హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. మరో నోటిఫికేషన్ విడుదల..

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. మరో నోటిఫికేషన్ విడుదల..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana Jobs: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సాంఘిక, గిరిజన, ఏకలవ్య గురుకుల విద్యాలయ సొసైటీ TSWREIS, TTWREIS పాఠశాలలో సబ్జెక్ట్ అసోసియేట్స్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్, హైదరాబాద్, TSWREI అండ్ TTWREI సొసైటీల పేద కుటుంబాల పిల్లలకు JEE మెయిన్స్/అడ్వాన్స్‌డ్ అండ్ NEET, ఎంసెట్ పరీక్షలకు సంబంధించి కోచింగ్ అందించడానికి సీనియర్‌ ఫ్యాకల్టీకి అనుబంధంగా.. పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్‌ పోస్టుల (Subject Associate Posts) భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం TWREIS యొక్క అధికారిక వెబ్‌సైట్ tgtwgurukulam.telangana.gov.in ను సందర్శించండి లేదా TSWREIS యొక్క అధికారిక వెబ్‌సైట్ www.tswreis.inను కూడా సందర్శించవచ్చు.

ITBP Recruitment 2022: ఐటీబీపీలో SI పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండిలా..


TSWREIS అండ్ TTWREISలో ఖాళీలు:

1) మ్యాథ్స్: 26

2) కెమిస్ట్రీ: 32

3) ఫిజిక్స్: 29

4) బోటనీ: 30

5) జువాలజీ: 32

ఖాళీలు మొత్తం: 149

సబ్జెక్ట్ అసోసియేట్‌ల కోసం అర్హత ప్రమాణాలు:

పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మొదటి డివిజన్‌తో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. JEE మెయిన్స్/అడ్వాన్స్‌డ్ అండ్ NEET, ఎంసెట్ బోధనలో అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసే క్రమంలో ఒక్క సబ్జెక్ట్ కు ఒక్క దరఖాస్తు మాత్రమే చేసుకోవాలి.

ఎంపిక విధానం.. రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. ఒక్కో సబ్జెక్టులో 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా 1:3 నిష్పత్తిలో డెమో అండ్ ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఎంపికైన అభ్యర్థులు 30 ఏప్రిల్ 2023 వరకు పని చేయాల్సి ఉంటుంది.

మొత్తం మార్కులు 150కి ఉంటుంది. అందులో రాత పరీక్షకు 100, డెమోకు 25, ఇంటర్వ్యూకు 25 మార్కులను కేటాయించారు. మెరిట్ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

1. ఆన్‌లైన్ దరఖాస్తు 16-07-2022 నుండి ప్రారంభమయింది.

2. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 23-07-2022 ,

3. రాత పరీక్ష తేదీ: 31-07-2022

4. డెమో/ఇంటర్వ్యూ: 08-08-2022

4. పరీక్ష ఫీజు రూ.500 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

వయోపరిమితి: డిసెంబర్‌ 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

వేతనం: సీనియర్ సబ్జెక్ట్ ఫ్యాకల్టీకి వారి పనితీరుపై జీతం ఆధారపడి ఉంటుంది. సబ్జెక్ట్ అసోసియేట్ లకు నెలకు రూ.25,000 చెల్లిస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:

Step 1 : ఆసక్తి గల అభ్యర్థులు www.tgtwgurukulam.telangana.gov.inవెబ్ సైట్ కు వెళ్లాలి.

Step 2 : స్క్రోల్ అవుతున్న ఈ లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

Step 3 : మొదట ఇక్కడ ఓపెన్ అయిన విండోలో పేమెంట్ చేయాలి. త

Step 4 : పేమెంట్ తర్వాత ఆన్ లైన్ లో అప్లికేషన్ ను సబ్ మిట్ చేయాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పూర్తి నోటిఫికేషన్ పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

First published:

Tags: Career and Courses, JOBS, Jobs in telangana, Telangana government jobs

ఉత్తమ కథలు