Home /News /jobs /

SUCCESS STORY HOW BIHAR BOY AYUSH CRACKED UPSC CSE IN FIRST ATTEMPT WITHOUT ANY COACHING GH SK

UPSC Civils: కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 74వ ర్యాంక్.. బిహార్ యువకుడి సక్సెస్ స్టోరీ

UPSC Success Story: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే సివిల్స్‌లో సత్తా చాటిన లాల్ ఆయుష్ వెంకట్ వాట్స్ యువతరానికి స్ఫూర్తిదాయకంగా మారారు. డెడికేషన్, ప్లానింగ్ ఉంటే సివిల్స్‌లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని ఆయుష్ నిరూపించారు. అతని సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (UPSC CSE)లో ఉత్తీర్ణత సాధించడం మామూలు విషయం కాదు. అందుకే చాలామంది అభ్యర్థులు తమ తొలి ప్రయత్నంలో ఫెయిల్ అవుతుంటారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ (Civils)లో విజయం సాధించే వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పవచ్చు. పట్టు విడవకుండా ఏళ్ల తరబడి ప్రిపేరయితేనే ఈ డిఫికల్ట్ ఎగ్జామ్స్‌లో పాస్ కావడం సాధ్యమవుతుంది. అయితే బిహార్ యువకుడు మాత్రం ఫస్ట్ అటెమ్ట్‌లోనే ఆల్ ఇండియా ర్యాంక్ 74తో మెరిశాడు. అది కూడా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే. 2021లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే సివిల్స్‌లో సత్తా చాటిన లాల్ ఆయుష్ వెంకట్ వాట్స్ (Lal Ayush Venkat Vats) ఇప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకంగా మారారు. డెడికేషన్, ప్లానింగ్ ఉంటే సివిల్స్‌లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని ఆయుష్ నిరూపించారు. అతని సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం.

జులైలో తెలంగాణలో ఎంసెట్, ఐసెట్ తో పాటు మొత్తం 6 ఎంట్రెన్స్ ఎగ్జామ్స్.. తేదీలివే

బిహార్‌లోని నవాడా సిటీకి చెందిన లాల్ ఆయుష్ వెంకట్ 2021లో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌ చేశాడు. అనంతరం ఉద్యోగంలో చేరారు కానీ అందులో సంతృప్తి లభించకపోవడంతో యూపీఎస్సీ ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. ఇందులో ఉత్తీర్ణత సాధించేందుకు రోజుకి పదహారు గంటలపాటు చదివాడు. ఈ పరీక్షకు ప్రిపేర్ కావాలని తనను తన తండ్రి ప్రోత్సహించారని ఆయుష్ తెలిపాడు. ప్రిపరేషన్ నిమిత్తం ఆన్‌లైన్‌లో స్టడీ మెటీరియల్‌ని సేకరించారు. ఆ మెటీరియల్‌ని క్షుణ్ణంగా చదివి, నోట్స్‌ను చాలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాడు. అలానే యూట్యూబ్‌లో ఐఏఎస్ కుమార్ అనురాగ్ లెసన్స్ ఫాలో అయ్యాడు. నోట్స్‌ను రివిజన్ చేయడం, రీ-రివిజన్ చేయడం, నోట్స్ ప్రిపేర్ చేసే ముందు ప్రాథమిక అంశాలు నేర్చుకోవడం వల్ల పరీక్షలో చాలా హెల్ప్ అయిందని ఆయుష్ చెప్పుకొచ్చాడు. ఇలా సొంత ప్రణాళికతోనే సివిల్స్‌లో విజయం సాధించాడు. అంతేకాదు, ఏకంగా 100 లోపు ర్యాంకు సాధించి సత్తా చాటాడు.

త్వరలోనే కలెక్టర్ బాధ్యతలు స్వీకరించనున్న ఆయుష్ తన 10వ తరగతిని 2015లో డియోఘర్‌లో పూర్తి చేశాడు. సెంట్రల్ అకాడమీ కోట రాజస్థాన్‌లో 2017లో 12వ తరగతి పరీక్షలో పాసయ్యాడు. ఆయుష్ తండ్రి తరుణ్ కుమార్ రిటైర్డ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) కాగా ప్రస్తుతం బేలాడ్ గ్రామంలో నివసిస్తున్నారు. తల్లి నిషా సింగ్ కటోరియా బంకాలోని ప్రాజెక్ట్ గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు. ఆయుష్‌కి ఉన్న ఇద్దరు సిస్టర్స్ డాక్టర్లు కావడం విశేషం. యూపీఎస్సీ సివిల్ 2022 పరీక్షలో 244 జనరల్, 73 ఈడబ్ల్యూఎస్ (EWS), 203 ఓబీసీ, 105 ఎస్సీ, 60 ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Bihar, Civils, EDUCATION, JOBS, Success story, UPSC

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు