోయారు. "నా కొడుకు నాకు గర్వకారణం. ఈ రోజు అతను తనను తాను నిరూపించుకున్నాడు." అని ఆయన సంతోషంగా చెప్పుకొచ్చారు. పుట్టిన మరుసటి రోజు నుంచే యశ్‌కి గ్లకోమా ఉందని ఆయన వెల్లడించారు.
“నా కుమారుడు ఎనిమిదేళ్లు వచ్చేసరికి పూర్తిగా కంటి చూపు కోల్పోయాడు. కానీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనే కోరికను వదులుకోలేదు. ఇది ఒక పోరాటమే కానీ మనం సంకల్పంతో పోరాడితే ఏదైనా చిన్నదిగానే అనిపిస్తుంది. ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనే అతని కల చాలా కష్టాల తర్వాత ఎట్టకేలకు నెరవేరింది” అని తండ్రి అన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, Dreams, EDUCATION, JOBS, Microsoft, Success story

ఉత్తమ కథలు